శర్వా సినిమాకు ఆ సమస్య
సినీ ఇండస్ట్రీలో ఒక్కో సినిమాకీ ఒక్కో సమస్య ఉంటుంది. కొన్ని సినిమాలకు సెట్స్ పైకి వెళ్లడం సమస్య అయితే, మరికొన్ని షూటింగ్ పూర్తి చేసుకోవడం సమస్య అవుతుంది.
By: Sravani Lakshmi Srungarapu | 29 July 2025 7:00 AM ISTసినీ ఇండస్ట్రీలో ఒక్కో సినిమాకీ ఒక్కో సమస్య ఉంటుంది. కొన్ని సినిమాలకు సెట్స్ పైకి వెళ్లడం సమస్య అయితే, మరికొన్ని షూటింగ్ పూర్తి చేసుకోవడం సమస్య అవుతుంది. ఇంకొన్ని సినిమాలకు క్యాస్టింగ్ ప్రాబ్లమ్ అయితే, మరికొన్ని సినిమాలకు బడ్జెట్, బిజినెస్ సమస్యలవుతూ ఉంటాయి. ఇప్పుడు బిజినెస్ వల్ల టాలీవుడ్ లో ఓ సినిమా ఆలస్యమవుతుంది.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా చేసుకుంటున్న నారీ నారీ నడుమ మురారి సినిమా రిలీజ్ కు ముందే సంచలనం సృష్టిస్తోంది. శర్వానంద్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తైనా ఇంకా రిలీజ్ డేట్ ను మాత్రం లాక్ చేసుకోలేదు. దానికి కారణం ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ డీల్ ఇంకా పూర్తవక పోవడమే అని తెలుస్తోంది.
ఎంతో కీలకం
నారీ నారీ నడుమ మురారీ సినిమాకు సంబంధించిన ఓటీటీ ఒప్పందాన్ని నిర్మాతలు ఇంకా క్లోజ్ చేయలేదట. అందుకే సినిమా రిలీజ్ ఎప్పుడనేది క్లారిటీ లేదని తెలుస్తోంది. సినిమా బిజినెస్ విషయంలో ఈ ఓటీటీ డీల్ అనేది ఎంతో కీలకం. అలాంటి ఈ డీల్ క్లోజ్ అవకపోవడం వల్లే నారీ నారీ నడుమ మురారి సినిమా రిలీజ్ కు నోచుకోవడం లేదని సమాచారం.
అప్పుడే అనౌన్స్‌మెంట్
సామజవరగమన సినిమాతో బ్లాక్ బస్టర్ ను అందుకున్న రామ్ అబ్బరాజు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రై. లి.తో కలిసి ఏకె ఎంటర్టైన్‌మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తుండగా, నారీ నారీ నడుమ మురారి సినిమాలో శర్వానంద్ చాలా కొత్త పాత్రలో కనిపించనున్నారు. ఓటీటీ డీల్ క్లోజ్ అయ్యాక మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి అనౌన్స్ చేస్తారని తెలుస్తోంది.
