Begin typing your search above and press return to search.

సోఫీ షైన్‌తో శిఖ‌ర్ ధావ‌న్ పెళ్లి విశేషాలు

ఇప్ప‌టికే సంగీత్ - మెహందీ వేడుక‌ల‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైర‌ల్ అయ్యాయి. ధావన్ తన స్టైల్‌లో సంగీత్ వేడుకలో డ్యాన్స్ చేసి అలరించారు.

By:  Sivaji Kontham   |   22 Feb 2026 12:21 PM IST
సోఫీ షైన్‌తో శిఖ‌ర్ ధావ‌న్ పెళ్లి విశేషాలు
X

టీమ్ ఇండియా మాజీ క్రికెటర్, `గబ్బర్` శిఖర్ ధావన్ రెండో వివాహం గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాల‌లో హాట్ టాపిక్‌గా మారింది. విదేశీ యువ‌తి సోఫీ షైన్ తో ధావన్ పెళ్లి వేడుకల‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ అవుతున్నాయి. శిఖర్ - సోఫీ షైన్ వివాహం అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య వైభవంగా జరిగింది. శ‌నివారం ఈ జంట మూడు ముళ్ల బంధంతో ఒక‌టైంది. సోఫీ షైన్ ఒక ప్రముఖ మోడల్.. వ్యాపారవేత్తగాను గుర్తింపు పొందారు. వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.. ఇప్పుడు అది పెళ్లి పీటల వరకూ వెళ్లి విజ‌య‌వంత‌మైంది.

ఇప్ప‌టికే సంగీత్ - మెహందీ వేడుక‌ల‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైర‌ల్ అయ్యాయి. ధావన్ తన స్టైల్‌లో సంగీత్ వేడుకలో డ్యాన్స్ చేసి అలరించారు. పంజాబీ డోల్ వాయిద్యాల మధ్య క్రికెటర్లు, స్నేహితులు సందడి చేశారు. సోఫీ షైన్ ఇప్ప‌టికే తన ప్రీ వెడ్డింగ్ లుక్స్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. వ‌ధువు ధరించిన హెవీ ఎంబ్రాయిడరీ లెహంగా, సాంప్రదాయ ఆభరణాలు మతులు చెడగొట్టేలా ఉన్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఈ వివాహ వేడుకకు క్రీడా ప్రపంచం స‌హా సినీ పరిశ్రమ నుండి ప్రముఖులు హాజరయ్యారు. ధావన్ ప్రాణ స్నేహితులు అయిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ .. ఇతర టీమ్ ఇండియా సభ్యులు హాజరయ్యారు. దురంధ‌ర్ ద‌ర్శ‌కుడు ఆదిత్యాధ‌ర్ పెళ్లికి విచ్చేసారు. ఆదిత్యా ధ‌ర్ ధావన్‌కు అత్యంత ఆప్తమిత్రుడు కావడంతో పెళ్లి పనుల్లో చురుగ్గా పాల్గొంటున్నారని స‌మాచారం.

ప్రముఖ యాంకర్, మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ షెఫాలి బగ్గా సంద‌డి కూడా ఈ పెళ్లిలో చ‌ర్చ‌గా మారింది. ఈ భామ‌ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు చర్చకు దారితీశాయి. షెఫాలి బగ్గా- శిఖర్ ధావన్ మధ్య మంచి స్నేహం మాత్రమే ఉంది. ఆమె ఈ వివాహ వేడుకకు అతిథిగా హాజరయ్యారు.

శిఖర్ ధావన్ తన మొదటి భార్య ఆయేషా ముఖర్జీతో విడాకులు తీసుకున్న తర్వాత మళ్ళీ సోఫీతో కొత్త జీవితాన్ని ప్రారంభించడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.