Begin typing your search above and press return to search.

శివ నిర్వానకి స్టార్స్ కాల్స్... నెక్ట్స్ ఎవరితో..?

ఇప్పుడు ఇరుముడి దర్శకుడు శివ నిర్వాన వెంట పలువురు నిర్మాతలు పడుతున్నట్లు తెలుస్తోంది. తమ బ్యానర్‌లో ఒక సినిమా చేయమని అడ్వాన్స్ ఇచ్చేందుకు తెగ ఫోన్‌లు చేస్తున్నారట.

By:  Ramesh Palla   |   31 Aug 2026 2:00 PM IST
శివ నిర్వానకి స్టార్స్ కాల్స్... నెక్ట్స్ ఎవరితో..?
X

ఇండస్ట్రీలో ఒక సినిమా హిట్ అయిన వెంటనే హీరో వెంట నిర్మాతలు, దర్శకుడి వెంట హీరోలు, నిర్మాతలు పడటం చాలా కామన్‌ విషయం. మీడియం రేంజ్ సినిమా తీసి పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకులకు వరుస ఆఫర్స్ తలుపు తట్టడం మనం చూస్తూ ఉంటాం. ఇక కొత్త దర్శకులు హిట్ కొడితే వారిని నిర్మాతలు, హీరోల మేనేజర్‌లు సంప్రదించడం జరుగుతుంది. ఇప్పుడు ఇరుముడి దర్శకుడు శివ నిర్వాన వెంట పలువురు నిర్మాతలు పడుతున్నట్లు తెలుస్తోంది. తమ బ్యానర్‌లో ఒక సినిమా చేయమని అడ్వాన్స్ ఇచ్చేందుకు తెగ ఫోన్‌లు చేస్తున్నారట. ఇప్పుడు కాకున్నా భవిష్యత్తులో ఎప్పుడైనా పర్వాలేదు మా బ్యానర్‌లో ఒక సినిమాను చేసేందుకు అడ్వాన్స్ తీసుకో అంటూ వెంట పడుతున్నారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే శివ నిర్వాన ఇప్పటి వరకు కొత్త సినిమాకు కమిట్‌ కాలేదు అనేది వాస్తవం.

ఇరుముడి సినిమాతో బాక్సాఫీస్‌ వద్ద...

నిర్మాతలు మాత్రమే కాకుండా హీరోలు సైతం శివ నిర్వానతో టచ్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేశారట. ఇప్పటికే కొంత మంది హీరోలు శివ నిర్వానతో స్వయంగా ఫోన్ ద్వారా మాట్లాడి ఇరుముడి సినిమా విజయం నేపథ్యంలో శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు, ఇద్దరం కలిసి సినిమా చేద్దాం, ఏమైనా స్క్రిప్ట్‌ ఉంటే చెప్పు అన్నట్లుగా మాట్లాడారట. ఇంతకు ముందు శివ నిర్వాన కథలు చెప్పిన హీరోలు సైతం ఇప్పుడు ఫోన్‌ చేసి, మనం గతంలో చర్చించిన కథ ఉంటే చేద్దాం అన్నట్లుగా మాట్లాడుతున్నారట. ప్రస్తుతం శివ నిర్వాన పూర్తి దృష్టి ఇరుముడి సినిమా ప్రమోషన్‌తో పాటు, ఇరుముడి సక్సెస్‌ను ఎంజాయ్‌ చేయడం. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో వచ్చిన ఇరుముడి సినిమా బాక్సాఫీస్‌ వద్ద సంచలనం సృష్టిస్తున్న విషయం తెల్సిందే. విడుదలైన రెండో ఆదివారం అత్యధిక షో లు హౌస్ ఫుల్‌ కావడంతో పాటు, ఆక్యుపెన్సీ రేటు రికార్డ్‌ స్థాయిలో ఉన్నట్లు బాక్సాఫీస్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

శివ నిర్వాన బ్యాక్ టు బ్యాక్ హిట్‌...

ఇరుముడి సినిమాకు వస్తున్న కలెక్షన్స్‌, ఆ సినిమా సాధిస్తున్న రికార్డ్‌ల నేపథ్యంలో పలువురు హీరోలు తమ తదుపరి సినిమాను శివ నిర్వానతో చేయాలని భావిస్తున్నారట. యంగ్‌ హీరోలు, టైర్‌ 2 హీరోలు మాత్రమే కాకుండా ఒకరు ఇద్దరు స్టార్‌ హీరోలు సైతం శివ నిర్వాన వైపు చూస్తున్నారు అనే టాక్‌ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. కెరీర్‌ ఆరంభం నుంచి సెన్సిబుల్‌ దర్శకుడు అంటూ పేరు సొంతం చేసుకుని, విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంటూ, కెరీర్‌లో ముందుకు సాగుతున్న శివ నిర్వానతో కొంత మంది సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపించేవారు కాదు. కానీ ఇరుముడి ఫలితంతో ఇప్పుడు అందరు హీరోలు ఆయనతో ఒక సినిమా ప్లాన్‌ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారట. ఒక మంచి సబ్జెక్ట్‌తో వస్తే ఎప్పుడైనా డేట్లు ఇస్తాను అంటూ ఒక టైర్ 2 హీరో స్వయంగా శివ నిర్వానతో అన్నాడంటూ పుకార్లు గుప్పుమంటున్నాయి.

బాలకృష్ణతో శివ నిర్వాన మూవీ పుకార్లు...

దర్శకుడు శివ నిర్వాన తన తదుపరి సినిమాకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ వారు ఇప్పటికే శివ నిర్వానకి మరో సినిమాకు గాను అడ్వాన్స్ ఇచ్చారట. అయితే మైత్రి వారితో తన తదుపరి సినిమా చేస్తాడా, లేదా మరేదైనా బ్యానర్‌కి ఇప్పటికే కమిట్‌మెంట్‌ ఇచ్చాడా అనేది తెలియాల్సి ఉంది. స్టార్‌ హీరోల నుంచి పిలుపు వస్తున్న నేపథ్యంలో శివ నిర్వాన ఆచితూచి వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి. శివ తన ప్రతి సినిమాకి కాస్త ఎక్కువ సమయం తీసుకోవడం మనం చూస్తున్నాం. కనుక ఈ సారి కూడా శివ మినిమం సమయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కనుక శివ కొత్త సినిమా ఎప్పుడు, ఎవరితో అనే విషయాలు తెలియాలి అంటే వచ్చే ఏడాది వరకు వెయిట్‌ చేయాల్సిందే. సోషల్‌ మీడియాలో కొందరు బాలకృష్ణతో శివ నిర్వాన మూవీ అంటూ ప్రచారం చేస్తున్నారు. కానీ ఆ విషయమై ఎలాంటి క్లారిటీ లేదు. కనుక అవన్నీ పుకార్లు మాత్రమే.