Begin typing your search above and press return to search.

సామ్ - రాజ్ పెళ్లి.. వారికి గట్టి కౌంటర్ ఇచ్చిన శ్యామలీ దే..

ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత.. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు ఇన్ని రోజులు రూమర్డ్ జంటగా పేరు సొంతం చేసుకుని.. ఇప్పుడు ఎట్టకేలకు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.

By:  Madhu Reddy   |   4 Dec 2025 5:57 PM IST
సామ్ - రాజ్ పెళ్లి.. వారికి గట్టి కౌంటర్ ఇచ్చిన శ్యామలీ దే..
X

ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత.. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు ఇన్ని రోజులు రూమర్డ్ జంటగా పేరు సొంతం చేసుకుని.. ఇప్పుడు ఎట్టకేలకు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. సమంత , నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత.. ఏడాదికి రాజ్ కూడా తన భార్య శ్యామలీ దేకి విడాకులు ఇచ్చారు. అప్పట్లో ఈ విషయాలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అప్పటినుంచి వీరి మధ్య ఏదో నడుస్తోందనే వార్తలు వైరల్ అవ్వగా.. ఎట్టకేలకు ఆ వార్తలను నిజం చేస్తూ డిసెంబర్ 1న సోమవారం రోజు ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో లింగ భైరవి సన్నిధిలో భూత శుద్ధి పద్ధతిలో వివాహం చేసుకున్నారు.

ఈ వివాహాన్ని అధికారికంగా ధ్రువీకరిస్తూ సమంత తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా కొన్ని ఫోటోలను పంచుకుంది. అలాగే ఈమె స్నేహితురాలు శిల్పారెడ్డి కూడా పెళ్లికి సంబంధించిన ఇన్సైడ్ ఫోటోలను కూడా అభిమానులతో పంచుకుంది. ఇకపోతే సమంత - రాజ్ వివాహం తర్వాత రాజ్ మాజీ భార్య శ్యామలీ ఎలాంటి పోస్టులు పెడుతుందో అని అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. అయితే వీరి పెళ్లి గురించి శ్యామలీ నేరుగా స్పందించలేదు కానీ వీరి పెళ్లి జరిగిన మూడు రోజుల తర్వాత తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో సుదీర్ఘమైన నోట్ ను పంచుకుంది శ్యామలీ.

అందులో కష్ట సమయంలో తనకు అండగా నిలిచిన వారికి కృతజ్ఞతలు తెలిపింది. ఇప్పటికే ఇల్లు భారంగా మారిపోయిందని, ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను అని, ముఖ్యంగా తనకు మద్దతుగా నిలిచిన వారికి కృతజ్ఞతలు చెప్పలేకపోయాను క్షమించండి అంటూ కోరింది. ముఖ్యంగా ట్విన్ హార్ట్స్ పై తన సుదీర్ఘ అభ్యాసం గురించి కూడా ప్రస్తావించింది. ఇకపోతే తన పేజీని ఒంటరిగా తానే నడుపుతోందని.. తనకు ఎటువంటి పిఆర్ టీం లేదని, మేనేజర్ లేరని అందరికీ గుర్తు చేసింది. ఇప్పుడు మరొక పోస్ట్ షేర్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది శ్యామలీ.

తాజాగా పంచుకున్న ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో.." ఇప్పుడు ఎవరైనా డ్రామా అలాగే బ్రేకింగ్ న్యూస్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే దానిని మీరు ఇక్కడ ఎప్పటికీ కనుగొనలేరు. దయచేసి ఇలాంటి వాటికోసం వెతక కండి. ముఖ్యంగా అలా బ్రేకింగ్ కోసం ఎదురు చూసేవారు దయచేసి నా ఇంస్టాగ్రామ్ ఖాతాను ఓపెన్ చేయకపోవడమే మంచిది. శ్రద్ధ, మీడియా కవరేజ్, ప్రత్యేక ఇంటర్వ్యూలు, బ్రాండ్ ప్రమోషన్లు లాంటివి చేయడం లేదు. ముఖ్యంగా సానుభూతి కోసం అస్సలు చూడడం లేదు. ఇక ఎవరినైనా నిందించడానికి కూడా ఇక్కడ ప్రయత్నం చేయడం లేదు" అంటూ రూమర్స్ క్రియేట్ చేయాలని చూస్తున్నవారికి ఇన్ డైరెక్ట్ గా గట్టి కౌంటర్ ఇచ్చింది శ్యామలీ. ప్రస్తుతం శ్యామలీ పంచుకున్న ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

ఏది ఏమైనా సమంత - రాజ్ నిడిమోరుల వివాహం తర్వాత శ్యామలీ పెడుతున్న పోస్టులు డైరెక్ట్ గా వీరి పేర్లను ప్రస్తావించకపోయినా.. చూసేవారు మాత్రం వీరికి సంబంధించినవే అంటూ ఆపాదిస్తున్నారు.. ప్రస్తుతం శ్యామలీ షేర్ చేసిన పోస్ట్ వైరల్ గా మారుతోంది.