Begin typing your search above and press return to search.

ఫ్రైడే నుంచి చూడండి.. మేమేంటో చూపిస్తాం: శర్వా

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్.. రీసెంట్ గా నారీ నారీ నడుమ మురారి మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   23 Jan 2026 1:34 PM IST
ఫ్రైడే నుంచి చూడండి.. మేమేంటో చూపిస్తాం: శర్వా
X

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్.. రీసెంట్ గా నారీ నారీ నడుమ మురారి మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఆ సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో విడుదలైంది. ముందు రోజు ప్రీమియర్స్ కూడా పడ్డాయి. అయితే అప్పటి నుంచే సినిమాపై పాజిటివ్ టాక్.. ఆడియన్స్ లో స్ప్రెడ్ అయింది.

సంక్రాంతి బరిలో చివరగా బరిలోకి దిగినప్పటికీ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. థియేటర్స్ లో ఓ రేంజ్ లో నవ్వులు పంచుతోంది. చాలా చోట్ల విజిల్స్, చప్పట్లతో ప్రేక్షకులు సినిమాను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. తక్కువ థియేటర్లతో విడుదలైనప్పటికీ, మొదటి రోజు నుంచే పాజిటివ్ మౌత్ టాక్ రావడంతో షోలు హౌస్‌ ఫుల్‌ గా నడుస్తున్నాయి.

ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు సినిమాను విపరీతంగా ఆదరిస్తుండటంతో సంక్రాంతి విన్నర్ అంటూ మేకర్స్ ఇప్పటికే పలుమార్లు అనౌన్స్ చేశారు. తాజాగా సంక్రాంతి విన్నర్ బ్లాక్ బస్టర్ మీట్ పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా సినిమా విషయంలో శర్వానంద్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారాయి.

"గుర్తుపెట్టుకోండి.. మళ్లీ చెబుతున్నా.. ఈ సినిమా ఇక్కడితో ఆగేది కాదు.. ఇంకో నాలుగు వారాలు ఆడుతుంది. నా మాట రాసిపెట్టుకోండి. నాలుగు వారాలు కచ్చితంగా ఆడుతుంది. ఇప్పటి నుంచి టాక్ స్టార్ట్ అయింది. థియేటర్స్ పెంచాం. మొన్నటి వరకు థియేటర్స్ కంప్లైంట్ అన్నారు. ఇప్పుడు అది కూడా లేదు. ఈ ఫ్రైడే నుంచి చూడండి.. మేమెంటో చూపిస్తాం" అంటూ సవాల్ విసిరారు.

అయితే ప్రేక్షకుల నుంచి వస్తున్న డిమాండ్‌ దృష్టిలో పెట్టుకుని.. సెకెండ్ వీక్ లో మరిన్ని థియేటర్లలో సినిమా విడుదల చేయాలని మేకర్స్ ఇప్పటికే నిర్ణయించారు. ఇప్పటికే కొన్ని సెంటర్లలో ఎక్స్ ట్రా స్క్రీన్లు పెంచగా, మరికొన్ని ప్రాంతాల్లో కొత్త థియేటర్లలో కూడా షోలు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆ విషయాన్ని శర్వానంద్.. స్పెషల్ ఈవెంట్ లో వెల్లడించారు.

ఇక సినిమా విషయానికొస్తే.. అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించిన నారీ నారీ నడుమ మురారిలో హీరోయిన్లుగా సంయుక్త మేనన్, సాక్షి వైద్య నటించారు. సీనియర్ నటుడు నరేష్ కీలక పాత్ర పోషించారు. సంపత్ రాజ్, వెన్నెల కిషోర్, సత్య తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ముఖ్యంగా మూవీకి ఫ్యామిలీ స్టోరీ, కామెడీ, టైమింగ్, మ్యూజిక్, టెక్నికల్ వాల్యూస్ సహా అన్నీ ప్రధాన బలంగా నిలిచాయి. అదే సమయంలో ఇప్పటికే మూవీ అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుందని మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.