Begin typing your search above and press return to search.

శర్వానంద్.. ఆ రెండూ క్లిక్ అయితే సెట్టు!

ఇప్పటికే వివిధ సినిమాల్లో నటించి ఆడియన్స్ ను మెప్పించారు. బాక్సాఫీస్ వద్ద పలు చిత్రాలతో మంచి హిట్స్ అందుకుని సత్తా కూడా చాటారు.

By:  M Prashanth   |   21 Oct 2025 11:23 AM IST
శర్వానంద్.. ఆ రెండూ క్లిక్ అయితే సెట్టు!
X

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ గురించి అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆయన.. ఫ్యామిలీ హీరోగా ఫేమ్ సొంతం చేసుకున్నారు. ఇప్పటికే వివిధ సినిమాల్లో నటించి ఆడియన్స్ ను మెప్పించారు. బాక్సాఫీస్ వద్ద పలు చిత్రాలతో మంచి హిట్స్ అందుకుని సత్తా కూడా చాటారు.

కానీ కొంత కాలంగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. విభిన్నమైన కథలు ఎంచుకుంటున్నా శర్వానంద్ కు కెరీర్ పరంగా మాత్రం కలిసి రావడం లేదు. అయితే ఇప్పుడు గట్టి కమ్ బ్యాక్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు శర్వా. తన అప్ కమింగ్ చిత్రాలతో హిట్స్ అందుకోవాలని చూస్తున్నారు. అవే బైకర్, నారీ నారీ నడుమ మురారి.

నారీ నారీ నడుమ మురారి మూవీతో వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు శర్వానంద్. సామజవరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను.. ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. శర్వా సరసన సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటిస్తున్నారు.

కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రానున్న ఆ మూవీతో హిట్ అందుకోవాలని పట్టుదలతో శర్వానంద్ ఉన్నారు. ఇప్పటికే సంక్రాంతి సీజన్ లో గతంలో శతమానం భవతి మూవీతో సూపర్ హిట్ సొంతం చేసుకున్నారు. వచ్చే ఏడాది కాంపిటీషన్ గట్టిగా ఉన్నా కూడా ఆ సీన్ ను నారీ నారీ నడుమ మురారి సినిమాతో రిపీట్ చేయాలని చూస్తున్నారు.

అదే సమయంలో బైకర్ మూవీ షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుగుతోంది. యూత్ ఫుల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఆ సినిమాకు అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ పై వంశీ ప్రమోద్ నిర్మిస్తున్న ఆ మూవీలో మాళవిక నాయర్ హీరోయిన్‌ గా నటిస్తున్నారు. శర్వానంద్ నెవ్వర్ బిఫోర్ అనేలా కనిపించనున్నారు. బైక్ రేసర్ గా సందడి చేయనున్నారు.

ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ ద్వారా అందరికీ క్లారిటీ వచ్చేసింది. ముఖ్యంగా బైకర్ మూవీ కోసం యూత్‌కు కనెక్ట్ అయ్యే జానర్‌ ను శర్వా ఎంచుకున్నట్లు కనిపిస్తున్నారు. ఏదేమైనా వరుసగా వచ్చే ఏడాది రెండు సినిమాలతో హిట్స్ అందుకుంటే.. మళ్లీ ఆయన కెరీర్ గాడిలో పడుతుందని చెప్పాలి. మార్కెట్ తో పాటు అన్నీ సెట్ అయిపోతాయి. మరేం జరుగుతుందో వేచి చూడాలి.