Begin typing your search above and press return to search.

పెయిడ్ రివ్యూ వ్యాఖ్య‌పై శ‌శి థ‌రూర్ కౌంట‌ర్

సోష‌ల్ మీడియా, డిజిట‌ల్ యుగంలో ఎవ‌రైనా సెల‌బ్రిటీ ఏదైనా కామెంట్ చేసినా లేదా దేని గురించి అయినా స‌మీక్షించినా దానిపై కొన్ని ప్ర‌శంస‌ల‌తో పాటు, తీవ్ర‌మైన‌ ట్రోలింగ్ ని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.

By:  Sivaji Kontham   |   28 Oct 2025 12:00 PM IST
పెయిడ్ రివ్యూ వ్యాఖ్య‌పై శ‌శి థ‌రూర్ కౌంట‌ర్
X

సోష‌ల్ మీడియా, డిజిట‌ల్ యుగంలో ఎవ‌రైనా సెల‌బ్రిటీ ఏదైనా కామెంట్ చేసినా లేదా దేని గురించి అయినా స‌మీక్షించినా దానిపై కొన్ని ప్ర‌శంస‌ల‌తో పాటు, తీవ్ర‌మైన‌ ట్రోలింగ్ ని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అలాంటి సెగ సీనియ‌ర్ కాంగ్రెస్ నాయ‌కుడు శ‌శి థ‌రూర్‌ని తాకింది. ఆయ‌న షారూఖ్ వార‌సుడు ఆర్య‌న్ ఖాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `ది బా***డ్స్ ఆఫ్ బాలీవుడ్`ని వీక్షించాక‌ స‌మీక్ష‌ను రాసారు.

అయితే ఇది `పెయిడ్ రివ్యూ` అంటూ విమ‌ర్శించాడు ఒక నెటిజన్. అయితే థ‌రూర్ అత‌డిని క్ష‌మించి వ‌దిలేయ‌లేదు. విమ‌ర్శ‌కు ప్ర‌తి విమ‌ర్శ‌గా దానిపై కౌంట‌ర్ ఇచ్చారు. ``నేను అమ్మకానికి లేను.. నా మిత్రమా. నేను వ్యక్తపరిచే ఏ అభిప్రాయానికీ ఎవరూ డబ్బు చెల్లించలేదు..నగదు లేదా వస్తు రూపంలో`` అని థ‌రూర్ బదులిచ్చారు.

ఇంత‌కీ శ‌శిథ‌రూర్ త‌న స‌మీక్ష‌లో ఏం రాసారు? అంటే... రెండు రోజులుగా జ‌లుబు ద‌గ్గుతో బాధ‌ప‌డుతున్న నేను కంప్యూట‌ర్ నుంచి టీవీ వైపు దృష్టి సారించాను. నా సోద‌రి న‌న్ను నెట్ ఫ్లిక్స్ లో ఆర్య‌న్ ఖాన్ సిరీస్ వైపు దృష్టి మ‌ళ్లించ‌మ‌ని ఒప్పించారు. ఇది నేను ఇప్పటివరకు చేసిన అత్యుత్తమ ప‌నుల‌లో ఒకటి.. ఈ వెబ్ సిరీస్ సంపూర్ణ‌మైన #ఓటీటీ గోల్డ్ అంటూ ప్ర‌శంసించారు.

ప‌దునైన ర‌చ‌న‌తో ఈ సిరీస్ దిశ నిర్భ‌యంగా ఉంది. ఈ వ్యంగ్యం, ధైర్యసాహసాలు బాలీవుడ్‌కు అవసరమైనవి. ఒక మేధావి హాస్యంతో, కదిలించే సెటైర్ల‌తో, ఎల్లప్పుడూ గ్లామర్‌కు మించి కనిపించేవాడు.. ప్రతి సినిమాటిక్ సీన్‌ను తెగే ఎడ్జ్‌తో తెలివిగా నింపాడు. ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునే జోకుల‌తో తెర‌పై దృష్టి సారించేలా చేసారు. ఆర్య‌న్ మీరు ఒక క‌ళాఖండాన్ని అందించారు. ది బా***డ్స్ఆఫ్ బాలీవుడ్ తెలివైనది! ఒక తండ్రిగా షారూఖ్ గ‌ర్వించే క్ష‌ణ‌మిది`` అని రాసారు. ఈ వెబ్ సిరీస్‌లో బాబీ డియోల్, లక్ష్య లాల్వానీ, రాఘవ్ జుయల్ తదితరులు న‌టించ‌గా, బాలీవుడ్ సూప‌ర్‌స్టార్లు అతిథులుగా మెరిసారు.