శర్వానంద్ కొత్త లుక్.. OMI బ్రాండ్‌తో ట్రెండ్ సెట్ చేస్తున్న స్టార్
ఈ ఫోటోల ద్వారా శర్వానంద్ చెప్పాలనుకున్న మెసేజ్ చాలా స్పష్టంగా ఉంది. తన కొత్త జర్నీ కేవలం సినిమాలకే పరిమితం కాదు, జీవనశైలి, వెల్‌నెస్, నేచురల్ లివింగ్ వైపు కూడా అడుగులు వేస్తున్నారని అర్ధమవుతుంది.
By: M Prashanth | 19 Sept 2025 8:11 PM ISTటాలీవుడ్‌లో సైలెంట్‌గా, తనదైన స్టైల్‌తో ముందుకు వెళ్లే హీరోల్లో శర్వానంద్ ఒకరు. సినిమాల్లో తన డిఫరెంట్ యాక్టింగ్ తో ఆకట్టుకునే పేరొందిన ఆయన, ఇప్పుడు ఓఎంఐ అనే కొత్త బ్రాండ్‌తో బిజినెస్ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. తాజాగా విడుదలైన ఫోటోషూట్‌లో ఆయన కొత్త లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్లాసీ అవుట్‌ఫిట్‌తో ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంటున్నారు.
ఈ ఫోటోల ద్వారా శర్వానంద్ చెప్పాలనుకున్న మెసేజ్ చాలా స్పష్టంగా ఉంది. తన కొత్త జర్నీ కేవలం సినిమాలకే పరిమితం కాదు, జీవనశైలి, వెల్‌నెస్, నేచురల్ లివింగ్ వైపు కూడా అడుగులు వేస్తున్నారని అర్ధమవుతుంది. OMI బ్రాండ్ వెనుక ఉన్న కాన్సెప్ట్ చాలా ఇన్స్పైరింగ్‌గా ఉంది. "ఓఎం" అంటే విశ్వ నాదం, "ఐ" అంటే వ్యక్తిత్వం. ఈ రెండు కలయికతో ఓఎంఐ అనేది విశ్వం, మనిషి మధ్య ఉన్న సమతుల్యాన్ని సూచిస్తోంది.
ఇది కేవలం పేరు మాత్రమే కాదు, ఒక విజన్ అని శర్వానంద్ ఇదివరకే చెప్పారు. ఈ బ్రాండ్ కింద సినిమాలు మాత్రమే కాకుండా వెల్‌నెస్ ప్రోడక్ట్స్, హాస్పిటాలిటీ సర్వీసులు కూడా ఉండనున్నాయి. క్రియేటివిటీ, హెల్త్, సస్టైనబిలిటీ, నేచురల్ లివింగ్.. ఇవన్నీ ఒకే వేదికపైకి తీసుకురావడమే ఓఎంఐ లక్ష్యం. ఫోటోషూట్‌లో కనిపించిన శర్వానంద్ కొత్త లుక్ ఫ్యాన్స్‌ని మరోసారి ఆశ్చర్యపరిచింది.
తెలుపు కలర్ అవుట్‌ఫిట్‌లో ఆయన లుక్ చాలా క్లాసీగా, రాయల్టీని సూచించేలా ఉంది. సింప్లిసిటీ లుక్ యంగ్‌స్టర్స్‌కి నచ్చేలా ఉంది. ప్రత్యేకంగా ఓఎంఐ లోగో ప్రతి ఫోటోలో ఉండడం, బ్రాండ్‌ను హైలైట్ చేస్తూ కనిపించడం ఒక స్ట్రాటజీగా చెప్పొచ్చు. శర్వానంద్ తన బ్రాండ్ ప్రమోషన్‌కి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో దీని ద్వారా స్పష్టమవుతోంది..
సినిమాలతో పాటు ఇలా ఓఎంఐ లాంటి బ్రాండ్‌ను లాంచ్ చేయడం ద్వారా శర్వానంద్ తనకంటూ వేరే స్థానం ఏర్పరచుకున్నారు. ఇప్పటికే ఆయన నటిస్తున్న నరి నరి నడుమ మురారి సినిమా, అలాగే సంపత్ నంది దర్శకత్వంలో మరో సినిమా కూడా సెట్స్ మీద ఉన్నాయి. ఆ సినిమాలు, ఈ కొత్త బ్రాండ్ లాంచ్ అన్నీ కలిపి శర్వానంద్ కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్తున్నాయి. మొత్తానికి, శర్వానంద్ ఇప్పుడు సినిమాల హీరోగానే కాకుండా లైఫ్‌స్టైల్ ఐకాన్‌గా కూడా మారుతున్నారని చెప్పొచ్చు.
