Begin typing your search above and press return to search.

ఫ్యామిలీ కోసం మారాను.. ఆ రూమర్స్‌కు శర్వా క్లాస్ చెక్!

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో, ఫిల్మ్ సర్కిల్స్‌లో ఒక న్యూస్ తెగ చక్కర్లు కొట్టింది. అదే, హీరో శర్వానంద్, ఆయన భార్య రక్షితా రెడ్డి విడాకులు తీసుకోబోతున్నారనేది ఆ వార్త గట్టిగానే ట్రెండ్ అయ్యింది.

By:  M Prashanth   |   12 Nov 2025 6:00 PM IST
ఫ్యామిలీ కోసం మారాను.. ఆ రూమర్స్‌కు శర్వా క్లాస్ చెక్!
X

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో, ఫిల్మ్ సర్కిల్స్‌లో ఒక న్యూస్ తెగ చక్కర్లు కొట్టింది. అదే, హీరో శర్వానంద్, ఆయన భార్య రక్షితా రెడ్డి విడాకులు తీసుకోబోతున్నారనేది ఆ వార్త గట్టిగానే ట్రెండ్ అయ్యింది. ఈ ప్రచారం చాలా వేగంగా స్ప్రెడ్ అవ్వడంతో, ఫ్యాన్స్‌తో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా కన్‌ఫ్యూజ్ అయ్యాయి. దీనిపై శర్వానంద్ టీమ్ నుంచి ఎలాంటి అఫీషియల్ రెస్పాన్స్ రాకపోవడంతో, ఈ రూమర్స్‌కు మరింత బలం చేకూరినట్టు అయింది.

అయితే, ఈ గాసిప్స్‌కు శర్వానంద్ డైరెక్ట్‌గా కాకపోయినా, ఇన్ డైరెక్ట్‌గా, చాలా క్లాస్‌గా చెక్ పెట్టేశాడు. ప్రస్తుతం శర్వానంద్ తన కొత్త సినిమా 'బైకర్' ప్రమోషన్లలో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఒక రీసెంట్ ఇంటర్వ్యూలో, ఆయన తన పర్సనల్ లైఫ్, హెల్త్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు. ఈ మాటలతోనే విడాకుల వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టేశాడు.

హోస్ట్.. శర్వానంద్‌ను ఆయన హెల్త్, ఫిట్‌నెస్ గురించి అడిగారు. దానికి శర్వా ఇచ్చిన సమాధానమే ఇప్పుడు హైలైట్. "నిజం చెప్పాలంటే, నేను తండ్రి అయ్యాకే నా ఆరోగ్యంపై పూర్తి దృష్టి పెట్టాను. అంతకుముందు వర్కౌట్స్ పెద్దగా చేసేవాడిని కాదు, కొంచెం లైట్ తీసుకునేవాడిని. కానీ, ఇప్పుడు నా కుటుంబం కోసం నేను ఆరోగ్యంగా, స్ట్రాంగ్‌గా ఉండాలని ఫిక్స్ అయ్యాను" అని శర్వానంద్ పేర్కొన్నారు.

శర్వా చెప్పింది సింపుల్ స్టేట్‌మెంటే అయినా, ఇది చాలా పవర్‌ఫుల్. నా కుటుంబం కోసం అని చెప్పడం ద్వారా.. తన వైవాహిక జీవితం చాలా హ్యాపీగా, బలంగా ఉందని, బయట వస్తున్న విడాకుల రూమర్లలో ఎలాంటి నిజం లేదని ఇన్ డైరెక్ట్‌గా, చాలా క్లాస్‌గా చెప్పేశాడు. ఇదే ఇంటర్వ్యూలో తన హెల్త్ జర్నీ గురించి కూడా శర్వా మాట్లాడాడు. 2019లో తనకు యాక్సిడెంట్ అయిన తర్వాత, పెద్దగా వర్కవుట్లు చేయకపోవడం వల్ల తన బరువు ఏకంగా 92 కేజీలకు పెరిగిపోయాడని చెప్పాడు.

ఆ తర్వాత చాలా కష్టపడి, ఇప్పుడు ఏకంగా 22 కేజీలు తగ్గి, 'బైకర్' కోసం ఫిట్‌గా మారానని.. ఈ డెడికేషన్ అంతా "నా ఫ్యామిలీ కోసమే" అని చెప్పడం ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. మొత్తానికి, శర్వానంద్ ఈ ఒక్క స్టేట్‌మెంట్‌తో.. తనపై వస్తున్న నెగటివ్ ప్రచారానికి చాలా పాజిటివ్‌గా సమాధానం ఇచ్చాడు. ఇక శర్వా కొత్త ఎనర్జీతో వస్తున్న 'బైకర్' సినిమా డిసెంబర్ 6న రిలీజ్‌కు రెడీ అవుతోంది.