సమంత - మంచులక్ష్మీపై శిల్పారెడ్డి కామెంట్స్.. ఫొటోస్ వైరల్!
శిల్పారెడ్డి.. మనందరికీ ఈమె కేవలం సమంత స్నేహితురాలు గానే తెలుసు. కానీ ఈమె ఫ్యాషన్ రంగంలో ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతురాలిగా నిలిచింది.
By: Madhu Reddy | 20 Jan 2026 3:19 PM ISTశిల్పారెడ్డి.. మనందరికీ ఈమె కేవలం సమంత స్నేహితురాలు గానే తెలుసు. కానీ ఈమె ఫ్యాషన్ రంగంలో ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతురాలిగా నిలిచింది. మోడల్ గా కెరియర్ను మొదలుపెట్టిన ఈమె.. ఇప్పుడు ఆ మోడల్స్ కి నాయకత్వం వహించే స్థాయికి ఎదిగింది అంటే ఇక ఆమె ప్రతిభ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. 2004లో ప్రసిద్ధ గ్లాడ్రాగ్స్ మిసెస్ ఇండియా పోటీలో పాల్గొని ప్రతిష్టాత్మక టైటిల్ ను గెలుచుకున్న ఈమె.. దివా ప్రతిష్టాత్మక కింగ్ ఫిషర్ క్యాలెండర్ లో కూడా భాగమైంది. ముఖ్యంగా మహిళా సాధికారత , పిల్లల భద్రత, విద్యా వంటి కీలక అంశాలపై స్పందిస్తూ.. ఆర్థికంగా కూడా అండగా నిలుస్తోంది. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ పై మహిళలకు అవగాహన కల్పించే ఈమె.. గొప్ప సామాజికవేత్తగా కూడా పేరు సొంతం చేసుకుంది.
ఇక ప్రస్తుతం మానసిక ఆరోగ్య అవగాహన సంస్థ అయిన రోష్నీ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. మరోవైపు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకునే ఈమె.. అటు సమంతతో పలు వెకేషన్ లకు వెళ్తూ అందుకు సంబంధించిన ఫోటోలను కూడా పంచుకుంటూ ఉంటుంది. ఇక ఇటీవల సమంత - రాజ్ నిడిమోరు పెళ్లిలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన ఈమె.. ఇప్పుడు తాజాగా సమంత - రాజ్ నిడిమోరు దంపతులతో పాటు మంచు లక్ష్మితో కలిసి దిగిన ఫోటోలను తాజాగా పంచుకుంది. అంతేకాదు వారితో తనకున్న అనుబంధాన్ని కూడా ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంది శిల్పారెడ్డి.
మంచు లక్ష్మితో గడిపిన సందర్భాలను.. అలాగే సమంత - రాజ్ నిడిమోరు తో కలిసి దిగిన ఫోటోలను పంచుకుంటూ ఒక క్యాప్షన్ కూడా జోడించింది. "కొన్ని ప్రయాణాలు ప్రదేశం గురించి కాదు మనుషుల గురించి చెబుతాయి. ఒక చిన్న ప్రయాణం.. కానీ నిండు మనసుతో చేసిన ఆ ప్రయాణం కలకాలం గుర్తుంటుంది. ఆత్మీయ ఆలింగనాలు.. నవ్వులు.. ప్రేమను పంచుకోవడం.. జ్ఞానంతో పాటు కొత్త విషయాలు నేర్చుకోవడం అలాగే చెప్పకుండానే మనసులో ఉన్న మాటలన్నింటికీ చివరికి స్వరం దొరకడం.. ఘాడమైన అనుబంధం.. కృతజ్ఞతాతో పాటు ఆత్మకు ఎంతో ఓదార్పు పొందిన అనుభూతితో ఈ ప్రయాణాన్ని సాగించాను" అంటూ వారితో కలిసి ఉన్న ఫోటోలను పంచుకుంటూ వారితో ఉన్న తన అనుబంధాన్ని పంచుకుంది శిల్పారెడ్డి. మొత్తానికైతే మంచు లక్ష్మి , సమంతలతో తనకున్న స్నేహబంధాన్ని మరోసారి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఇక సమంత విషయానికి వస్తే.. రెండో వివాహం తర్వాత మా ఇంటి బంగారం అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ట్రైలర్ రిలీజ్ చేశారు. అలాగే తన నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ ను స్థాపించిన ఈమె.. ఈ చిత్రానికి సహనిర్మాతగా వ్యవహరిస్తోంది .ఈమె భర్త రాజ్ నిడిమోరు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తోంది. మంచు లక్ష్మీ విషయానికొస్తే హీరోయిన్ గా అడుగులు వేసిన ఈమె సక్సెస్ కాలేక క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు పాత్రలు చేస్తూ మంచి పేరు అందుకుంటుంది. అలాగే కొన్ని షోలకు హోస్ట్ గా కూడా వ్యవహరిస్తోంది.
