Begin typing your search above and press return to search.

దేవదాస్ పార్వతిగా షావుకారు జానకి చాన్స్ జస్ట్ మిస్

దక్షిణాది భాషల్లో దాదాపుగా నాలుగు వందలకు పైగా సినిమాల్లో నటించిన దిగ్గజ నటీమణి, బహుముఖ ప్రతిభా దురీణగా షావుకారు జానకి పేరు మొదట చెప్పుకోవాలి.

By:  Satya P   |   22 Aug 2026 9:58 AM IST
దేవదాస్ పార్వతిగా షావుకారు జానకి చాన్స్ జస్ట్ మిస్
X

దక్షిణాది భాషల్లో దాదాపుగా నాలుగు వందలకు పైగా సినిమాల్లో నటించిన దిగ్గజ నటీమణి, బహుముఖ ప్రతిభా దురీణగా షావుకారు జానకి పేరు మొదట చెప్పుకోవాలి. ఆమె 1950 దశకంలో వచ్చిన షావుకారు మూవీతో తొలిసారి హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా పేరే ఆమెకు ఇంటి పేరుగా ఫిక్స్ అయిపోయింది. నిజానికి షావుకారు జానకి ఇంటి పేరు శంకరమంచి వారు. ఆమెది రాజమండ్రి సొంత స్థలం. షావుకారు జానకి తెలుగు చలన చిత్ర సీమలో మొదటి తరంలో ఎన్నతగిన నటీమణిగా చెప్పాలి. ఏ పాత్రని ఇచ్చినా అందులో ఒదిగిపోవడం ఆమెకు మాత్రమే చెల్లు. ఆమె చేసిన పాత్రలు మాత్రమే జనాలకు కనిపిస్తాయి అంటే ఆమె నటనా వైదుష్యం ఏమిటో వేరేగా చెప్పాల్సిన పని లేదు.

దేవదాస్ లో పార్వతి పాత్ర :

ఇక 1953లో వేదాంతం రాఘవయ్య దర్శకుడిగా వచ్చిన దేవదాస్ మూవీలో మొదట పార్వతి పాత్రకు అనుకున్నది షావుకారు జానకినే. ఆమె మాత్రమే ఆ పాత్ర చేయగలరు అనుకుని చిత్ర యూనిట్ సంప్రదించింది. అప్పటికే విజయవంతమైన కధానాయికగా షావుకారు జానకి సినిమా పరిశ్రమలో నిరూపించుకున్నారు. అలా ఆమెకు అక్కినేని నాగేశ్వరరావు క్లాసిక్ సినిమా దేవదాసులో పార్వతి పాత్ర చాన్స్ దక్కింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆమె ఆ పాత్రను కోల్పోయారు అనే చెప్పాలి. ఆమె కనుక ఆ పాత్రలో నటించి ఉంటే ఆమె సినీ కెరీర్ వేరే విధంగా ఉండేది అన్న అభిప్రాయం అందరిలో ఉంది.

సావిత్రి కోసమే :

కానీ షావుకారు జానకికి ఆ పాత్ర తప్పిపోవడంతో ఆ తర్వాత ఆ అవకాశం సావిత్రికి దక్కింది. ఇది సావిత్రి సినీ ప్రయాణంలో ఒక మైలురాయిగా నిలిచింది అని కొత్తగా చెప్పాల్సింది లేదు. మరి డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోవడమో మరే ఇతర కారణాల వల్ల ఆమె ఆ త్యాగం పాత్రను చేయలేకపోయారు. ఆ తర్వాత సావిత్రిని పార్వతి పాత్రకు ఎంపిక చేయడంతో, ఆమె నటనకు అద్భుతమైన పేరు వచ్చింది.

విలక్షణ పాత్రలతో :

అయితేనేమి షావుకారు జానకి విలక్షణమైన పాత్రలతో ఏకంగా ఏడున్నర దశబ్దాల పాటు సినీ సీమను అలరించారు. ఆమె చేసిన తాయరమ్మ బంగారయ్యలో తాయారమ్మగా, అలాగే సంసారం చదరంగం మూవీలో చిలకమ్మగా ఆమెకు ఎంతగానో పేరు తెచ్చి పెట్టాయి. అలాగే జగపతి సంస్థ నిర్మించిన అక్కా చెల్లెలు సినిమాలో అక్కినేని సరసన ఆమె నటించారు. అందులో పాట పాండవులు పాండవులు తుమ్మెద అన్నది సూపర్ హిట్ సాంగ్. ఈ రోజుకీ ఎవెర్ గ్రీన్. అందులో ఆమె నటనతో పాటు డ్యాన్స్ కూడా అందరినీ నేటికీ అలరిస్తుంది.

బాలయ్యకు తల్లిగా :

ఇక అక్కినేని ఎన్టీఆర్ ల సరసన హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో నటించిన షావుకారు జానకి బాలక్రిష్ణ సినిమాల్లో తొలి రోజులలో ఎన్నో సినిమాల్లో నటించారు. రామ్ రహీమ్ మూవీలో బాలయ్య తల్లిగా ఆమె మంచి పాత్ర పోషించారు. అలాగే వేములవాడ భీమకవి చిత్రంలో కూడా బాలయ్య తల్లిగా ఆమె చక్కని పాత్రలో లీనమై నటించారు. నాటి నుంచి నేటి తరం దాకా ఎంతో మంది హీరోల సినిమాల్లో నటించిన షావుకారు జానకి పాత్ర నచ్చాలి కానీ అందులో లీనమైపోతారు అని పేరుంది. ఆమె డైలాగ్ డెలివరీ కూడా ఎంతో స్పష్టంగా ఉంటుంది. దానికి కూడా ఫ్యాన్స్ గా ఉన్న వారు ఎంతో మంది. మొత్తం మీద 1950ల నాటి నటీమణి షావుకారు జానకి అస్తమయం తో ఒక శకం ముగిసింది అని చెప్పాలి.