Begin typing your search above and press return to search.

శర్వా కొత్త లగ్జరీ కారు.. సెలబ్రిటీలంతా అదే ఎందుకు?

సినిమా సెలబ్రిటీల లైఫ్ స్టైల్ ఎప్పుడూ స్పెషల్ గానే ఉంటుంది. ముఖ్యంగా అందరినీ అట్రాక్ట్ చేస్తుంటుంది. వారంతా ఎక్కువగా కాస్ట్లీ, ప్రీమియర్, లగ్జరీ కార్లలో తిరిగేందుకు ఇష్టపడుతుంటారు.

By:  M Prashanth   |   11 Dec 2025 11:47 AM IST
శర్వా కొత్త లగ్జరీ కారు.. సెలబ్రిటీలంతా అదే ఎందుకు?
X

సినిమా సెలబ్రిటీల లైఫ్ స్టైల్ ఎప్పుడూ స్పెషల్ గానే ఉంటుంది. ముఖ్యంగా అందరినీ అట్రాక్ట్ చేస్తుంటుంది. వారంతా ఎక్కువగా కాస్ట్లీ, ప్రీమియర్, లగ్జరీ కార్లలో తిరిగేందుకు ఇష్టపడుతుంటారు. ఆ వెహికల్స్ ను కేవలం తిరగడానికి మాత్రమే కాకుండా.. తమ బ్రాండ్ కు దగ్గరగా ఉండాలని చూసుకుంటారని చెప్పాలి.

అయితే మార్కెట్ లో ఏ కొత్త కారు మోడల్ వచ్చినా సెలబ్రిటీలు దానిని పరిశీలించి నచ్చితే.. వెంటనే తమ గ్యారేజీలోకి తీసుకుంటూ ఉంటారు. చాలామంది సెలబ్రిటీలు అలాగే చేస్తుంటారు. ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరో, ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ కూడా అదే చేశారు. లేటెస్ట్ ట్రెండింగ్ కారును తన కలెక్షన్ లోకి చేర్చుకున్నారు.

ఆ కారు ఏంటంటే.. లెక్సెస్ LM 350H ప్రీమియం MPV.. కొన్ని రోజుల క్రితం మార్కెట్ లోకి వచ్చిన ఆ కారు ధర రూ.2 కోట్లకు పైగానే ఉంటుంది. కొంతకాలంగా ఆ కారును అనేక మంది సెలబ్రిటీలు కొనుగోలు చేస్తున్నారు. కొత్త కారును కొనుగోలు చేయాలనుకునే సెలబ్రిటీలంతా దాని వైపు మొగ్గు చూపిస్తున్నట్లు కనిపిస్తున్నారు.

ఇప్పుడు శర్వానంద్ కూడా కొనుగోలు చేసేశారు. అయితే ఛార్మింగ్ స్టార్ కొన్న కారును టాలీవుడ్ లో ఇప్పటికే కింగ్ నాగార్జున తన గ్యారేజీలో చేర్చుకున్నారు. అంతకుముందు రామ్ చరణ్ కూడా లెక్సెస్ సెగ్మెంట్ కారును కొనుగోలు చేశారు. సౌత్ లో మాలీవుడ్ స్టార్ నటుడు ఫాహద్ ఫాజిల్ వద్ద ఆ కారు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక బాలీవుడ్ లో షారుక్ ఖాన్, రణబీర్ కపూర్, జాన్వీ కపూర్.. లెక్సెస్ LM 350H ప్రీమియం MPVను కొనుగోలు చేశారని తెలుస్తోంది. అయితే సెలబ్రిటీలంతా అదే కారును సెలెక్ట్ చేసుకోవడానికి కారణం.. సేఫ్టీ, ఫీచర్లు, కంఫర్ట్ సమపాళ్లలో ఉండడమే. అధునాతన సౌకర్యాలతో అల్ట్రా లగ్జరీ వెర్షన్ గా కారు రూపొదిద్దుకుందనే చెప్పాలి.

2.5-లీటర్ 4-సిలిండర్ పెట్రోల్ హైబ్రిడ్ ఇంజిన్ ద్వారా నడిచే లెక్సెస్ కారు.. 0-100 kmph వేగాన్ని కేవలం 8.7 సెకన్లలో అందుకోగలగడం విశేషం. గరిష్ట వేగం 190 kmphతో వెళ్ళగలదు. ముఖ్యంగా ఆ కారులో.. ట్రావెల్ చేస్తే.. ఒక ఫస్ట్- క్లాస్ విమాన అనుభవాన్ని అందిస్తుందట. ఎందుకంటే ఫీచర్స్ అలా ఉన్నాయి మరి.

48- అంగుళాల టీవీ, ఎయిర్‌లైన్- శైలి రిక్లైనర్ సీట్లు, 23 స్పీకర్ ప్రీమియం సౌండ్ సిస్టమ్, ఫోల్డ్ అవుట్ టేబుల్స్, హీటెడ్ ఆర్మ్‌ రెస్ట్‌లు, చిన్న ఫ్రిజ్, రియర్ గ్లోవ్ బాక్స్‌ లు, డిజిటల్ రియర్ వ్యూ మిర్రర్ సహా అనేక ఫీచర్లు కారులో ఉన్నాయి. అవన్నీ అత్యధిక సౌకర్యాన్ని అందిస్తాయి. అందుకే ప్రీమియం లగ్జరీ, కంఫర్ట్, ప్రైవసీతో కంప్లీట్ ప్యాకేజీగా ఉన్న లెక్సెస్ కారును సెలబ్రిటీ తెగ కొనుగోలు చేస్తున్నారేమో!