శర్వా గ్లింప్స్: ఇంత కాంపిటీషన్ లో కూడా నీ ఎంట్రీ అవసరమా?
ఇప్పుడు 'నారీ నారీ నడుమ మురారి' సినిమాతో మరోసారి అదే మ్యాజిక్ చేయడానికి రెడీ అయ్యాడు. లేటెస్ట్ గా రిలీజ్ అయిన గ్లింప్స్ వీడియో చూస్తుంటే, ఈసారి శర్వానంద్ ఫుల్ ఫన్ మోడ్ లో ఉన్నట్లు క్లియర్ గా అర్థమవుతోంది.
By: M Prashanth | 20 Dec 2025 1:17 PM ISTసంక్రాంతి రేసులో ఎంతమంది పెద్ద హీరోలు ఉన్నా, శర్వానంద్ మాత్రం తనదైన మార్క్ తో సైలెంట్ గా వచ్చి హిట్టు కొట్టడం అలవాటు. ఇప్పుడు 'నారీ నారీ నడుమ మురారి' సినిమాతో మరోసారి అదే మ్యాజిక్ చేయడానికి రెడీ అయ్యాడు. లేటెస్ట్ గా రిలీజ్ అయిన గ్లింప్స్ వీడియో చూస్తుంటే, ఈసారి శర్వానంద్ ఫుల్ ఫన్ మోడ్ లో ఉన్నట్లు క్లియర్ గా అర్థమవుతోంది. కేవలం అనౌన్స్ మెంట్ లా కాకుండా, ఒక చిన్న స్కిట్ లాగా దీన్ని కట్ చేయడం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది.
వీడియోలో వెన్నెల కిషోర్ ఒక లాయర్ లా సీరియస్ గా కనిపిస్తుండగా, శర్వానంద్ చాలా కూల్ గా ఎంట్రీ ఇస్తాడు. అప్పుడు కిషోర్ వేసిన పంచ్ డైలాగ్ ఇప్పుడు వైరల్ అవుతోంది. "వచ్చావా.. ఇంత కాంపిటీషన్ లో కూడా నీ ఎంట్రీ అవసరమా?" అని అడగడం చూస్తుంటే, ఇది సినిమాలో డైలాగ్ లా కాకుండా రియల్ లైఫ్ లో సంక్రాంతి పోటీ గురించి వేసిన సెటైర్ లా అనిపిస్తోంది.
దానికి శర్వానంద్ ఇచ్చిన రిప్లై ఇంకా అదిరిపోయింది. "ప్రతి పండక్కి పని అయింది కదా సార్.. ఈ పండగ కూడా కొడదాం అని" అంటూ చాలా క్యాజువల్ గా చెప్పిన డైలాగ్ లో ఫుల్ కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. గతంలో శతమానంభవతి, ఎక్స్ ప్రెస్ రాజా సినిమాలతో సంక్రాంతికి హిట్లు కొట్టిన సెంటిమెంట్ ను గుర్తు చేస్తూ, మేకర్స్ చాలా తెలివిగా ఈ డైలాగ్స్ రాశారు. ఆడియెన్స్ మనసులో ఉన్న మాటే వెన్నెల కిషోర్ చేత పలికించారు.
దర్శకుడు రామ్ అబ్బరాజుకు కామెడీ మీద మంచి పట్టు ఉంది. 'సామజవరగమన' సినిమాలో లాగే ఇందులో కూడా క్లీన్ కామెడీ ఉంటుందని ఈ చిన్న బిట్ చూస్తే అర్థమవుతోంది. శర్వానంద్, వెన్నెల కిషోర్ కాంబినేషన్ అంటేనే నవ్వుల గ్యారెంటీ. వీరిద్దరి టైమింగ్ ఈ గ్లింప్స్ లోనే ఇంత బాగుంటే, ఇక సినిమాలో ఏ రేంజ్ లో ఉంటుందో అనిపిస్తోంది.
ఈ వీడియోలో మరో ఆసక్తికరమైన విషయం రిలీజ్ టైమింగ్. సినిమాను జనవరి 14న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటిస్తూనే, సాయంత్రం 5 గంటల 49 నిమిషాలకు షోస్ పడతాయని చాలా స్పెసిఫిక్ గా చెప్పడం వెరైటీగా ఉంది. బహుశా ప్రీమియర్స్ ప్లానింగ్ లేదా సెంటిమెంట్ టైమింగ్ అయ్యి ఉండొచ్చు. డిసెంబర్ 22న టీజర్ కూడా రాబోతోందని క్లారిటీ ఇచ్చారు.
"వీడు మారడు" అని వెన్నెల కిషోర్ అన్నట్లుగా, శర్వానంద్ ఈసారి కూడా పండగ రేసులో వెనక్కి తగ్గేలా లేడు. భారీ సినిమాల మధ్యలో వచ్చినా కంటెంట్ ఉంటే ఆడియెన్స్ ఆదరిస్తారని నమ్ముతున్నాడు. ఈ ఫన్నీ గ్లింప్స్ తో సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేయడంలో టీమ్ సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. ఇక సినిమా ఏ రేంజ్ లో క్లిక్కవుతుందో చూడాలి.
