పరాశక్తి మీద మదరాసి ఎఫెక్ట్..!
శివ కార్తికేయన్ రీసెంట్ మూవీ మదరాసి బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సందడి చేయట్లేదు. మురుగదాస్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించింది.
By: Ramesh Boddu | 9 Sept 2025 2:00 PM ISTశివ కార్తికేయన్ రీసెంట్ మూవీ మదరాసి బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సందడి చేయట్లేదు. మురుగదాస్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించింది. మదరాసి ముందు ఇది మరో గజినీ సినిమా అవుతుందని డైరెక్టర్ మురుగదాస్ చెప్పాడు. కానీ సినిమా అంచనాలను అందుకోవడంలో ఫెయిల్ అయ్యింది. ఈమధ్య వరుస హిట్లతో సూపర్ ఫాం లో ఉన్న శివ కార్తికేయన్ మదరాసితో షాక్ తిన్నాడని చెప్పొచ్చు. సినిమాలో శివ కార్తికేయన్ కూడా ఆశించిన విధంగా మెప్పించలేదన్న టాక్ ఉంది.
సుధ కొంగర డైరెక్షన్ లో..
ఐతే మదరాసి ఎఫెక్ట్ నెక్స్ట్ అతను చేస్తున్న పరాశక్తి మీద పడినట్టు ఉంది. సుధ కొంగర డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా పీరియాడికల్ కథతో వస్తుంది. సినిమాలో శివ కార్తికేయన్ స్టూడెంట్ లీడర్ గా చేస్తున్నాడు. పరాశక్తి సినిమాలో రవి మోహన్, బసిల్ జోసెఫ్, రానా, అధర్వ, శ్రీలీల నటిస్తున్నారు. పరాశక్తి స్టార్ కాస్ట్ చూస్తుంటే సుధ కొంగర ఏదో గట్టి ప్లానింగ్ తోనే వస్తున్నారని అనిపిస్తుంది.
పరాశక్తి సినిమాను 2026 సంక్రాంతికి రిలీజ్ అనుకున్నారు. కానీ ప్రస్తుతం ఆ సినిమా సంక్రాంతి నుంచి సమ్మర్ కి షిఫ్ట్ చేయాలని చూస్తున్నారట. 2026 సంక్రాంతికి ఆల్రెడీ దళపతి విజయ్ జన నాయగన్ వస్తుంది. విజయ్ చివరి సినిమా కాబట్టి పోటీ ఉండకుండా చేస్తే బెటర్ అనేలా ఉంది. మరోపక్క ప్రభాస్ రాజా సాబ్ సినిమా కూడా సంక్రాంతికి వస్తుంది. ఈ రెండు సినిమాల మధ్యలో పరాశక్తి రిస్క్ చేయడం ఎందుకని మేకర్స్ భావిస్తున్నారట.
శివ కార్తికేయన్ పరాశక్తితో హిట్..
పరాశక్తి సినిమాను పొంగల్ నుంచి సమ్మర్ కి అంటే ఏప్రిల్ 14న రిలీజ్ అనుకుంటున్నారట. మదరాసి నిరాశపరచడంతో శివ కార్తికేయన్ పరాశక్తితో హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే పరాశక్తికి సోలో రిలీజ్ బెటర్ అని భావిస్తున్నారు. లాస్ట్ ఇయర్ అమరన్ తో 300 కోట్ల పైన కలెక్ట్ చేసిన శివ కార్తికేయన్ మురుగదాస్ లాంటి డైరెక్టర్ తో దాన్ని మించిన సినిమా చేస్తాడని అనుకుంటే అది కాస్త రివర్స్ అయ్యింది.
కోలీవుడ్ లో సెల్ఫ్ మేడ్ స్టార్ అయిన శివ కార్తికేయన్ వరుస హిట్లతో సూపర్ ఫాం కొనసాగించాడు. అమరన్ 300 కోట్లు కలెక్ట్ చేసి అతన్ని స్టార్ హీరోల సరసన నిలబెట్టింది. మదరాసి వల్ల అతని కెరీర్ కి ఎఫెక్ట్ పడుతుందా లేదా అన్నది చెప్పడం కష్టం కానీ పరాశక్తి తో మళ్లీ హిట్ కొడితే శివ కార్తికేయన్ స్టామినా ప్రూవ్ అవుతుందని చెప్పొచ్చు.
