Begin typing your search above and press return to search.

చిరు, నయన్.. మరో రొమాంటిక్ సర్‌ప్రైజ్

మెగాస్టార్ చిరంజీవి అంటే మాస్ మాత్రమే కాదు, మెలోడీ అయినా, క్లాస్ అయినా అదిరిపోయే స్టెప్పులతో అలరించడం ఆయన స్పెషాలిటీ.

By:  M Prashanth   |   4 Dec 2025 11:23 AM IST
చిరు, నయన్.. మరో రొమాంటిక్ సర్‌ప్రైజ్
X

మెగాస్టార్ చిరంజీవి అంటే మాస్ మాత్రమే కాదు, మెలోడీ అయినా, క్లాస్ అయినా అదిరిపోయే స్టెప్పులతో అలరించడం ఆయన స్పెషాలిటీ. ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న 'మన శంకరవరప్రసాద్ గారు' సినిమా నుంచి అలాంటి మ్యూజికల్ ట్రీట్స్ వరుసగా వస్తున్నాయి. ఇప్పటికే రిలీజైన 'మీసాల పిల్ల' సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో దూసుకుపోతుండగా, ఫ్యాన్స్ ఆ కిక్ నుంచి బయటకు రాకముందే మరో సర్ ప్రైజ్ అప్డేట్ వచ్చేసింది.





తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ 'శశిరేఖ' వివరాలను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. డిసెంబర్ 8న ఫుల్ లిరికల్ సాంగ్ విడుదల కానుండగా, డిసెంబర్ 6న ప్రోమోతో చిన్న శాంపిల్ చూపించనున్నారు. ఈ సాంగ్ అప్డేట్ కోసం వదిలిన పోస్టర్ ఇప్పుడు వైరల్ అవుతోంది. సముద్రపు ఒడ్డున చిరు, నయనతార స్టైలిష్ గా నడుచుకుంటూ వస్తున్న లుక్ చాలా ఫ్రెష్ గా, కలర్ ఫుల్ గా ఉంది.

భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ పాట ఒక క్లాసీ మెలోడీ బీట్ లా ఉండబోతోందని తెలుస్తోంది. చిరంజీవి వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ కాస్ట్యూమ్ లో యంగ్ గా కనిపిస్తుంటే, నయనతార ఆరెంజ్ ప్యాంట్, బ్లూ షర్ట్ లో ట్రెండీగా ఉంది. ఇద్దరి కెమిస్ట్రీ పోస్టర్ లోనే అదిరిపోయింది. 'శశిరేఖ' లవ్లీ మెలోడీగా చార్ట్ బస్టర్ అవ్వడం ఖాయంలా కనిపిస్తోంది.

అనిల్ రావిపూడి తన సినిమాల్లో పాటలను చాలా ఎనర్జిటిక్ గా, కలర్ ఫుల్ గా ప్లాన్ చేస్తారు. ఈ సినిమా కూడా దానికి మినహాయింపు కాదని అర్థమవుతోంది. ముఖ్యంగా చిరు డ్యాన్స్ మూమెంట్స్, నయన్ గ్లామర్ ఈ పాటకు ప్రధాన ఆకర్షణ కానున్నాయి. ఇప్పటికే ఆడియోపై మంచి అంచనాలు ఉన్నాయి, ఈ రెండో పాటతో ఆ అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది.

వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా 2026 జనవరిలో ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో వెంకటేష్ కూడా ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. మెగా, విక్టరీ కాంబినేషన్, దానికి తోడు ఇలాంటి సూపర్ సాంగ్స్.. ఏదేమైనా సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర అసలైన పండగ చూడబోతున్నాం అనిపిస్తోంది.