Begin typing your search above and press return to search.

7 నెల‌ల్లో శ‌ర్వానంద్ మూడు సినిమాలు?

గ‌త కొన్ని నెల‌లుగా బాడీ ట్రాన్స‌ఫ‌ర్మేష‌న్ కోసం ప్ర‌య‌త్నిస్తూ ఆ ప‌నిలో బిజీగా ఉన్నారు టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ‌ర్వానంద్.

By:  Sravani Lakshmi Srungarapu   |   20 Nov 2025 2:00 AM IST
7 నెల‌ల్లో శ‌ర్వానంద్ మూడు సినిమాలు?
X

గ‌త కొన్ని నెల‌లుగా బాడీ ట్రాన్స‌ఫ‌ర్మేష‌న్ కోసం ప్ర‌య‌త్నిస్తూ ఆ ప‌నిలో బిజీగా ఉన్నారు టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ‌ర్వానంద్. మొత్తానికి మేకోవ‌ర్ అయిన శ‌ర్వానంద్ ఇప్పుడు మ‌ళ్లీ షూటింగుల్లో పాల్గొంటున్నారు. ప్ర‌స్తుతం శ‌ర్వా చేతిలో మూడు సినిమాలున్నాయి. బైక‌ర్, నారీ నారీ నడుమ మురారి మ‌రియు భోగి. ఈ మూడు సినిమాల్లో బైక‌ర్ సినిమా షూటింగ్ ను పూర్తి చేశారు శ‌ర్వా.

టీజ‌ర్ తో అంచ‌నాల‌ను పెంచిన బైక‌ర్

డిసెంబ‌ర్ 6న బైక‌ర్ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఆల్రెడీ బైక‌ర్ నుంచి రిలీజైన టీజ‌ర్ ఆడియ‌న్స్ లో మంచి ఆస‌క్తిని రేకెత్తించి సినిమాపై అంచ‌నాల‌ను పెంచింది. బైక‌ర్ త‌ర్వాత శ‌ర్వానంద్ నుంచి నారీ నారీ న‌డుమ మురారి రానుంది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ను కూడా శ‌ర్వా పూర్తి చేస్తున్నారు. నారీ నారీ న‌డుమ మురారి 2026 సంక్రాంతికి రిలీజ్ కానుంది. న‌వంబ‌ర్ నెల‌లో ఈ సినిమాకు సంబంధించిన పెండింగ్ షూటింగ్ ను పూర్తి చేయ‌నున్నారు శ‌ర్వా.

మాస్ ఎంట‌ర్టైన‌ర్ గా రానున్న భోగి

ఇదిలా ఉంటే శ‌ర్వానంద్ తాజాగా సంపత్ నంది ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న మాస్ ఎంట‌ర్టైన‌ర్ భోగి మూవీ షూటింగ్ లో జాయిన్ అయ్యారు. శ‌ర్వానంద్ రీసెంట్ గా భోగి మూవీ కోసం డేట్స్ కేటాయించ‌డంతో ఈ సినిమా షూటింగ్ తిరిగి మొద‌లైంది. భోగి మూవీని పూర్తి చేయ‌డానికి శ‌ర్వా ఈ సినిమా కోసం 60 రోజులు వ‌ర్క్ చేయాల్సి ఉండ‌గా, ఫిబ్ర‌వ‌రి ఎండింగ్ కు భోగిని పూర్తి చేయాల‌ని శ‌ర్వా భావిస్తున్నార‌ట‌.

భోగి త‌ర్వాత శ్రీను వైట్ల ద‌ర్శ‌క‌త్వంలో..

ఫిబ్ర‌వ‌రి నాటికి భోగి షూటింగ్ ను పూర్తి చేసి సినిమాను 2026 స‌మ్మ‌ర్ రేస్ లో నిల‌పాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నార‌ట‌. కెకె రాధామోహ‌న్ నిర్మాణంలో తెర‌కెక్కుతున్న భోగి మూవీని పూర్తి చేసి ఆ త‌ర్వాత శ్రీను వైట్ల ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా కోసం వ‌ర్క్ చేయ‌నున్నారు శ‌ర్వా. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించ‌నున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉండ‌గా, శ‌ర్వానంద్ మాత్రం వ‌రుస సినిమాల‌ను లైన్ లో పెట్టి చాలా బిజీగా ఉన్నారు. అన్నీ అనుకున్న‌ట్టు జ‌రిగితే శ‌ర్వా నుంచి రాబోయే 7 నెల‌లో మూడు సినిమాలు రావ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.