మహేష్ మరదలు కోరిక తీరేనా?
సూపర్ స్టార్ మహేష్ సతీమణీ, మరదలు శిల్నా శిరోద్కర్ సుపరిచితమే. మూడు దశాబ్దాల క్రితమే శిల్పా శిరోద్కర్ `బ్రహ్మ` అనే సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు.
By: Srikanth Kontham | 28 Oct 2025 12:50 PM ISTసూపర్ స్టార్ మహేష్ సతీమణీ, మరదలు శిల్నా శిరోద్కర్ సుపరిచితమే. మూడు దశాబ్దాల క్రితమే శిల్పా శిరోద్కర్ `బ్రహ్మ` అనే సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు. కానీ ఆ సినిమా గురించి అప్పట్లో పెద్దగా ఎవరికీ తెలియదు. సోషల్ మీడియా కూడా లేదు కాబట్టి శిల్పా శిరోద్కర్ పేరు పెద్దగా హైలైట్ కాలేదు. మహేష్ ని సిస్టర్ నమ్రతశిరోద్కర్ పెళ్లి చేసుకోవడం సహా కాలక్రమంలో శిల్పా శిరోద్కర్ బాగా సుపరిచితురాలు అయ్యారు. కానీ బాలీవుడ్ లో చాలా సినిమాలు చేసింది. కోలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసింది. నటిగా సీనియర్ అయినా అగ్ర నటిగా మాత్రం స్థానం సంపాదించలేకపోయింది.
హిట్ అయినా ఛాన్సులు రాలేదు:
అలా శిల్పా శిరోద్కర్ రేసులో వెనుకబడింది. ఈ మధ్య కాలంలో మళ్లీ ఆమె పేరు వైరల్ గా మారింది. సరిగ్గా ఇదే సమయంలో సుధీర్ బాబు హీరోగా నటిస్తోన్న `జఠాధర` సినిమాలో ఓ కీలక పాత్రకు శిల్పా శిరోద్కర్ ను తీసుకోవడంతో మరింత వెలుగులోకి వచ్చింది. అయితే ఈ సినిమా తర్వాత టాలీవుడ్ లో నటిగా బిజీ అవ్వాలని శిల్పా శిరోద్కర్ ఎంతో ఆశపడుతుంది. `బ్రహ్మ` తర్వాత తెలుగు సినిమాలు చేయలేదని, విచిత్రంగా ఆ సినిమా విజయం సాధించినా అవకాశాలు ఎందుకు రాలేదు? అన్నది ఇప్పటికీ తనకు ఆశ్చర్యంగా అనిపిస్తుందన్నారు.
పోటీ కాలంలో రీఎంట్రీ:
చాలా కాల తర్వాత `జఠాధర`లో అవకాశం రావడం పట్ల సంతోషం వ్యక్తం చేసారు. ఈ సినిమా తర్వాత కంటున్యూగా తెలుగు సినిమాలు చేయాలని ఉందనే ఆశని వ్యక్తం చేసారు. `జఠాధర` తనకు మంచి కంబ్యాక్ చిత్రంగా నిలుస్తుందని ఆశాభవం వ్యక్తం చేసారు. మరి శిల్పాశిరోద్కర్ కి ఆశించిన విధంగా తెలుగులో అవకాశాలు వస్తాయా? లేదా? అన్నది చూడాలి. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టులు మధ్య కూడా మంచి పోటీ నెలకొంది. హీరోయిన్లే అవకాశాలు రాకపోతే క్యారెక్టర్ ఆర్టిస్టులుగా టర్నింగ్ తీసుకుంటున్నారు. చిన్న చిన్న పాత్రలైనా చేయడానికి రెడీగా ఉం టున్నారు.
ఐదేళ్ల గ్యాప్ తర్వాత :
ఐటం భామల గానూ అలరించడానికి ఎంత మాత్రం ఆలోచించడం లేదు. మరి ఇలాంటి పోటీ నడుమ శిల్పా శిరోద్కర్ కు తెలుగులో అనుకున్న విధంగా అవకాశాలు అందుకుంటారా? లేదా? అన్నది చూడాలి. శిల్పా శిరోద్కర్ ఐదేళ్ల గ్యాప్ తర్వాత నటిస్తోన్న చిత్రమిది. 2020లో చివరిగా బాలీవుడ్ లో `గన్స్ ఆప్ బనారస్` లో నటించారు. ఆ తర్వాత మళ్లీ మ్యాకప్ వేసుకోలేదు. అవకాశాలు రాకపోవడంతో ఇంటికే పరిమితయ్యారు. ఈ నేపథ్యంలో తెలుగులో కంబ్యాక్ అవ్వడం విశేషం.
