ఆ రెస్టారెంట్ ఆదాయం విని షాకయ్యా!
రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ప్రముఖ రచయిత్రి శోభా డే, బాస్టియన్ రెస్టారెంట్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు.
By: Sravani Lakshmi Srungarapu | 22 Oct 2025 7:00 PM ISTసెలబ్రిటీలు ఎంతో తెలివిగా పెట్టుబడులు పెడుతుంటారు. అందులోనూ బాలీవుడ్ తారలు తాము సంపాదించిన దాన్ని, ఎంతో ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుని దాన్ని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. బాలీవుడ్ నటి శిల్పా శెట్టి కూడా అలానే చేశారు. శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా ముంబైలో బాస్టియన్ అనే రెస్టారెంట్ ను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.
సినిమాల్లో బిజీగా ఉన్నప్పుడే శిల్పా బిజినెస్ లోకి అడుగుపెట్టి, బాస్టియన్ రెస్టారెంట్ ను ప్రారంభించారు. ఆ తర్వాత బాస్టియన్ ను మరింత విస్తరిస్తూ పలు బ్రాంచ్ లను కూడా స్టార్ట్ చేసి సక్సెస్‌ఫుల్ బిజినెస్ గా కొనసాగిస్తున్నారు. ముంబైలో ఉన్న ఈ బాస్టియన్ రెస్టారెంట్ ఎంతో ఫేమస్. ఆ రెస్టారెంట్ ఎంత ఫేమస్ అంటే పలువురు ప్రముఖులు కూడా దాని ఆదాయం చూసి ఆశ్చర్యపోయేంత.
ఆ రెస్టారెంట్ ఆదాయం రోజుకు రూ.2 కోట్లు
రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ప్రముఖ రచయిత్రి శోభా డే, బాస్టియన్ రెస్టారెంట్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు. ముంబైలోని కొన్ని అంశాలు తనను ఆశ్చర్యపరుస్తాయని చెప్పిన శోభా, బాస్టియన్ రెస్టారెంట్ లోకి అడుగుపెడితే ఎలా ఉంటుందో ఆమె తెలిపారు. బాస్టియన్ రెస్టారెంట్‌కు మామూలు రోజుల్లో రూ.2 కోట్లు, వీకెండ్స్ లో రూ.3 కోట్ల ఆదాయం వస్తుందని చెప్పారు.
అదంతా నమ్మలేకపోయా
మొదట్లో ఈ వార్తలు నిజం కాదనుకున్నానని, కానీ తర్వాత వాటి గురించి తెలిసిందని, ఆ రెస్టారెంట్ లోపలికి వెళ్లి చూడగానే తాను షాకయ్యానని, అందులో దాదాపు 1400 మంది గెస్టులు స్టే చేయొచ్చని, ఒకేసారి 700 మంది భోజనం చేసేలా రెండు పెద్ద పెద్ద హాల్స్ ఉన్నాయని, అంతమందని అక్కడ చూసి తాను చూస్తున్నది నిజమేనా అని నమ్మలేకపోయినట్టు శోభా తెలిపారు
అంతటి స్టార్ హోటల్ కు సంబంధించిన బాంద్రా బ్రాంచ్ ను క్లోజ్ చేస్తున్నట్టు శిల్పా రీసెంట్ గా అనౌన్స్ చేశారు. అయితే అదే రెస్టారెంట్‌ను జుహూ లో బాస్టియన్ బీచ్ క్లబ్ పేరుతో ప్రారంభించనున్నామని, ఎన్ని బ్రాంచ్ లు ఓపెన్ చేసినా బాంద్రాలోని రెస్టారెంటే అన్నింటికీ మూలమని, ఆ రెస్టారెంట్ ఎప్పటికీ తమకు స్పెషలేనని శిల్పా చెప్పారు.
