'అప్పుడేమైంది మీ హక్కు?'.. చిన్మయి, అనసూయపై ఫైర్
ఆ తర్వాత శివాజీ సారీ చెప్పినా కూడా మళ్లీ సోషల్ మీడియాలో రెస్పాండ్ అయ్యారు. అయితే ఇప్పుడు ఆ విషయంలోకి బిగ్ బాస్ ఫేమ్, యాక్టర్ శేఖర్ బాషా వచ్చారు.
By: M Prashanth | 27 Dec 2025 11:29 AM ISTహీరోయిన్ల డ్రెస్సింగ్ పై టాలీవుడ్ నటుడు శివాజీ చేసిన కామెంట్స్.. తీవ్ర వివాదస్పదమైన విషయం తెలిసిందే. శివాజీ కామెంట్స్ చేశాక అనేక మంది సెలబ్రిటీలు స్పందించగా.. సింగర్ చిన్మయి శ్రీపాద, యాంకర్ అనసూయ రెస్పాన్సులు మాత్రం వైరల్ గా మారాయి. వారిద్దరూ శివాజీ కామెంట్స్ పై పెద్ద ఎత్తున మండిపడ్డారు.
ఆ తర్వాత శివాజీ సారీ చెప్పినా కూడా మళ్లీ సోషల్ మీడియాలో రెస్పాండ్ అయ్యారు. అయితే ఇప్పుడు ఆ విషయంలోకి బిగ్ బాస్ ఫేమ్, యాక్టర్ శేఖర్ బాషా వచ్చారు. శివాజీకి సపోర్ట్ గా నిలిచారు. ఆయన కామెంట్స్ ను చాలా మంది వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా చిన్మయి, అనసూయలపై ఓ కార్యక్రమంలో తీవ్రంగా మండిపడ్డారు.
అసలు వారిద్దరికీ మహిళా హక్కులపై మాట్లాడే హక్కు ఉందా అని క్వశ్చన్ చేశారు. ఎలాంటి సందేశం ఇస్తున్నారని అడిగారు. ఇప్పటికే మహిళలను కొందరు కించపరిచే కామెంట్స్ చేసినప్పుడు ఎం రెస్పాండ్ అవ్వలేదని, అప్పుడు హక్కులు ఏమయ్యాయని క్వశ్చన్ చేశారు. వాడిన పదాలు, పాడిన పాటలు గుర్తు లేవా అంటూ ఎగ్జాంపుల్స్ చెప్పారు.
అనసూయ జబర్దస్త్ షోలో ఎన్నో సార్లు డబుల్ మీనింగ్ డైలాగ్స్ వాడిందని అన్నారు. చాలా సార్లు అసభ్యకర పదాలు కూడా యూజ్ చేసిందని.. అప్పుడు అది తప్పు కాదా అని క్వశ్చన్ చేశారు. ఇప్పుడు మాత్రం నీతులు చెబుతున్నారని విమర్శించారు. ఆ తర్వాత చిన్మయి ఇప్పటికే పాడిన వివిధ సాంగ్స్ కోసం మాట్లాడారు.
రోబో సినిమాలోని కిలిమంజారో సాంగ్ పాడినప్పుడు.. అందులో ఉన్న పదాలు, లైన్లు తప్పుగా అనిపించలేదా.. అంటూ చిన్మయిని క్వశ్చన్ చేశారు. మనం ఇప్పటికే అలాంటి పనులు చేసినప్పుడు.. ఇప్పుడు మిగతా వాళ్ళను ఎందుకు విమర్శించాలని అన్నారు. అలా విమర్శించే హక్కు ఎవరికీ కూడా లేదని శేఖర్ బాషా అభిప్రాయపడ్డారు.
దండోరా మూవీ ఈవెంట్ లో శివాజీ మంచి ఉద్దేశంతోనే ఆ వ్యాఖ్యలు చేశారని సపోర్ట్ చేశారు. ఆయన ఎలాంటి తప్పుడు ఉద్దేశంతో మాట్లాడలేదని స్పష్టం చేశారు. కానీ కొందరు కావాలని శివాజీ వ్యాఖ్యల విషయంలో అలా చేస్తున్నారని అన్నారు. మంచి కోసం చెప్పినా.. ఇలాంటి వక్రీకరించి వివాదాన్ని పెద్దదిగా చేస్తున్నారని శేఖర్ భాషా ఆరోపించారు.
అయితే తాను ప్రధాన పాత్రలో నటించిన దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శివాజీ హీరోయిన్ల వస్త్రధారణపై మాట్లాడారు. కొంచెం మంచి డ్రెస్ సెన్స్ పాటించాలని, ఇలా చెబుతున్నందుకు ఏమనుకోవద్దని చెబుతూనే, గ్రామర్ కు ఒక హద్దు ఉండాలన్నారు. స్వేచ్ఛ అనేది అదృష్టమని, కానీ దాన్ని ఎవరూ కోల్పోవద్దంటూ రెండు అసభ్యకరమైన పదాలు వాడారు. దీంత ఆ విషయం సర్వత్రా చర్చనీయాంశమైంది.
