Begin typing your search above and press return to search.

60 కోట్ల భారీ స్కామ్.. శిల్పా శెట్టి - రాజ్ కుంద్రా దంపతులకు పోలీసులు షాక్!

బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతున్న శిల్పా శెట్టి.. బాలీవుడ్ లోనే కాదు ఇటు టాలీవుడ్ లో కూడా సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

By:  Madhu Reddy   |   5 Sept 2025 5:17 PM IST
60 కోట్ల భారీ స్కామ్.. శిల్పా శెట్టి - రాజ్ కుంద్రా దంపతులకు పోలీసులు షాక్!
X

బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతున్న శిల్పా శెట్టి.. బాలీవుడ్ లోనే కాదు ఇటు టాలీవుడ్ లో కూడా సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా వెంకటేష్ హీరోగా వచ్చిన 'సాహస వీరుడు సాగర కన్య' సినిమాతో ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. మంగళూరుకి చెందిన ఈమె ఇక్కడి మూలాలను వదిలేసి బాలీవుడ్ లో సెటిల్ అయిపోయింది. అక్కడే ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను వివాహం చేసుకుంది. ఒకవైపు సినిమాలు.. మరొకవైపు బిజినెస్ అంటూ బిజీగా కెరియర్ ను కొనసాగించిన ఈమె జీవితంలో అనూహ్య మలుపులు చోటుచేసుకున్నాయి.

శిల్పా శెట్టి - రాజ్ కుంద్రా దంపతులకు పోలీసులు షాక్..

ముఖ్యంగా ఈమె భర్త రాజ్ కుంద్రా అశ్లీల కేసులో ఇరుక్కోవడమే కాకుండా.. జైలు జీవితం కూడా అనుభవించారు. ఇప్పుడు మరొక కేసులో ఇరుక్కోవడం సంచలనంగా మారింది. ఏకంగా రూ.60 కోట్ల భారీ స్కామ్ కేసులో ఈ జంట ఇరుక్కున్నారు. అలాంటి ఈ జంటకు ఇప్పుడు పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసి మరో షాక్ ఇచ్చారు అని చెప్పవచ్చు. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..

శిల్ప దంపతులకు లుకౌట్ నోటీసులు..

తాజాగా ముంబై కి చెందిన వ్యాపారవేత్తను రూ.60 కోట్ల మేర మోసం చేశారనే ఆరోపణలు ఈ జంటపై ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేసు కూడా నమోదయింది. ఆర్థిక నేరాల విభాగ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం ఈ జంట ట్రావెల్ లాగ్ లను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. కేసు విచారణ సమయంలో దేశం విడిచి పోకుండా ఉండేందుకు ఇప్పుడు వీరికి లుకౌట్ నోటీసులు జారీ చేయబోతున్నారట. సాధారణంగా కేసు విచారణ సమయంలో నేరస్తులు దేశం విడిచిపోకుండా ఉండేందుకు ఇలాంటి నోటీసులు జారీ చేస్తూ ఉంటారు. ఇప్పుడు అందులో భాగంగానే ఒక బిజినెస్ మాన్ ను రూ.60 కోట్ల మేర మోసం చేసిన కేసులో నిందితులుగా ఉన్న శిల్పా శెట్టి- రాజ్ కుంద్రా తరచూ విదేశాలకు వెళుతూ ఉంటారు. అందుకే ఇప్పుడు వారు ఎక్కడికి వెళ్లకుండా ఈ లుకౌట్ నోటీసులు ఇవ్వడానికి పోలీసులు సిద్ధమైనట్లు ముంబై పోలీసులు వెల్లడించారు.

ఏంటా 60 కోట్ల స్కామ్?

ఏంటా 60 కోట్ల స్కామ్ అనే విషయానికి వస్తే.. ముంబైకి చెందిన వ్యాపారవేత్త , లోటస్ క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ డైరెక్టర్ దీపక్ కొఠారి.. శిల్పా - రాజ్ కుంద్రా దంపతులపై ఆరోపణలు చేశారు. 2015 - 2023 మధ్యకాలంలో శిల్పా శెట్టి దంపతులు రూ.60 కోట్ల మేరా తనను మోసం చేశారని ఆరోపిస్తూ ఆయన పోలీసులను ఆశ్రయించారు. తమ వ్యాపార సంస్థలను విస్తరించడానికి ఆ డబ్బును తాను పెట్టుబడిగా పెట్టానని.. కానీ ఆ డబ్బును వ్యక్తిగత అవసరాలకు ఖర్చు చేశారు అని దీపక్ తెలిపారు.

నమ్మించి మోసం చేశారు..

ఇకపోతే రాజేష్ ఆర్య అనే ఒక వ్యక్తి ద్వారా వీరు తనకు పరిచయమయ్యారని, ఆ సమయంలో వారు బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్ అనే హోమ్ షాపింగ్ కంపెనీకి డైరెక్టర్లుగా ఉండే వారిని కంపెనీలో 87.6% వారిదేనని దీపక్ తెలిపారు.. "మొదట 75 కోట్లు 12 శాతం వడ్డీతో కావాలని కోరారు. కానీ పన్నుల భారం నుంచి తప్పించుకోవడానికి రుణం బదులుగా పెట్టుబడిగా మార్చాలని నన్ను ఒప్పించారు. నెలవారీ రాబడి ఇవ్వకపోగా అసలు కూడా తిరిగి ఇవ్వలేదు. వీరి మాటలు నమ్మి 2015 ఏప్రిల్ లో రూ.31.9 కోట్లు, అదే ఏడాది సెప్టెంబర్ లో రూ.28.53 కోట్లు బదిలీ చేశాను" అని దీపక్ కొఠారి ఎఫ్ఐఆర్లో తెలిపారు. ప్రస్తుతం ఈ కేసులోనే ఇరుక్కున్న ఈ జంటకు పోలీసులు లుకౌట్ నోటీస్ జారీ చేయబోతున్నట్లు సమాచారం.