Begin typing your search above and press return to search.

ఏడాదిలో నాలుగు... శర్వా రికార్డ్‌ అయ్యేనా?

2026లో ఇప్పటికే ‘నారి నారి నడుమ మురారి’, ‘బైకర్’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శర్వానంద్.. డిసెంబర్‌లో ‘భోగి’తో రావాలని చూస్తున్నారు. ఇక 2027 జనవరి 14న ‘జార్జ్ క్రిష్’ విడుదల కానుంది. ఈ రెండు సినిమాలు అనుకున్న సమయానికి వస్తే ఏడాది వ్యవధిలో శర్వానంద్ నుంచి నాలుగు సినిమాలు విడుదలైనట్లవుతుంది.

By:  Ramesh Palla   |   14 Nov 2026 9:57 PM IST
ఏడాదిలో నాలుగు... శర్వా రికార్డ్‌ అయ్యేనా?
X

ఒకప్పుడు హీరోలు ఏడాదిలో పది సినిమాలు అంతకు మించి సినిమాలు చేశారు. కానీ ఇప్పుడు హీరోలు ఏడాదికి కనీసం ఒక్క సినిమాను సైతం విడుదల చేయలేక పోతున్నారు. స్టార్‌ హీరోలు రెండు ఏళ్లకు ఒక సినిమా అన్నట్లుగా విడుదల చేస్తున్నారు. ఏడాదికి రెండు సినిమాలు చేయాలని ప్రతి హీరో అనుకుంటున్నాడు, కానీ పరిస్థితులు అనుకూలించడం లేదు. ప్రభాస్ ఆ మధ్య పలు సార్లు ఏడాదిలో రెండు సినిమాలతో రావాలని ఎక్కువ సినిమాలు ఒప్పుకుంటున్నాను. కానీ మేకింగ్‌ విషయంలో ఆలస్యం కావడం వల్ల ఏడాదికి ఒకటి కూడా విడుదల చేయలేని పరిస్థితి నెలకొంది. అయితే ఈ ఏడాది తమిళ్‌ హీరో సూర్య ఏకంగా మూడు సినిమాలు విడుదల చేసి, ఆ మూడు సినిమాలతో సూపర్‌ హిట్‌ దక్కించుకుని, ఒక్క క్యాలెండర్‌ ఇయర్‌ లో ఏకంగా రూ.1000 కోట్లకు మించి వసూళ్లు రాబట్టిన హీరోగా రికార్డ్‌ నెలకొల్పాడు. హిట్‌ రికార్డ్‌ ఏమో కానీ శర్వా ముందు కూడా ఒక అరుదైన రికార్డ్‌ ఉంది.

శర్వానంద్‌ హీరోగా భోగి...

ఒక ఏడాది కాలంలో ఏకంగా నాలుగు సినిమాలను విడుదల చేసిన ఘనత శర్వానంద్ దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2026లో ఇప్పటికే నారి నారి నడుమ మురారి సినిమాతో పాటు బైకర్‌ సినిమాతో వచ్చాడు. ఈ రెండు సినిమాలు కాకుండా ఇదే ఏడాదిలో 'భోగి' సినిమాతో శర్వానంద్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీపావళి కానుకగా సినిమాను విడుదల చేయాలని భావించినప్పటికీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. వాయిదా పడ్డ సినిమాను మరీ ఆలస్యం చేయకుండా డిసెంబర్ లో కచ్చితంగా విడుదల చేస్తామని మేకర్స్ చెబుతున్నారు. క్రిస్మస్ కంటే ముందుగానే భోగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. శర్వానంద్‌ భోగి సినిమాపై పాజిటివ్ బజ్‌ క్రియేట్‌ అయింది. సినిమా నుంచి వచ్చిన పాటలు, పోస్టర్స్ అంచనాలు పెంచాయి. కనుక మళ్లీ భోగి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు.

జార్జ్‌ క్రిష్‌ సినిమాలో శర్వానంద్‌..

డిసెంబర్‌ లో భోగి సినిమా వస్తే నెల రోజుల గ్యాప్‌ లోనే సంక్రాంతి కానుకగా 'జార్జ్‌ క్రిష్‌' విడుదల కాబోతుంది. నారి నారి నడుమ మురారి సినిమా 2026 జనవరి 14న విడుదల కాగా, సరిగ్గా ఏడాదికి అంటే 2027 జనవరి 14న జార్జ్ క్రిష్ విడుదల కాబోతుంది. అంటే ఏడాది కాలంలో శర్వానంద్‌ నుంచి ఏకంగా నాలుగు సినిమాలు విడుదల అయినట్లు అవుతుంది. ప్రస్తుతం ఉన్న యంగ్‌ హీరోల్లో చాలా తక్కువ మంది మాత్రమే ఏడాదికి రెండు మూడు సినిమాలు చేస్తున్నారు. అలాంటిది శర్వానంద్‌ ఏకంగా ఏడాది కాలంలో నాలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడం అనేది కచ్చితంగా రికార్డ్‌ అనడంలో సందేహం లేదు. రెండు సినిమాల ఫలితాలు నిరుత్సాహ పరిచాయి, అయితే రాబోయే రెండు సినిమాలు హిట్ అయితే కచ్చితంగా ఆయన సాధించిన ఈ రికార్డ్‌ మరింత స్పెషల్‌గా మారే అవకాశం ఉందని ఆయన అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సంక్రాంతి కానుకగా శర్వానంద్‌ మూవీ...

జార్జ్‌ క్రిష్‌ సినిమాను శ్రీను వైట్ల తనదైన మార్క్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నట్లు మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకు డబ్బింగ్‌ పనులు ప్రారంభం అయ్యాయి. పూజా కార్యక్రమాలు నిర్వహించి డబ్బింగ్‌ మొదలు పెట్టారు. సినిమాను సంక్రాంతికి విడుదల చేయాల్సి ఉండగా ఈ నెల చివరి వరకు లేదా డిసెంబర్‌ లో పస్ట్‌ కాపీ రెడీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. డిసెంబర్‌ చివరి వరకు సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసి విడుదలకు రెడీ చేయడం జరుగుతుందని యూనిట్‌ సభ్యులు అంటున్నారు. ఈమధ్య కాలంలో విడుదలకు ముందు ఇంత త్వరగా ఫస్ట్‌ కాపీ రెడీ కావడం అరుదుగా చూస్తూ ఉంటాం. శ్రీను వైట్ల గత చిత్రాల ఫలితాన్ని పక్కన పెట్టి శర్వానంద్‌ నమ్మకంతో ఈ సినిమాను చేశాడు. మరి భోగి, జార్జ్‌ క్రిష్ సినిమాలతో శర్వానంద్‌ హిట్‌ కొట్టి ఈ ఏడాదిలో స్పెషల్‌ స్టార్‌గా నిలుస్తాడా అనేది చూడాలి.