Begin typing your search above and press return to search.

చనిపోయిన రోజు ఏం జరిగిందో బయటపెట్టిన షెఫాలీ భర్త!

ఈ విషయాన్ని అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోయారు. అయితే ఈమె మరణించిన రోజు అసలేం జరిగింది అనే విషయాన్ని ఆమె భర్త బయటపెట్టారు.

By:  Madhu Reddy   |   28 Sept 2025 12:00 AM IST
చనిపోయిన రోజు ఏం జరిగిందో బయటపెట్టిన షెఫాలీ భర్త!
X

'కాంటా లగా' అనే రీమిక్స్ మ్యూజిక్ వీడియోతో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది షెఫాలీ జరివాలా.. ఈ ఒక్క పాటతో "కాంటా లగా గర్ల్" గా పేరు దక్కించుకుంది ముఖ్యంగా హిందీలో బిగ్ బాస్ సీజన్ 13 లో కంటెస్టెంట్ గా పాల్గొన్న ఈమె పలు రియాల్టీ షోలో కూడా సందడి చేసింది. అంతేకాదు 'ముజ్సే షాదీ కరోగీ' అనే సినిమాతో మంచి గుర్తింపు అందుకుంది. ఇదిలా ఉండగా ఈమె 2025 జూన్ 27న 42 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోయారు. అయితే ఈమె మరణించిన రోజు అసలేం జరిగింది అనే విషయాన్ని ఆమె భర్త బయటపెట్టారు.

తాజాగా షెఫాలీ భర్త పరాగ్ త్యాగి.. "షెఫాలీ పరాగ్ త్యాగి" అంటూ ఒక పాడు కాస్ట్ ఛానల్ ను ప్రారంభించారు. మొదట తన సెల్ఫ్ ఇంటర్వ్యూ ఇచ్చిన పరాగ్.. ఆ తర్వాత తన భార్య మరణం గురించి .. తన భార్య మరణం తర్వాత తన పరిస్థితి ఎలా ఉంది.. అసలు తన భార్య చనిపోయిన రోజు ఏం జరిగింది.. ఇలా అనేక విషయాలపై స్పందించారు. పరాగ్ మాట్లాడుతూ.. "షెఫాలీ లేని జీవితాన్ని నేను ఊహించుకోలేకపోతున్నాను. ఆమె వాడిన బ్రష్ తోనే నా పళ్ళు తోముకుంటున్నాను. ఆమె వాడిన బట్టలను అన్ని నా పక్కనే పెట్టుకుంటున్నాను. ఆమె ఆర్డర్ చేసిన వస్తువులు అమెజాన్, ఫ్లిప్కార్ట్ నుండి ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. ఆమె విడిచిన బట్టలను ఇంతవరకు ఉతకలేదు.. అవి మరీ చిన్నగా ఉండడం చేత నేను వాటిని ధరించలేకపోతున్నాను. కానీ వాటిని నా పక్కనే పెట్టుకొని వాటిపై పడుకొని తనను గుర్తు చేసుకుంటున్నాను" అంటూ చెప్పి ఎమోషనల్ అయిపోయారు.

అలాగే షెఫాలీ చివరి రోజు ఏం జరిగింది అనే విషయంపై కూడా మాట్లాడుతూ.. షెఫాలీ ఆరోజు నన్ను సింబా (పెట్ డాగ్)ను వాకింగ్ కి తీసుకెళ్లమని చెప్పింది. బయటకు వెళ్లి వచ్చేలోపే అపస్మారక స్థితిలో పడి ఉంది. వెంటనే నేను సీపీఆర్ కూడా చేశాను.రెండుసార్లు శ్వాస తీసుకొని వెంటనే కన్నుమూసింది" అంటూ చెప్పుకొచ్చారు.

ఇకపోతే ఈమె 42 ఏళ్ల వయసులో కూడా ఇంత యవ్వనంగా ఉండడానికి కారణం యాంటీ ఏజింగ్ డ్రగ్స్ వాడిందని ఇప్పుడు వాటివల్లే హార్ట్ ఎటాక్ వచ్చిందని చాలామంది ఆమెపై విమర్శలు కూడా గుప్పించారు. దానిపై కూడా పరాగ్ త్యాగి క్లారిటీ ఇచ్చారు. "చాలామంది షెఫాలీ యాంటీ ఏజింగ్ డ్రగ్స్ వాడిందని రూమర్స్ క్రియేట్ చేశారు. ఆమె మల్టీ విటమిన్స్ టాబ్లెట్లు మాత్రమే వాడింది. ఎప్పుడు కూడా డ్రగ్స్ తీసుకోలేదు" అంటూ క్లారిటీ ఇచ్చేశారు.

ఇకపోతే షెఫాలీ మరణించి మూడు నెలలు అవుతున్నా.. ఇప్పటికీ ఆమెను పరాగ్ మరచిపోలేకపోతున్నారు. అందులో భాగంగానే ఆమె పై ఉన్న ప్రేమకు గుర్తుగా పచ్చబొట్టు రూపంలో తన హృదయం పై ఆమె ముఖచిత్రాన్ని పదిలంగా భద్రపరుచుకున్నారు. ఇక నిత్యం తనతోనే ఉంటూ తనలోనే కలిసిపోయిన భార్య ఇప్పుడు లేదనే విషయాన్ని పరాగ్ జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పవచ్చు.