Begin typing your search above and press return to search.

మొన్న మంగ్లీ.. నిన్న అషు రెడ్డి.. చీటింగ్ కేస్ పై శేఖర్ బాషా షాకింగ్ కామెంట్స్!

తెలుగు ప్రేక్షకులకు ఆర్జేగా, వీజేగా శేఖర్ బాషా సుపరిచితులే. నిత్యం సామాజిక అంశాలపై తనదైన శైలిలో స్పందించే ఆయన, తాజాగా ఒక ఇంటర్వ్యూలో మైక్రో ఫైనాన్స్ కేసులు మరియు సెలబ్రిటీల ప్రమేయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

By:  Madhu Reddy   |   28 April 2026 5:05 PM IST
మొన్న మంగ్లీ.. నిన్న అషు రెడ్డి.. చీటింగ్ కేస్ పై శేఖర్ బాషా షాకింగ్ కామెంట్స్!
X

తెలుగు ప్రేక్షకులకు ఆర్జేగా, వీజేగా శేఖర్ బాషా సుపరిచితులే. నిత్యం సామాజిక అంశాలపై తనదైన శైలిలో స్పందించే ఆయన, తాజాగా ఒక ఇంటర్వ్యూలో మైక్రో ఫైనాన్స్ కేసులు మరియు సెలబ్రిటీల ప్రమేయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగ్లీ, అషు రెడ్డి వంటి వారి పేర్లు ఈ వివాదాల్లో వినిపిస్తున్న వేళ, బాధితులకు న్యాయం జరగాలంటే ప్రభుత్వం మరియు పోలీసులు ఎలా వ్యవహరించాలో ఆయన విశ్లేషించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

మీడియా అటెన్షన్.. అషు రెడ్డి ఎంట్రీ:

ఇటీవల మైక్రో ఫైనాన్స్ బాధితులు రోజూ మీడియా ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంగ్లీ గపై వస్తున్న ఆరోపణల గురించి శేఖర్ బాషా మాట్లాడుతూ.. "అషు రెడ్డి పేరు బయటకు రావడంతో కొంత మీడియా అటెన్షన్ అటు వైపు మళ్లింది, దీంతో మంగ్లీ కాస్త ఊపిరి పీల్చుకుని ఉండవచ్చు" అని సరదాగా వ్యాఖ్యానించారు. అయితే ఇది కేవలం వ్యక్తిగత విషయం కాదని, వేల మంది రోడ్డున పడ్డ ఇష్యూ అని ఆయన గుర్తు చేశారు.

ఇది వేల మంది జీవితాలకు సంబంధించినది:

సెలబ్రిటీల పేర్లు వినిపించినప్పుడు మీడియా ఫోకస్ కేవలం వారి మీదనే ఉండకూడదని శేఖర్ బాషా అభిప్రాయపడ్డారు. "మంగ్లీనో లేక మరొకరినో టార్గెట్ చేయమని నేను చెప్పట్లేదు. కానీ, వందల వేల మంది బాధితులకు న్యాయం జరిగే వరకు మీడియా తన పోరాటాన్ని ఆపకూడదు" అని ఆయన పిలుపునిచ్చారు. ఈ కేసులు ప్రస్తుతం ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ పరిధిలో ఉన్నాయని, దర్యాప్తు వేగంగా జరగాలని కోరారు.

ఆ వర్గం నేతలు :

ఈ కేసులో వినిపిస్తున్న మరో వాదనల గురించి కూడా శేఖర్ బాషా స్పందించారు. మోసపోయింది ఆమె వర్గం బిడ్డలేనని, మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు కూడా అదే వర్గానికి చెందిన వారని చర్చ జరుగుతోందని ఆయన అన్నారు. అయితే, "ఎవరు మోసం చేసినా, ఎవరు మోసపోయినా చట్టం ముందు అందరూ సమానమే. న్యాయం అనేది అందరికీ ఒకేలా జరగాలి తప్ప, అది కులానికో వర్గానికో పరిమితం కాకూడదు" అని స్పష్టం చేశారు.

ప్రభుత్వాలు ఫోర్స్ చేయాలి:

ఇక అసలు దోషులు బయటకు రావాలంటే కేవలం పోలీసులు, కోర్టులే సరిపోవని.. ప్రభుత్వాల నుంచి కూడా గట్టి ఒత్తిడి ఉండాలని శేఖర్ బాషా అన్నారు. "పోలీసులు తమ పనిని వేగవంతం చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇక ఎప్పుడైతే ప్రభుత్వం ఫోర్స్ చేస్తుందో, అప్పుడే నిజమైన దోషులు ఎవరో బయటకు వస్తారు. బాధితులకు ఆ సొమ్ము తిరిగి అందే అవకాశం ఉంటుంది" అని తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.

బాధితుల పక్షాన పోరాటం అవసరం:

ఈ మైక్రో ఫైనాన్స్ బాధితులు ప్రతిరోజూ ప్రెస్ మీట్లు పెట్టి తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నా, ఇప్పటి వరకు ఆశించిన అప్డేట్ రాకపోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక కేవలం వార్తల కోసం కాకుండా, బాధితులకు న్యాయం జరిగే వరకు అందరు ఫాలో అవ్వాలని ఆయన మీడియాను కోరారు. అప్పుడే ఈ మోసాలకు ఒక ముగింపు దొరుకుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

శేఖర్ బాషా మాటలను బట్టి చూస్తుంటే, సెలబ్రిటీల ఇన్వాల్వ్మెంట్ కంటే బాధితుల కన్నీళ్లు తుడవడం ముఖ్యమని అర్థమవుతోంది. వ్యవస్థలో లోపాలు ఉన్నప్పుడు ప్రభుత్వాలు స్పందిస్తేనే సామాన్యులకు భరోసా దొరుకుతుంది. ఇక మరి ఈ చీటింగ్ కేసుల్లో పోలీసులు ఎంత వేగంగా స్పందిస్తారో, బాధితులకు న్యాయం ఎప్పుడు జరుగుతుందో వేచి చూడాలి. తనదైన శైలిలో వాస్తవాలను మాట్లాడిన శేఖర్ బాషాను నెటిజన్లు అభినందిస్తున్నారు.