Begin typing your search above and press return to search.

రూమర్స్ కి గట్టి కౌంటర్.. 60 కోట్ల స్కామ్ సంగతేంటి?

అయితే అవన్నీ అవాస్తవమని తమ ఇమేజ్ ను డామేజ్ చేయడానికి కొంతమంది ఇలా రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు అంటూ ఎట్టకేలకు ఆ హీరోయిన్ స్పందించింది.

By:  Madhu Reddy   |   18 Dec 2025 12:00 PM IST
రూమర్స్ కి గట్టి కౌంటర్.. 60 కోట్ల స్కామ్ సంగతేంటి?
X

ముఖ్యంగా సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత సెలబ్రిటీలకు సంబంధించిన ఏ చిన్న విషయమైనా సరే ఇట్టే వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే అలా వైరల్ అయ్యే వార్తల్లో ఏది నిజమో ఏది అబద్దమో తెలియదు కానీ దానిపై మళ్ళీ ఆ సెలబ్రిటీలు స్పందించే వరకు ఆ రూమర్స్ వినిపిస్తూనే ఉంటాయి. ఈ క్రమంలోనే ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి 60కోట్ల స్కామ్ లో ఇరుక్కున్న విషయం తెలిసిందే.. అయితే అవన్నీ అవాస్తవమని తమ ఇమేజ్ ను డామేజ్ చేయడానికి కొంతమంది ఇలా రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు అంటూ ఎట్టకేలకు ఆ హీరోయిన్ స్పందించింది. మరి 60 కోట్ల స్కాం సంగతి ఏంటి ? అసలు ఏం జరిగింది? అనే విషయం ఇప్పుడు చూద్దాం..

విషయంలోకి వెళ్తే.. ముంబైకి చెందిన లోటస్ క్యాపిటల్ ఫైనాన్స్ సర్వీసెస్ డైరెక్టర్, వ్యాపారవేత్త అయిన దీపక్ కొఠారి.. శిల్పా శెట్టి దంపతులు తమ వ్యాపారాన్ని విస్తరిస్తామని చెప్పి తన దగ్గర డబ్బులు తీసుకున్నారని తెలిపారు. ఆయన మాట్లాడుతూ.." శిల్పా శెట్టి బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్ అనే హోం షాపింగ్ కంపెనీకి డైరెక్టర్ గా ఉంది.ఆ కంపెనీలో 87.6% శిల్పాశెట్టి దంపతులు వాటా కూడా కలిగి ఉన్నారు. ఈ విషయాన్ని నాకు చెప్పడంతో నేను ఈ దంపతులను నమ్మి 12% వడ్డీతో 75 కోట్లు అప్పు కావాలని అడిగితే 60 కోట్లు ఇచ్చాను . అయితే ఆ తర్వాత అధిక పన్నుల భారం నుండి తప్పించుకోవడానికి అప్పుగా కాకుండా పెట్టుబడిగా ఇవ్వాలని ఒప్పించారు.

నెలకు వచ్చే రాబడితో పాటు అసలు కూడా తిరిగి చెల్లిస్తామని చెప్పి హామీ ఇవ్వడంతోనే 2015 - 2023 వరకు పెట్టుబడిగా పెట్టాను. అలా 2015 ఏప్రిల్ 31.9 కోట్లు.. అదే ఏడాది సెప్టెంబర్ లో 28.53 కోట్లు శిల్పా శెట్టి దంపతులకు ఇచ్చాను. అయితే అదే సంవత్సరమే బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో డైరెక్టర్ పదవికి శిల్పా రిజైన్ చేసింది. ఇక వీరిని నమ్మి 60 కోట్లు నష్టపోయాను " అంటూ దీపక్ కొఠారి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఈ ఫిర్యాదును విచారణ చేసిన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆర్థిక నేరాల విభాగానికి ఈ కేస్ ను బదిలీ చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ కేస్ కోర్టులో నడుస్తుండగా.. దీనిపై శిల్పా శెట్టి స్పందించింది.

ముఖ్యంగా రూ.60 కోట్ల స్కాం విషయంలో తనను పెట్టుబడిగా పెట్టాలని ప్రేరేపించారని కొఠారి ఆరోపించిన నేపథ్యంలో ఆగస్టు 14న ఈ కేసు నమోదు అవ్వగా.. వ్యాపార కార్యకలాపాల కోసం ఉద్దేశించిన నిధులను వ్యక్తిగత అవసరాల కోసం ఉపయోగించారని ఆయన ఆరోపించారు. ఈ ఆరోపణలే ఎఫ్ఐఆర్ లో చేర్చబడ్డాయి. ముఖ్యంగా రాజ్ కుంద్రా తన డబ్బులో కొంత భాగాన్ని నటులు బిపాసా బసు , నేహా ధూపియా లకు ప్రొఫెషనల్ ఫీజుగా చెల్లించారని, బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 2016లో నోట్ల రద్దు తర్వాత తీవ్ర నష్టాలు చవిచూసిందని, దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయని, పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని తిరిగి చెల్లించలేం అని కూడా రాజ్ కుంద్రా వాదించారు అంటూ అభియోగాలు వస్తున్న నేపథ్యంలో శిల్పా శెట్టి తాజాగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఒక ప్రకటన విడుదల చేస్తూ ఆరోపణలను ఖండించారు.

"తాజాగా వస్తున్న వార్తలు నిరాధారమైనవి. ఇవి ఎవరో కావాలని చేస్తున్నారు. చట్టబద్ధమైన కారణాలు లేకుండా ఈ వివాదానికి నేరపూరిత రంగు వేస్తున్నారు. ఇప్పటికే హైకోర్టులో రద్దు పిటిషన్ వేసాము..అది పెండింగ్లో ఉంది. ప్రస్తుతం ఈ విషయం విచారణలో ఉన్న నేపథ్యంలో మీడియా ఊహాగానాలకు దూరంగా ఉండండి.. రూమర్స్ ని ఎట్టి పరిస్థితుల్లో నమ్మకండి" అంటూ ఆమె తెలిపింది. తాను, తన భర్త పూర్తిగా దర్యాప్తుకు సహకరిస్తున్నామని, న్యాయ ప్రక్రియపై తమకు విశ్వాసం ఉందని శిల్పా శెట్టి తెలిపింది.. ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ స్టేటస్ ద్వారా ఈమె పెట్టిన ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.