Begin typing your search above and press return to search.

బ్రెస్ట్ ఇంప్లాంట్స్ తొల‌గించుకున్న హైద‌రాబాదీ న‌టి

తాజా స‌మాచారం మేర‌కు షెర్లిన్ ఇంప్లాంట్స్ రిమూవల్ సర్జరీ చేయించుకున్నారు.

By:  Sivaji Kontham   |   18 Nov 2025 3:47 PM IST
బ్రెస్ట్ ఇంప్లాంట్స్ తొల‌గించుకున్న హైద‌రాబాదీ న‌టి
X

న‌టి కం మోడల్ షెర్లిన్ చోప్రా బ్రెస్ట్ ఇంప్లాంట్స్ విక‌టించాయ‌ని తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేసిన వీడియోలు ఇంత‌కుముందు వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. తాజా స‌మాచారం మేర‌కు షెర్లిన్ ఇంప్లాంట్స్ రిమూవల్ సర్జరీ చేయించుకున్నారు. తాజా వీడియోలో మారిన షెర్లిన్ రూపం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

బ్రెస్ట్ ఇంప్లాంట్స్ వ‌ల్ల తాను ఎదుర్కొన్న బాధ‌ల‌న్నిటినీ ఏక‌రువు పెడుతూ షెర్లిన్ ఇచ్చిన సందేశం యువ‌త‌రంలోకి దూసుకెళ్లింది. ఇలాంటి పొర‌పాట్లు ఎప్పుడూ చేయ‌కూడ‌ద‌ని ఈ భామ పేర్కొన్నారు.

ఆన్‌లైన్‌లో షేర్ చేసిన వీడియోలో శస్త్రచికిత్స తర్వాత తాను ఎంతో సంతోషంగా ఉన్నాన‌ని షెర్లిన్ అన్నారు. ఒక్కొక్కటి 825 గ్రాముల బ‌రువు ఉన్న ఇంప్లాంట్స్ ని నా బ్రెస్ట్ నుంచి తొల‌గించారు.. నేను సీతాకోకచిలుకలా తేలికగా ఉన్నాను! అని ఆనందం వ్య‌క్తం చేసింది షెర్లిన్.

సోషల్ మీడియా ద్వారా ఇలాంటి ప్ర‌క‌ట‌న‌లు చూసి ప్రభావితమై హఠాత్తుగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల కలిగే ప్రమాదాలను కూడా షెర్లిన్ యువ‌త‌రానికి భోధించింది. సోషల్ మీడియా ప్రభావంతో శరీరాలను తారుమారు చేయవద్దని ఈ దేశంలోని యువతను అభ్యర్థిస్తున్నాను. మీరు ఏది చేయాలనుకున్నా, దాని సాధకబాధకాలను కూడా తెలుసుకోవ‌డానికి ప్ర‌య‌త్నించండి.. మీ కుటుంబం వైద్య నిపుణులతో చర్చించండి. దేనికీ తొందరపడకండి.. అని సందేశం ఇచ్చింది.

త‌న రొమ్ము నుంచి ఇంప్లాంట్స్ తొల‌గించాక తేలికైన శ‌రీరంతో ఉన్న షెర్లిన్.. ఇలాంటి అద‌న‌పు బ‌రువును మోయాల్సిన ప‌ని లేద‌ని వ్యాఖ్యానించారు. రొమ్ము ఎక్స్‌ప్లాంట్ శస్త్రచికిత్స కోసం నైపుణ్యం కలిగిన వైద్యుల బృందానికి చాలా ధన్యవాదాలు తెలిపారు.

ఇంత‌కుముందు కాస్మోటిక్ స‌ర్జ‌రీ ద్వారా త‌న గ‌డ్డం సాగిపోయింద‌ని, పెద‌వులు జారిపోయాయ‌ని ఆవేద‌న క‌న‌బ‌రిచిన షెర్లిన్, ఇప్పుడు బ్రెస్ట్ ఇంప్లాంట్స్ వ్య‌వ‌హారాన్ని కూడా త‌ప్పు ప‌ట్టింది. స్వీయానుభ‌వాల నుంచి ఇత‌రుల‌ను హెచ్చ‌రించింది. షెర్లిన్ ధైర్యాన్ని ఇప్పుడు అంద‌రూ ప్ర‌శంసిస్తున్నారు.

షెర్లిన్ హైద‌రాబాదీ అమ్మాయి. న‌టిగా మోడ‌ల్ గా ఉజ్వ‌ల‌మైన‌ కెరీర్ కోసం ముంబైలో సెటిలైంది. ప్ర‌ఖ్యాత‌ ప్లేబోయ్ క‌వ‌ర్ పేజీపై ద‌ర్శ‌న‌మిచ్చిన మొద‌టి భార‌తీయ మోడ‌ల్ గాను షెర్లిన్ రికార్డుల‌కెక్కింది. ఏ ఫిలిం బై అర‌వింద్ లో షెర్లిన్ న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు కురిసాయి.