సమంత- రాజ్ పెళ్లి నుంచి షీతల్ నిడిమోరు మరో పోస్ట్
డిసెంబర్ 1న కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్ లో వీరి పెళ్లి జరగ్గా ఈ పెళ్లి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
By: Sravani Lakshmi Srungarapu | 10 Dec 2025 3:17 PM ISTసౌత్ స్టార్ హీరోయిన్ సమంత, డైరెక్టర్ రాజ్ నిడిమోరు పెళ్లి చేసుకుని ఒకటైన సంగతి తెలిసిందే. సినీ ఇండస్ట్రీ నుంచి, ఫ్యాన్స్ నుంచి ఈ జంటకు అందరూ శుభాకాంక్షలు చెప్తూ, సామ్ రాజ్ దంపతులు సంతోషంగా ఉండాలని అందరూ కొత్త జంటను ఆశీర్వదించారు. డిసెంబర్ 1న కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్ లో వీరి పెళ్లి జరగ్గా ఈ పెళ్లి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
సమంతకు ఎప్పుడూ అండగా ఉంటా
ఎంతో సాంప్రదాయబద్ధంగా సమంత, రాజ్ పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టగా, ఈ పెళ్లి గురించి రాజ్ నిడిమోరు సోదరి షీతల్ నిడిమోరు చేస్తున్న పోస్టులు అందరినీ ఎంతో ఎగ్జైట్ చేస్తున్నాయి. సమంతను తమ ఇంట్లోకి వెల్‌కమ్ చేస్తూ షీతల్ పెట్టిన పోస్ట్ ఇప్పటికే నెట్టింట వైరల్ అయిన విషయం తెలిసిందే. తమ ఫ్యామిలీలోకి సమంతను ఆహ్వానిస్తూ ఎప్పుడూ ఆమెకు అండగా ఉంటానని షీతల్ చెప్పారు.
సమంత రాకతో ఫ్యామిలీ పరిపూర్ణమైంది
తనకు ఆనందంతో మాటలు కూడా రావడం లేదని, ఓ గొప్ప భక్తుడు శివలింగాన్ని ఆలింగనం చేసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటాడో తాను కూడా ఆరోజు అంతే సంతోషంతో ఉన్నానని, ఇప్పుడే తన ఫ్యామిలీ పరిపూర్ణమైందని షీతల్ చేసిన పోస్ట్ ఎంతోమంది హృదయాల్ని తాకగా ఇప్పుడు షీతల్ సమంత- రాజ్ నిడిమోరు పెళ్లికి సంబంధించిన మరో ఫోటోను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.
శతమానంభవతి అంటూ పోస్ట్
ఈ పోస్ట్ లో షీతల్, సమంత- రాజ్ ల హల్దీ ఈవెంట్ నుంచి ఓ ఫ్యామిలీ ఫోటోను పోస్ట్ చేయగా అందులో సమంత, రాజ్ తో పాటూ రాజ్ ఫ్యామిలీ, షీతల్ ఫ్యామిలీ ఉన్నారు. ఈ పోస్ట్ కు షీతల్.. లవ్ షేర్డ్ ఈజ్ లవ్ మల్టిప్లైడ్ అనే క్యాప్షన్ తో పాటూ శతమానంభవతి అనే హ్యాష్ ట్యాగ్ ను జోడించగా, ఈ ఫోటోలో సమంత, రాజ్ ముఖాల్లోని చిరునివ్వులు అందరినీ ఎట్రాక్ట్ చేస్తున్నాయి.
