సంక్రాంతికి ఆ సినిమా డౌటేనా..?
2026 పొంగల్ కి చాలా సినిమాలు రిలీజ్ ప్లాన్ చేసుకున్నాయి. స్టార్ సినిమాలతో పాటు మీడియం రేంజ్ హీరోలు, యువ హీరోల సినిమాకు ఈ ఫైట్ కి రెడీ అవుతున్నాయి.
By: Ramesh Boddu | 27 Nov 2025 11:01 AM IST2026 పొంగల్ కి చాలా సినిమాలు రిలీజ్ ప్లాన్ చేసుకున్నాయి. స్టార్ సినిమాలతో పాటు మీడియం రేంజ్ హీరోలు, యువ హీరోల సినిమాకు ఈ ఫైట్ కి రెడీ అవుతున్నాయి. ఆల్రెడీ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ తో పాటు రెబల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్ రిలీజ్ లాక్ చేశారు. ఆ సినిమాతో పాటు మాస్ మహారాజ్ రవితేజ ఫ్యామిలీ ఎంటర్టైనర్ భర్త మహాశయులకు విజ్ఞప్తి కూడా రిలీజ్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాలతో పాటు నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు కూడా రిలీజ్ అవుతుంది.
సామజవరగమన తర్వాత రామ్ అబ్బరాజు
ఐతే ఇదే లైన్ లో శర్వానంద్ నారి నారి నడుమ మురారి సినిమా రిలీజ్ కూడా సంక్రాంతికే అనౌన్స్ చేశారు. ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అనీల్ సుంకర ఈ సినిమా నిర్మిస్తున్నారు. సామజవరగమన తర్వాత రామ్ అబ్బరాజు ఈ మూవీ డైరెక్ట్ చేశారు. ఐతే ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టు పోస్టర్స్ వదిలారు. కానీ చూస్తుంటే ఇది సంక్రాంతి రేసు నుంచి తప్పుకునేలా ఉంది. ఎందుకంటే పొంగల్ ఫైట్ ఈసారి భారీగా ఉండబోతుంది.
అంతేకాదు శర్వానంద్ బైకర్ సినిమా డిసెంబర్ 6న రిలీజ్ అవుతుంది. ఆ సినిమా రిలీజైన నెల 15 రోజుల్లో మరో సినిమా అంటే రెండు వెంట వెంట నెలల్లో రెండు సినిమాలు రిలీజ్ ఎందుకనే భావనతో కూడా నారి నారి నడుమ మురారి సినిమాను వాయిదా వేసే ప్లాన్ లో ఉన్నారట. ఈ సినిమా జనవరి మిస్సైతే సమ్మర్ కి షిఫ్ట్ అవుతుందని టాక్. రామ్ అబ్బరాజు సామజవరగమన స్టైల్ లోనే నారి నారి నడుమ మురారి సినిమా తెరకెక్కించారని తెలుస్తుంది.
శర్వానంద్ చివరగా మనమే సినిమాతో..
ఈ సినిమాలో శర్వానంద్ సరసన సాక్షి వైద్య, సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శర్వానంద్ చివరగా మనమే సినిమాతో వచ్చాడు. ఆ సినిమా రిజల్ట్ కూడా డిజప్పాయింట్ చేసింది. ఐతే బైకర్ తో మాత్రం కచ్చితంగా సక్సెస్ టార్గెట్ పెట్టుకున్నాడు శర్వానంద్. ఇండియన్ స్క్రీన్ మీద బైక్ రేస్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాలు చాలా తక్కువ. అందుకే ఈ సినిమా ఎక్స్ పీరియన్స్ కచ్చితంగా ఆడియన్స్ ని థ్రిల్ అయ్యేలా చేస్తుందని అంటున్నారు.
సో బైకర్ ఒక క్రేజీ అటెంప్ట్ కాగా శర్వానంద్ ఎంటర్టైనర్ యాంగిల్ లో నారి నారి నడుమ మురారి చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలతో ఎలాగైనా హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు శర్వానంద్.తెలుగు ఆడియన్స్ కి ఒక డిఫరెంట్ సినిమాలు అందిచాలని చూస్తున్న శర్వానంద్ కెరీర్ లో సక్సెస్ ల కన్నా ఫెయిల్యూర్స్ ఎక్కువ ఫేస్ చేశాడు. ఐతే మనమే తర్వాత ఈసారి గట్టి ఎఫర్ట్స్ తో బైకర్, నారి నారి నడుమ మురారి సినిమాలు చేస్తున్నాడు. బైకర్ ఒక ఎక్స్ పెరిమెంట్ మూవీగా వస్తుంది. ఐతే ఈ సినిమాలో ఎమోషన్స్ అదిరిపోతాయని టాక్.
