Begin typing your search above and press return to search.

నాలో మాస్ యాంగిల్ లేపింది ఆ ఊరే: శివ నిర్వాణ

ఈ వేదికపై మాట్లాడుతూ, ఆ ఊరితో తనకున్న పాత జ్ఞాపకాలను, తాను చేసిన రచ్చ మాస్ పనులను ఆయన తనదైన స్టైల్ లో ఆడియన్స్ కు పంచుకున్నారు.

By:  M Prashanth   |   28 Sept 2026 10:05 AM IST
నాలో మాస్ యాంగిల్ లేపింది ఆ ఊరే: శివ నిర్వాణ
X

అనకాపల్లి అనగానే తనకు ఒక ఎమోషనల్ కనెక్షన్ ఉందని, తన డిగ్రీ జీవితం అక్కడే సాగిందని స్టార్ డైరెక్టర్ శివ నిర్వాణ ఓపెన్ అయ్యారు. అక్టోబర్ 2న రిలీజ్ అవుతున్న 'అనకాపల్లి' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఆయన ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ వేదికపై మాట్లాడుతూ, ఆ ఊరితో తనకున్న పాత జ్ఞాపకాలను, తాను చేసిన రచ్చ మాస్ పనులను ఆయన తనదైన స్టైల్ లో ఆడియన్స్ కు పంచుకున్నారు.

"నా ఇంటర్మీడియట్ వైజాగ్ లో చదివాను. కానీ సెకండ్ ఇయర్ లో సినిమాల పిచ్చి పట్టి కెమిస్ట్రీ తన్నింది. దాంతో అక్కడి నుంచి డిగ్రీ కోసం అనకాపల్లిలోని కొణతాల కాలేజీలో అడుగుపెట్టాను" అంటూ శివ నిర్వాణ తన ఫ్లాష్ బ్యాక్ ను గుర్తు చేసుకున్నారు. వైజాగ్ లో ఉన్నంత వరకు తనలో ఉన్న ఆ క్లాస్ యాంగిల్ అంతా అనకాపల్లిలో అడుగుపెట్టగానే ఎటో పోయిందని, ఆ మూడేళ్లు తన జీవితంలో ఒక పక్కా రచ్చ మాస్ ఫేజ్ అని ఆయన చెప్పుకొచ్చారు.

"గాంధీనగర్, పెరుగు బజార్, వేలుపుల వీధి, పార్క్ సెంటర్.. ఇలా అనకాపల్లిలో నేను తిరగని ఏరియా లేదు, పడని గొడవ లేదు. అప్పట్లో నేను అలా ఉన్నానా అని ఇప్పుడు తలచుకుంటే ఆశ్చర్యంగా ఉంటుంది" అని నిర్వాణ ఓపెన్ అయ్యారు. ఆ ఇన్సిడెంట్ల మీద అనకాపల్లి టైటిల్ తో ఒక సినిమా చేద్దామని తాను ఎప్పటినుంచో అనుకుంటుంటే, త్రినాథరావు గారు తనకు ఛాన్స్ ఇవ్వకుండా ఆ టైటిల్ కొట్టేశారని ఆయన సరదాగా కామెంట్ చేశారు.

సుబ్రహ్మణ్యపురం, పలాస సినిమాల్లాగే అనకాపల్లి గడ్డ మీద కూడా ఒక బరువైన ఎమోషన్ ఉంటుందని, ఆ యాస, బావోద్వేగాలను కరెక్ట్ గా పట్టుకుంటే సినిమా వేరే లెవెల్ లో ఉంటుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. ఇక ఈ చిత్రంలో కీ రోల్ చేసిన నిర్మాత త్రినాథరావు నక్కిన గురించి మాట్లాడుతూ.. ఎప్పుడూ నవ్విస్తూ పాజిటివ్ గా ఉండే ఆయన, ఈ సినిమాలో ఇంత సీరియస్ రోల్ ఎందుకు చేశారోనని ఆశ్చర్యపోయారు. ఆయన నటన చూశాక ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుల లోటు తీరుతుందన్నారు.

విలన్ గా చేసిన తారక్ పొన్నప్పను చూస్తేనే కళ్లు హుక్ అయ్యే బాడీ లాంగ్వేజ్ ఉందని, పుష్పలో ఆయన్ని చూసి తాను భయపడ్డానని శివ ప్రశంసించారు. నటి ఇంద్రజ ఇప్పటికీ 'సొగసు చూడ తరమా' టైమ్ లాగానే ఉన్నారని, ఆమెలో ఫుల్ పాజిటివిటీ కనిపిస్తుందని కితాబిచ్చారు. ఇక ఈ సినిమా వెనుక ఉన్న నిర్మాత లగడపాటి శ్రీధర్.. ఇండస్ట్రీలోనే మోస్ట్ పాజిటివ్ పర్సన్ అని, ఆయన కొడుకు విక్రమ్ ఈ సినిమాతో సాలిడ్ హిట్ అందుకోవాలని కోరుకున్నారు.

ఇదే వేడుకకు వచ్చిన స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ తనకు అతిపెద్ద ఇన్స్పిరేషన్ అని శివ నిర్వాణ తన మనసులో మాట బయటపెట్టారు. ఆది సినిమా నుంచి ఆయన సక్సెస్ ను హ్యాండిల్ చేసిన విధానం చూసి, లాంగ్ కెరీర్ ఉండాలంటే వినాయక్ గారి లాగే ఉండాలని తాను ఫిక్స్ అయినట్లు వెల్లడించారు. ఫైనల్ గా అక్టోబర్ 2న థియేటర్లలోకి వస్తున్న అనకాపల్లి సినిమా క్రియేట్ చేసే సౌండ్.. రెండు రాష్ట్రాల్లో గట్టిగా వినిపించాలని ఆయన కోరుకున్నారు.