ఆ కేసులో హీరోయిన్‌ను విచారించిన పోలీసులు
బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్‌కుంద్రా ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తున్నారు.
By: Ramesh Palla | 7 Oct 2025 3:42 PM ISTబాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్‌కుంద్రా ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తున్నారు. ఈ మధ్య కాలంలో వీరి గురించి వార్తలు లేవు అనుకుంటున్న సమయంలోనే మరో వివాదంతో వీరి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. శిల్పా శెట్టి దంపతులపై ఇటీవల కేసు నమోదు అయింది. వ్యాపారవేత్త దీపక్ కొఠారి ఈ కేసును దాఖలు చేసిన విషయం తెల్సిందే. గతంలో శిల్పా శెట్టి దంపతులు బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వాహణలో భాగస్వామ్యులుగా ఉన్నారు. ఆ సమయంలో దీపక్ కొఠారి నుంచి వ్యాపారం కోసం రూ.60 కోట్లను తీసుకున్నారట. ఆ డబ్బును బిజినెస్‌లో పెట్టకుండా వ్యక్తిగత అవసరాలకు వినియోగించుకున్నారని దీపక్ ఆరోపిస్తున్నారు. ఈ కేసు విషయమై తాజాగా శిల్పా శెట్టిని ముంబై పోలీసులు ఆమె ఇంట్లోనే విచారించారు. విచారణ సుదీర్ఘంగా సాగినట్లు తెలుస్తోంది.
శిల్పా శెట్టిని ప్రశ్నించిన ముంబై పోలీసులు
ముంబై మీడియా వర్గాలు, ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్‌కు సంబంధించిన పలు డాక్యుమెంట్స్ ను శిల్పా శెట్టి పోలీసుల ముందు ఉంచిందని, విచారణకు పూర్తిగా సహకరించిందట. అంతే కాకుండా ఆమె కేసుకు సంబంధించిన పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిందని తెలుస్తోంది. శిల్పా శెట్టి ఈ మధ్య కాలంలో పోలీసుల ముందుకు వెళ్లడం ఇదే మొదటి సారి ఏమీ కాదు. గతంలోనూ ఈమె కొన్ని కేసులు, ఆరోపణలు, ఆర్థిక అవకతవకల నేపథ్యంలో విచారణ ఎదుర్కొన్నట్లు మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. ఈసారి ఆర్థిక పరమైన లావాదేవీలకు సంబంధించిన ఇష్యూ కావడంతో కాస్త ఎక్కువ సీరియస్‌గా వ్యవహారం సాగుతుంది అంటూ మీడియా సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది.
రాజ్ కుంద్రాకు ఈ కేసుతో సంబంధం..
ఇదే కేసు విషయమై అతి త్వరలోనే రాజ్ కుంద్రాను పోలీసులు విచారించే అవకాశాలు ఉన్నాయి అంటూ ముంబై వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఆయన అందుబాటులో లేకపోవడం వల్లే మొదట శిల్పా శెట్టిని విచారించారని, త్వరలోనే ఆయన అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆయన్ను ఈ కేసు గురించి ముంబై పోలీసులు విచారిస్తారని తెలుస్తోంది. ఒకప్పుడు బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్‌లో పెట్టుబడి పెట్టిన వారు, శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాలకు డబ్బులు ఇచ్చిన వారు ముందు ముందు మరింత మంది వస్తారు అంటూ మరికొందరు అంటున్నారు. ఈ వ్యవహారం ముందు ముందు పెద్దదిగా మారే అవకాశాలు లేకపోలేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే శిల్పా శెట్టి సన్నిహితులు మాత్రం ఈ కేసు నిలవదని, దీపక్ కొఠారి ఆరోపణలు పూర్తిగా అవాస్తవం అంటున్నారు.
జైలుకు వెళ్లి వచ్చిన రాజ్‌కుంద్రా
గతంలో రాజ్ కుంద్రా అశ్లీల వీడియోలను చిత్రీకరిస్తూ, వాటితో వ్యాపారం చేస్తున్నాడు అని ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెల్సిందే. ఆ సమయంలో రాజ్ కుంద్రా జైలుకు కూడా వెళ్లడం అందరికీ తెలిసిందే. బెయిల్ మీద బయటకు వచ్చిన రాజ్‌కుంద్రా పై మరో కొత్త కేసు పడింది. అదే బిట్ కాయిన్ స్కామ్ అనే విషయం కూడా అందరికీ తెలుసు. ఇలా రాజ్ కుంద్రాపై చాలా కేసులు ఉన్నాయి. అందుకే ఆయనకు ముంబై పోలీసులు లుక్ ఔట్ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు లుక్ ఔట్ నోటీసులు అందుకున్న శిల్ప శెట్టి, రాజ్‌కుంద్రాలు ముంబైలోనే ఉన్నారు. వారు ప్రస్తుతం చాలా కేసుల్లో ఉన్నారని, వారు వీటన్నింటిని ఎప్పటికి బయట పడుతారో అంటూ వారి సన్నిహితులు, ముఖ్యంగా శిల్పా శెట్టి అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
