Begin typing your search above and press return to search.

షారుఖ్ ఖాన్ కి తల్లిగా షీబా చద్దా.. ఏజ్ గ్యాప్ పై సంచలన నిజాలు పెట్టిన బ్యూటీ!

బాలీవుడ్ నటి షీబా చద్దా.. ఈమె అంటే సౌత్ ప్రేక్షకులకు తెలియకపోయినప్పటికీ బాలీవుడ్లో పలు సినిమాలు చేసి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

By:  Madhu Reddy   |   9 Aug 2025 5:00 PM IST
షారుఖ్ ఖాన్ కి తల్లిగా షీబా చద్దా.. ఏజ్ గ్యాప్ పై సంచలన నిజాలు పెట్టిన బ్యూటీ!
X

సినిమా ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగే చాలామంది.. తమకంటే వయసులో చాలా చిన్నవారు.. పైగా కూతురు, మనవరాలు వయసున్న వారితో రొమాన్స్ చేయాల్సి ఉంటుంది. అటు హీరోయిన్స్ వయసు కూడా చాలా తక్కువగా ఉండడం పలు విమర్శలకు దారితీస్తోంది. ఇదిలా ఉండగా.. హీరో హీరోయిన్ల మధ్య ఏజ్ గ్యాప్ తో ఇప్పటికే చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అలా విడుదల అయిన సమయంలో ఎన్నో విమర్శలు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే హీరోలు తమ కంటే వయసులో చాలా చిన్నవాళ్లయిన హీరోయిన్స్ తో రొమాన్స్ చేయడమే కాదు.. వారికి కొడుకు, తమ్ముడు, అల్లుడు వంటి పాత్రల్లో కూడా చేయిస్తారు దర్శకులు.

అలా ఇప్పటికే చాలామంది లేడీ క్యారెక్టర్ ఆర్టిస్టులు తమకంటే వయసులో చాలా పెద్దవాళ్ళు అయిన హీరోలకి కూడా మదర్ క్యారెక్టర్ లలో పిన్ని, అక్క, అత్త క్యారెక్టర్ లలో నటించిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే నటీమణి కూడా షారుక్ ఖాన్ కంటే వయసులో చాలా చిన్నది. అయినా సరే ఆయనకు ఏకంగా తల్లి పాత్రలో నటించి అందరిని ఆశ్చర్యపరిచింది. మరి ఇంతకీ షారుఖ్ ఖాన్ కంటే వయసులో చిన్నదైనా.. ఆయనకు తల్లి పాత్రలో నటించిన ఆ నటి ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

బాలీవుడ్ నటి షీబా చద్దా.. ఈమె అంటే సౌత్ ప్రేక్షకులకు తెలియకపోయినప్పటికీ బాలీవుడ్లో పలు సినిమాలు చేసి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.అయితే అలాంటి షీబా చద్దా బాదాయి దో (Badhaai Do), డాక్టర్ జి (Doctor G)వంటి సినిమాల్లో నటించిన పాత్రల ద్వారా ఫేమస్ అయ్యింది.. 1998 నుండి బాలీవుడ్ పరిశ్రమలో రాణిస్తున్న షీబా చద్దా బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కంటే వయసులో చిన్నదట.అంతేకాదు షారుక్ ఖాన్ కాలేజీలో తనకంటే రెండు సంవత్సరాలు సీనియర్ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.ఇక షారుఖ్ ఖాన్ మనిషా కొయిరాలా(Manisha Koirala) కలిసి నటించిన దిల్సే మూవీలో షీబా చద్దా నటించింది. అలాగే జీరో(Zero) సినిమాలో కూడా షీబా చద్దా నటించింది.

కానీ షారుక్ ఖాన్ నటించిన రాయిస్ మూవీలో మాత్రం షారుక్ ఖాన్ కి తల్లిపాత్రలో నటించింది షీబా చద్దా.. అయితే ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో షీబా చద్దా గుర్తు చేసుకుంటూ.." షారుక్ ఖాన్ నటించిన రాయిస్ మూవీలో నేను ఆయన తల్లిగా నటించాను. కానీ ఆయన కాలేజీలో నాకంటే సీనియర్..మేమిద్దరం కలిసి ఒకే కాలేజీలో చదివాము. అయితే నేను ఈ పాత్రలో నటించను అని చెబితే నన్ను అందులో నుండి తీసేస్తారు. అందుకే అంత ధైర్యం చేయలేదు. అయితే నేను చాలా సార్లు నాకంటే వయసులో 10- 12 సంవత్సరాలు చిన్నవాళ్లయిన వాళ్లకి కూడా తల్లి పాత్రల్లో నటించాను. ఇక సినిమా ఇండస్ట్రీలో తమకంటే వయసులో పెద్దవారైనా హీరోలకి తల్లి, అక్క పాత్రలు నటించడం అనేది సహజం. ఇది చాలా సంవత్సరాలుగా కొనసాగుతున్నదే.అయితే మొదట్లో నేను ఈ పద్ధతి చూసి షాక్ అయ్యాను.

ఇదేంటి మనకంటే వయసులో పెదవాళ్ళకి తల్లిపాత్రలో నటించడం ఏంటి అని. కానీ ఆ తర్వాత నాకు నేను రియలైజ్ అయ్యి వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాను. ఒకవేళ అలాంటి పాత్రలను రిజెక్ట్ చేస్తే మళ్లీ మనకు అవకాశాలు రావు. అందుకే చాలామంది నటీమణులు ఇండస్ట్రీలో రాణించడం కోసం ఎలాంటి పనైనా చేస్తూ ఉంటారు"..అంటూ షీబా చద్దా చెప్పుకొచ్చింది. అలా షారుక్ ఖాన్ కంటే వయసులో చిన్నదైనా షీబా చద్దా ఆయనకి రెండు సినిమాల్లో తల్లి పాత్రలో నటించింది.