Begin typing your search above and press return to search.

సామ్ - రాజ్ పెళ్లి.. స్పందించిన శ్యామలీ.. ఎన్నో నిద్రలేని రాత్రులు అంటూ..

వివాహం జరిగిన మూడు రోజుల తర్వాత రాజ్ నిడిమోరు మాజీ భార్య శ్యామలీ దే తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా ఒక సుదీర్ఘ నోటు పంచుకుంది.

By:  Madhu Reddy   |   4 Dec 2025 11:44 AM IST
సామ్ - రాజ్ పెళ్లి.. స్పందించిన శ్యామలీ.. ఎన్నో నిద్రలేని రాత్రులు అంటూ..
X

డిసెంబర్ 1 సోమవారం రోజు సమంత ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో ఏడడుగులు వేసిన విషయం తెలిసిందే. కోయంబత్తూర్ లోని ఈషా యోగ సెంటర్ సమీపంలో ఉన్న లింగ భైరవి సన్నిధిలో భూత శుద్ధి పద్ధతిలో వివాహం చేసుకున్నారు. వివాహం జరిగిన మూడు రోజుల తర్వాత రాజ్ నిడిమోరు మాజీ భార్య శ్యామలీ దే తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా ఒక సుదీర్ఘ నోటు పంచుకుంది. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను అని, ప్రస్తుతం తన మనసు , దృష్టి ఎక్కడ ఉందో మీ అందరికీ తెలుసు అంటూ చెప్పుకొచ్చింది. మరి శ్యామలీదే షేర్ చేసిన ఆ నోట్ లో ఏముందో ఇప్పుడు చూద్దాం.




" కష్ట సమయాలలో నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. నేను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. తిరుగుతూ.. వాదించుకుంటూ.. నాపై సానుభూతి చూపిస్తున్న వారిని పట్టించుకోలేదు. దయచేసి నన్ను క్షమించండి. ముఖ్యంగా నాపై ప్రేమను కురిపిస్తున్న మీ అందరి మంచిని గుర్తించకపోవడం కృతజ్ఞత లేనిదే అనిపిస్తోంది. ఇక నేను చాలా సంవత్సరాలుగా ట్విన్ హార్ట్స్ పై ధ్యానం సాధన చేస్తున్నాను. ధ్యానం చేయడం అంటే.. జీవులకు, వ్యక్తులకు శాంతిని కలగజేయడం, ప్రేమ కురిపించడం, క్షమాపణ , ఆశ, కాంతి, ఆనందం, ప్రేమపూర్వక దయ, సద్భావన, మంచి చేయాలనే సంకల్పంతో ఆశీర్వదించడం" అంటూ ఆమె తెలిపింది.




ఇక అలాగే తన మాటలను కొనసాగిస్తూ.. తన మాజీ భర్త రెండవ వివాహం చేసుకోవడంతో.. తనపై వ్యక్తులు చూపిస్తున్న సానుకూలత గురించి మాట్లాడుతూ.. "నా స్నేహితుడు నాకు గుర్తు చేసినట్లుగా.. నా దగ్గర బృందం లేదు. పిఆర్ టీం లేదు. నా సోషల్ మీడియా ఖాతాను నిర్వహించే సిబ్బంది, సహచరులు లేరు. నా పూర్తి ఉనికికి అవసరమయ్యే దానితో నేను వ్యక్తిగతంగానే స్పందిస్తున్నాను.




ముఖ్యంగా నేను ఇతరుల సానుభూతి పొందడానికి ఈ పోస్టును షేర్ చేయడం లేదు. నా మనసులోని భావనను మీతో పంచుకుంటున్నాను " అంటూ శ్యామలీ ఒక సుదీర్ఘ నోటు పంచుకుంది. ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అటు శ్యామలీ దే కి మద్దతు పెరుగుతోందని అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు.

ఇకపోతే తన జ్యోతిష్య గురువు గురించి మాట్లాడుతూ.. "నవంబర్ 9న నా జ్యోతిష్య గురువు స్టేజ్ 4 క్యాన్సర్ ఉన్నట్టు నిర్ధారణ అయింది. ఇది దురదృష్టవశాత్తు మెదడుతో పాటు శరీరంలోని అనేక భాగాలకు వ్యాపించినట్లు తెలిసింది. అయితే ప్రస్తుతం నా దృష్టి ఇప్పుడు ఎక్కడ ఉందో మీ అందరికీ అర్థమవుతుందని నేను కచ్చితంగా అనుకుంటున్నాను " అంటూ శ్యామలీ కామెంట్ చేసింది. మొత్తానికైతే ఈమె పంచుకున్న నోట్ చూసిన తర్వాత శ్యామలీ తన మాజీ భర్త రెండో వివాహం చేసుకోవడంపై ఈ విధంగా తన మనసులో భావాలను పంచుకుంది అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.