Begin typing your search above and press return to search.

చరణ్‌ 'రంగస్థలం' తర్వాతే ఇదంతా : శివ నిర్వాన

నిన్ను కోరి, మజిలి వంటి సెన్సిబుల్‌ సబ్జెక్ట్‌లతో ప్రేక్షకులను అలరించి, విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న దర్శకుడు శివ నిర్వాణ.

By:  Ramesh Palla   |   20 Aug 2026 1:00 PM IST
చరణ్‌ రంగస్థలం తర్వాతే ఇదంతా : శివ నిర్వాన
X

నిన్ను కోరి, మజిలి వంటి సెన్సిబుల్‌ సబ్జెక్ట్‌లతో ప్రేక్షకులను అలరించి, విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న దర్శకుడు శివ నిర్వాణ. ప్రస్తుతం ఈయన 'ఇరుముడి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. రవితేజ హీరోగా రూపొందిన ఈ 'ఇరుముడి' సినిమాను రేపు అంటే ఆగస్టు 21న విడుదల చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో రవితేజ చాలా యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. ట్రైలర్‌ విడుదలైన తర్వాత అంచనాలు భారీగా పెరిగిన విషయం తెల్సిందే. దర్శకుడు శివ నిర్వాన మరోసారి తనదైన మార్క్‌ సెన్సిబుల్‌ సబ్జెక్ట్‌తో ఈ సినిమాను రెడీ చేసుకున్నట్లు పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు. ఇలాంటి పాత్రను చేసేందుకు రవితేజ ఒప్పుకోవడం గొప్ప విషయం అని కూడా దర్శకుడు శివ నిర్వాణ చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

ఇరుముడి దర్శకుడు శివ నిర్వాణ...

తాజాగా దర్శకుడు శివ నిర్వాన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హీరో రామ్ చరణ్‌పై ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం హీరోలు అంతా మంచి కథలు, సబ్జెక్ట్‌, పాత్రల కోసం చూస్తున్నారు. రామ్‌ చరణ్‌ 'రంగస్థలం' సినిమా చేసిన తర్వాత చాలా మంది హీరోల మైండ్‌ సెట్‌ మారిందని, రంగస్థలంలో రామ్‌ చరణ్‌ పోషించిన పాత్ర కచ్చితంగా ట్రెండ్‌ సెట్టర్‌ అని శివ నిర్వాన చెప్పుకొచ్చాడు. రామ్‌ చరణ్‌ తన ఇమేజ్‌ను పక్కన పెట్టి ఆ పాత్ర చేయడం వల్లే ఇప్పుడు చాలా మంది హీరోలు సైతం ఇమేజ్‌ను పక్కన పెట్టి సబ్జెక్ట్‌లను ఎంపిక చేసుకుంటున్నారు అని శివ నిర్వాన అన్నాడు. కమర్షియల్‌ హీరో అయ్యి ఉండి ఇలాంటి పాత్రలు చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారా అనే అనుమానాలు గతంలో ఉండేవి. కానీ ఎప్పుడైతే రామ్‌ చరణ్‌ 'రంగస్థలం' సినిమా చేశాడో అప్పటి నుంచి హీరోల మైండ్‌ సెట్‌ అంతా మారింది అన్నట్లుగా శివ నిర్వాన అభిప్రాయం వ్యక్తం చేశారు.

రామ్‌ చరణ్‌ 'రంగస్థలం' సినిమా తర్వాత...

రామ్‌ చరణ్‌ అయ్యప్ప స్వామిని ఎక్కువగా నమ్ముతారు అనే విషయం తెల్సిందే. అందుకే ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ గెస్ట్‌ అప్పియరెన్స్‌ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. రామ్‌ చరణ్‌ మాత్రమే కాకుండా శర్వానంద్‌తోనూ చిన్న పాత్రను ఈ సినిమాలో దర్శకుడు శివ నిర్వాణ చేయించాడనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు ఆ విషయమై దర్శకుడు లీక్‌ ఇవ్వలేదు. సినిమా విడుదల అయ్యే వరకు ఆ విషయమై క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ఒకవేళ సినిమాలో ఆ ఇద్దరు హీరోలు కనిపిస్తే కచ్చితంగా స్క్రీన్స్‌ షేక్‌ కావడం ఖాయం. రవితేజ ఈ సినిమాలో తన మాస్ ఇమేజ్‌ను పక్కన పెట్టి, కొత్తగా కనిపించబోతున్నట్లు శివ నిర్వాన చెప్పుకొచ్చాడు. ఇరుముడి సినిమాతో కొత్త తరహా సినిమాలకు బీజం పడుతుందని కూడా పలువురు యూనిట్‌ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్ది అంచనాలు పెరుగుతున్న నేపథ్యంలో భారీ ఎత్తున బుకింగ్ నమోదు అవుతున్నాయి.

రవితేజ ఇరుముడి సినిమాతో హిట్‌...

రవితేజ గత చిత్రాల ఫలితాలతో సంబంధం లేదు అన్నట్లు ఈ సినిమా భారీ ఓపెనింగ్స్‌ను దక్కించుకోబోతుంది అనే విశ్వాసంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. అందుకు సాక్ష్యం అన్నట్లుగా భారీ అడ్వాన్స్ బుకింగ్ నమోదు అవుతున్నాయి. మాస్‌ ఇమేజ్ ఉన్న హీరోలు, కమర్షియల్‌ ఇమేజ్ ఉన్న హీరోలు తమ ఇమేజ్‌ను పక్కన పెట్టి సినిమాలు చేస్తే ఎలా ఉంటుంది అనేది రంగస్థలం తో పాటు పలు సినిమాలు నిరూపించాయి. ఇటీవల వచ్చిన అఖిల్‌ లెనిన్‌ సినిమా సైతం ఆ విషయాన్ని నిరూపితం చేసిందని, కనుక తప్పకుండా ఈ సినిమా సైతం ఆకట్టుకుంటుంది అనే విశ్వాసంను దర్శకుడు శివ నిర్వాణ వ్యక్తం చేశారు. ఇరుముడి సినిమాలోని తండ్రి, కూతురు సెంటిమెంట్‌తో పాటు, యాక్షన్‌ సీన్స్‌, అయ్యప్ప స్వామి సీన్స్ తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తాయనే నమ్మకం వ్యక్తం అవుతోంది. రవితేజ చాలా కాలం తర్వాత పెద్ద సక్సెస్‌ను ఇరుముడి సినిమాతో అందుకోబోతున్నాడని అభిమానులు నమ్మకంగా ఉన్నారు.