ఏదీ శాశ్వతం కాదు..
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ హీరోల్లో శర్వానంద్ ఒకరు. శర్వానంద్ తన కెరియర్ లో ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేశాడు.
By: Madhu Reddy | 15 Nov 2025 8:24 PM ISTతెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ హీరోల్లో శర్వానంద్ ఒకరు. శర్వానంద్ తన కెరియర్ లో ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేశాడు. గమ్యం, ప్రస్థానం వంటి సినిమాలు శర్వాకు విపరీతమైన పేరు తీసుకొచ్చాయి. అయితే తన సినిమాల్లో హిట్స్ కంటే కూడా ఎక్కువ ఫ్లాప్ సినిమాలు ఉన్నాయి. అలా కథలు ఎంచుకునే విషయంలో కొద్దిగా వెనకబడి ఉన్నాడు అనే కామెంట్స్ వినిపిస్తూనే ఉంటాయి.
ఏదేమైనా శర్వానంద్ సినిమాలు ఫెయిల్ అయినా కూడా యాక్టర్ గా మాత్రం ఎప్పుడు ఫెయిల్ కాలేదు. తన ఎఫర్ట్స్ ప్రతి సినిమాలో పెడుతూనే ఉంటాడు. ఒకే ఒక జీవితం సినిమా తర్వాత శర్వా కెరియర్ లో ఇప్పటివరకు చెప్పుకునే హిట్ సినిమా పడలేదు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన మనమే సినిమా ఊహించిన సక్సెస్ ను కూడా సాధించలేకపోయింది.
ఏది శాశ్వతం కాదు
ప్రస్తుతం శర్వానంద్ అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో బైకర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి విపరీతంగా కష్టపడ్డాడు. శర్వా ఏకంగా 12 కేజీల బరువు కూడా తగ్గాడు. ఇదంతా కేవలం నాలుగు నెలల్లోనే జరిగిపోయింది. దీనిని బట్టి చూస్తే సినిమా అంటే శర్వాకు ఎంత డెడికేషన్ ఉందో అర్థమవుతుంది.
ఇక రీసెంట్గా ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న తరుణంలో ఒక కాలేజ్ ఈవెంట్ కు ప్రమోషన్స్ లో భాగంగా హాజరయ్యాడు. ఆ కాలేజ్ ఈవెంట్లో ఎన్నో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. "లైఫ్ అంటే కేవలం స్టడీ , డిగ్రీ, మనీ మాత్రమే కాదు.. కొంచెం అనుభూతులు కూడా ఇస్తుంది. అన్నింటిలో యాక్టివ్ గా ఉండండి.. సక్సెస్ మీకు ఆటోమేటిక్ గా వస్తుంది. ఫెయిల్యూర్స్ గురించి ఎక్కువ చింతించకండి. వాటి నుంచి నేర్చుకోండి. ఎప్పుడు డిప్రెషన్ లోకి వెళ్ళకండి.. ఏదీ శాశ్వతం కాదు" అని చెప్పాడు శర్వానంద్.
పర్ఫెక్ట్ మోటివేషన్
"నేను కూడా చాలాసార్లు ఫెయిల్యూర్స్ చూశాను. అలానే చాలామంది నన్ను మోసం కూడా చేశారు. కానీ నేనెప్పుడూ జీవితం మీద హోప్స్ వదులుకోలేదు. నా నిజజీవితంలో మళ్లీ కం బ్యాక్ ఇచ్చాను. ఎప్పుడు కూడా గివ్ అప్ ఇవ్వద్దు" అంటూ మోటివేట్ చేశాడు శర్వానంద్.
శర్వానంద్ ఇటువంటి విషయాలు చాలా బాగా చెబుతాడు అందుకే చాలామంది శర్వానంద్ ను ఇష్టపడతారు. గతంలో సుధీర్ వర్మ డైరెక్షన్లో వచ్చిన రణరంగం సినిమా ఈవెంట్లో ఒక వ్యక్తి కాళ్లు మొక్కడానికి వచ్చినప్పుడు కూడా మీ తల్లిదండ్రులు కాళ్లు మొక్కండి అంటూ చెప్పాడు. ఇటువంటి మాటలు చెబుతున్నప్పుడు శర్వా మీద రెస్పెక్ట్ ఆటోమేటిక్ గా పెరుగుతుంది.
ఇక బైకర్ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. తెలుగు సినిమాలో ఈ టైప్ ఆఫ్ సినిమా రావడం అనేది ఇదే మొదటిసారి. ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకుంటాడేమో చూడాలి.
