అనన్యతో ప్రియుడు.. జాన్వీ ఒప్పుకుంటుందా?
అతిలోక సుందరి శ్రీదేవి తనయ అందాల జాన్వీకపూర్ ప్రస్తుతం `పెద్ది` చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
By: Sivaji Kontham | 10 Nov 2025 9:53 AM ISTఅతిలోక సుందరి శ్రీదేవి తనయ అందాల జాన్వీకపూర్ ప్రస్తుతం `పెద్ది` చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. జాన్వీ వరుసగా టాలీవుడ్ అగ్ర హీరోల సరసన అవకాశాలు అందుకుంటోంది. దేవరలో ఎన్టీఆర్ సరసన నటించిన జాన్వీ వెంటనే చరణ్ సరసన పెద్ది సినిమాలో అవకాశం అందుకుంది. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ఇప్పటికే విడుదలై ఇంటర్నెట్ లో జెట్ స్పీడ్ తో దూసుకెళ్లింది. ఏ.ఆర్.రెహమాన్ బాణీకి తగ్గట్టు చరణ్ స్టెప్పులు జాన్వీ హొయలు కుర్రకారు హృదయాలను గెలుచుకున్నాయి.
అయితే ఇటీవల హైదరాబాద్ టు ముంబై ప్రయాణాలతో బిజీగా ఉన్న జాన్వీకపూర్ తన ప్రియుడు శిఖర్ పహారియాకు కొంత దూరంగానే ఉంటోంది. ఇలాంటి సమయంలో శిఖర్ ముంబై పార్టీల్లో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారుతున్నాయి.
ఇటీవల ఓ కామన్ ఫ్రెండ్ మ్యారేజ్ పార్టీకి అటెండయిన శిఖర్ పహారియా అక్కడ అనన్య పాండేకు పెయిర్‌గా ఫోజులిచ్చాడు. ప్రస్తుతం ఈ యూనిక్ ఫోటోగ్రాఫ్స్ ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారుతున్నాయి. శిఖర్‌ని ఇలా చూస్తే జాన్వీ ఫీలవుతుందేమో! అంటూ అభిమానులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. అయితే జాన్వీకపూర్ దీనిని అంగీకరిస్తూ సందేశం ఇచ్చింది. జాన్వీ, అనన్య పాండే, సారా అలీఖాన్ లకు శిఖర్ కామన్ ఫ్రెండ్. అందుకే అతడు ఇలా చనువుగా గాళ్స్ తో ఫోజులివ్వగలడు. ఇక శిఖర్ పహారియా- జాన్వీ కపూర్ జంటను చూసుకుని మురిసిపోయే బోనీకపూర్ కూడా వీళ్లతో అప్పుడప్పుడు పార్టీల్లో చిల్లింగ్ ఫోజులిచ్చిన ఫోటోలు ఇంటర్నెట్‌లో సందడి చేస్తున్నాయి.
జాన్వీ కపూర్ హిందీ, తెలుగు చిత్రసీమల్లో కెరీర్ ని నిర్మించుకుని ముందుకు సాగుతోంది. పెద్ద స్టార్ అవ్వాలని కలలు కంటోంది. శిఖర్ పహారియా మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మనవడు. అటు రాజకీయ వారసత్వం ఉన్న శిఖర్ ఇటు గ్లామర్ ఇండస్ట్రీతో గొప్ప సత్సంబంధాలను కొనసాగిస్తున్నాడు. మరోవైపు జాన్వీ, శిఖర్ ల కామన్ ఫ్రెండ్ అనన్య పాండే ప్రస్తుతం తన సినీకెరీర్ ని చక్కదిద్దుకునే ప్రయత్నాల్లో ఉంది.
