బాస్టియన్ రెస్టారెంట్ మూసివేయడంపై శిల్పాశెట్టి క్లారిటీ!
అంతేకాదు ఈ బాస్టియన్ రెస్టారెంట్ ను కూడా మూసి వేయడం లేదు. దీనిని "బాస్టియన్ బీచ్ క్లబ్" పేరుతో జుహూ ఏరియాలో తెరవబోతున్నాము.
By: Madhu Reddy | 4 Sept 2025 11:38 AM ISTప్రముఖ బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి సెప్టెంబర్ 3న ముంబైలోని తన సొంత రెస్టారెంట్ బాస్టియన్ మూసి వేస్తున్నట్లు ఇంస్టాగ్రామ్ వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో అభిమానులను మొదలుకొని.. శ్రేయోభిలాషులు, నెటిజన్లు, సినీ సెలబ్రిటీలు ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేయడమే కాకుండా ఈ రెస్టారెంట్ మూసి వేయడానికి గల కారణం ఏంటి? అంటూ సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించారు. అలా ఈ రెస్టారెంట్ మూసివేయడంపై పలు ప్రశ్నలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో తాజాగా మరొకసారి ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక వీడియో రిలీజ్ చేస్తూ స్పందించింది హీరోయిన్ శిల్పా శెట్టి.
ఈ మేరకు ఆమె తన ఇంస్టాగ్రామ్ వేదికగా స్పందిస్తూ.. "బాస్టియన్ రెస్టారెంట్ మూసి వేస్తున్నామని ప్రకటించడంతో సుమారుగా 4,500 పైగా ఫోన్ కాల్స్ వచ్చాయి. ఒకరకంగా నాకు ఇది సంతోషాన్ని ఇస్తోంది. బాస్టియన్ రెస్టారెంట్ పై ఇంతమంది ప్రేమ పెంచుకోవడం చూసి.. వారి అభిమానాన్ని తట్టుకోలేకపోతున్నాను. మేము ఈ బాస్టియన్ రెస్టారెంట్ ను పూర్తిగా మూసివేయడం లేదు.. కానీ ఒక అధ్యాయాన్ని ముగించాము. త్వరలో ఈ ప్లేస్ లో "అమ్మకై" అనే కొత్త రెస్టారెంట్ తో మీ ముందుకు వస్తున్నాము. ఇందులో నా మూలాలు అయిన మంగళూరు కి సంబంధించిన ఆహార వంటకాలను రుచి చూపించబోతున్నాము.
అంతేకాదు ఈ బాస్టియన్ రెస్టారెంట్ ను కూడా మూసి వేయడం లేదు. దీనిని "బాస్టియన్ బీచ్ క్లబ్" పేరుతో జుహూ ఏరియాలో తెరవబోతున్నాము. నిజానికి ఈ బాంద్రాలోని బాస్టియన్ రెస్టారెంట్ నా జీవనానికి మూలాధారం. ఒక చెట్టు ఎలా అయితే ఫలాలను ఇస్తుందో ఈ బాస్టియన్ కూడా నాకు జీవితాన్ని ప్రసాదించింది. కాబట్టి దీనిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మూసివేయము. ఇక అక్టోబర్లో దీనిని మేము ప్రారంభిస్తాము. దయచేసి అప్పటివరకు ఓపిక పట్టండి. ఇక పూర్తిగా మూసివేస్తున్నాం అనే వార్తల్లో ఎలాంటి నిజం లేదు" అంటూ క్లారిటీ ఇచ్చింది శిల్పా శెట్టి. ప్రస్తుతం శిల్పా శెట్టి చేసిన షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ముంబైలో బాస్టియన్ రెస్టారెంట్ కి మంచి పేరు ఉంది. దీనిని మూసి వేస్తున్నట్లు చెబుతూ.. "ముంబైలోని బాంద్రాలో ఉన్న బాస్టియన్ నాకు లెక్కలేనని జ్ఞాపకాలను, మరపురాని రాత్రులను అందించింది. ఎన్నో ఆనందాలను పంచిన ఈ వేదిక ఇకపై మూతపడనుంది. చివరిసారిగా గురువారం వేడుక నిర్వహిస్తున్నాము. అత్యంత సన్నిహితులు, వ్యాపార భాగస్వామ్యులు ఈ వేడుకకు హాజరు కాబోతున్నారు" అంటూ శిల్పా శెట్టి చెప్పడంతో ఈ విషయం కాస్త వైరల్ అయింది. దీంతో పలు రకాల కథనాలు కూడా వెలువడ్డాయి. అందుకే ఈమె తాజాగా ఈ విషయంపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది. మొత్తానికి బాస్టియన్ రెస్టారెంట్ మూసి వేస్తున్నారు అంటూ వస్తున్న కథనాలపై క్లారిటీ ఇస్తూ అభిమానులకు సంతోషాన్ని కలిగించింది శిల్పా శెట్టి.
