Begin typing your search above and press return to search.

వ‌ర్మ ఇంపాక్ట్ ఇక్క‌డే కాదు వాళ్ల‌ను అంతే ఇన్ స్పైర్!

తాను కాలేజ్ చ‌దువుతోన్న రోజుల్లోనే అండ‌ర్ వ‌ర‌ల్డ్ మాఫియా ఉండేద‌న్నారు. గుండా గిరి,రౌడీయిజం మ‌ధ్య త‌న కాలేజ్ చ‌దువు పూర్త‌యింద‌న్నాడు.

By:  Srikanth Kontham   |   24 Dec 2025 3:00 AM IST
వ‌ర్మ ఇంపాక్ట్ ఇక్క‌డే కాదు వాళ్ల‌ను అంతే ఇన్ స్పైర్!
X

క‌ల్ట్ క్లాసిక్ `శివ` ప్ర‌భావం టాలీవుడ్ డైరెక్ట‌ర్ల‌పై ఏ రేంజ్ లో ఉంది? అన్న‌ది ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇటీ వ‌లే రీ-రిలీజ్ అయిన స‌మ‌యంలో? `శివ` త‌మ‌ని ఎంతగా ఇన్ స్పైర్ చేసింద‌న్న‌ది చెప్ప‌క‌నే చెప్పారు. అప్ప‌ట్లో డైరెక్ట‌ర్లు అవ్వాల‌నుకున్న వాళ్లు అంతా కూడా `శివ` నుంచి స్పూర్తిని పొందిన వారే. నేడు పాన్ ఇండియాని ఏల్తోన్న రాజ‌మౌళి, సుకుమార్, నాగ్ అశ్వన్, సందీప్ రెడ్డి వంగా లాంటి సంచ‌ల‌నాల నుంచి స్టార్ డైరెక్ట‌ర్ల‌గా చ‌ల‌మాణి అవుతున్న వారెంతో మంది కి `శివ` ను చూసే ద‌ర్శ‌కుల‌య్యారు. వారంతా కూడా వ‌ర్మ సార‌థ్యంలో ప‌ని చేయాల‌నుకున్న వారే.

ఇంకా పూరి జ‌గ‌న్నాధ్, హ‌రీష్ శంక‌ర్, శ్రీనువైట్ల నుంచి ఇప్ప‌టి త‌రం ద‌ర్శ‌కుల వ‌ర‌కూ చాలా మంది `శివ‌` స్పూర్తితోనే ద‌ర్శ‌కులుగా కొన‌సాగుతున్నారు. అలా టాలీవుడ్ పై `శివ` ప్ర‌భావం స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. అప్ప‌ట్లో ఈ చిత్రాన్ని వ‌ర్మ తెలుగులోనే చేసారు. కానీ `శివ` ఇంపాక్ట్ ఒక్క టాలీవుడ్ కే ప‌రిమితం కాలేదు. తెలుగు స‌హా ద‌క్షిణాదిన ఇత‌ర భాష‌ల్లో కూడా ఇంపాక్ట్ ఉంద‌ని తెలుస్తోంది. ప్ర‌ముఖంగా క‌న్న‌డ సంచ‌ల‌నం ఉపేంద్ర‌పై శివ ఇంపాక్ట్ మామూలుగా లేదు. `శివ` లాంటి స్క్రిప్ట్ తాను కూడా ఒక‌టి సిద్దం చేసుకున్నాన‌ని..కానీ త‌న సినిమా మొద‌ల‌య్యే స‌మ‌యానికి `శివ` రిలీజ్ అవ్వ‌డంతో త‌న ఆలోచ‌న విధాన‌మే మారిపోయింద‌న్నాడు.

తాను కాలేజ్ చ‌దువుతోన్న రోజుల్లోనే అండ‌ర్ వ‌ర‌ల్డ్ మాఫియా ఉండేద‌న్నారు. గుండా గిరి,రౌడీయిజం మ‌ధ్య త‌న కాలేజ్ చ‌దువు పూర్త‌యింద‌న్నాడు. అప్పుడే ఇలాంటి క‌థ‌ను తీసుకుని సినిమాగా తీస్తే బాగుంటుంద‌నే ఆలోచ‌న‌తో స్క్రిప్ట్ సిద్దం చేసాన‌న్నారు. కానీ `శివ` రిలీజ్ అయిన త‌ర్వాత తాను రాసిన క‌థ‌లాగే ఇదీ ఉంద‌ని అదే క‌థ‌ను మ‌ళ్లీ మార్చితీయ‌డానికి రెండేళ్లు స‌మ‌యం ప‌ట్టింద‌న్నాడు. అదే `ఓం` చిత్రంగా పేర్కొన్నారు. `శివ‌`కు భిన్నంగా ఓం క‌థ‌ను రాసుకుని తీసినట్లు తెలిపారు. ఒక‌ రౌడీకి ల‌వ్ స్టోరీని జోడించి ..డిఫ‌రెంట్ స్క్రీన్ ప్లేతో `ఓం `చిత్రాన్ని తీసిన‌ట్లు పేర్కొన్నారు.

ఆ సినిమా మంచి విజ‌యం సాధించింద‌ని..అందుకు కార‌ణం మాత్రం `శివ‌` అన్నారు. అలా శివ ప్ర‌భావం క‌న్న‌డ‌లో కూడా ఉంద‌ని తెలుస్తోంది. అలాగే `ధురంధ‌ర్` తో సంచ‌ల‌నం విజ‌యం అందుకున్న ద‌ర్శ‌కుడు ఆదిత్య‌ ధర్ పై కూడా `శివ` ఇంపాక్ట్ ఉంది. అప్ప‌ట్లో `శివ` ఓ న్యూ జోన‌ర్ సినిమా అని..ఎన్నో మాఫియా సినిమాల‌కు `శివ` స్పూర్తిని చ్చింద‌న్నారు. మేకింగ్ ప‌రంగానూ ఎంతో కొత్త‌గా...స్టైలిష్ గానూ ఉంటుంద‌న్నారు.