Begin typing your search above and press return to search.

శర్వానంద్ 'బైకర్' గ్లింప్స్: చావుకి ఎదురెళ్లే కథ..

యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా గ్లింప్స్ రిలీజైంది, ఇది సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

By:  M Prashanth   |   1 Nov 2025 8:06 PM IST
శర్వానంద్ బైకర్ గ్లింప్స్: చావుకి ఎదురెళ్లే కథ..
X

చార్మింగ్ స్టార్ శర్వానంద్ తన ప్రతీ సినిమాకు ప్రాణం పెడతాడని, క్యారెక్టర్ కోసం ఎంతైనా కష్టపడతాడని పేరుంది. ఒకే ఒక జీవితం, మనమే లాంటి ఫీల్ గుడ్ మూవీస్ తర్వాత, ఇప్పుడు ఆయన తన కంఫర్ట్ జోన్ దాటి, తెలుగు సినిమాకు పూర్తిగా కొత్త జానర్‌ను పరిచయం చేస్తున్నాడు. అదే 'బైకర్'. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా గ్లింప్స్ రిలీజైంది, ఇది సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.




ఈ టీజర్ చూశాక ఫస్ట్ గుర్తొచ్చేది శర్వానంద్ డెడికేషన్. ఈ సినిమా కోసం పూర్తిగా లుక్ మార్చేశాడు. బరువు తగ్గి, చాలా లీన్‌గా, ఒక ప్రొఫెషనల్ డర్ట్ బైకర్‌గా పర్ఫెక్ట్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యాడు. టీజర్ మొత్తం హై ఆక్టేన్ బైక్ స్టంట్లు, రేసింగ్ విజువల్స్‌తో నిండిపోయింది. ఆ డర్ట్ ట్రాక్‌లపై బైక్స్‌ను నడిపిన తీరు, ఆ జంప్స్.. ప్రతీ ఫ్రేమ్ గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంది.

"ఇక్కడ ప్రతీ బైకర్‌కూ ఓ కథ ఉంటుంది. సమయంతో పోరాడే కథ, చావుకి ఎదురెళ్లే కథ, ఏం జరిగినా పట్టు వదలని మొండోళ్ల కథ" అంటూ బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే వాయిస్ ఓవర్, సినిమాలోని ఎమోషనల్ కోర్‌ను రివీల్ చేస్తోంది. ఇది కేవలం స్టైలిష్ యాక్షన్ సినిమా మాత్రమే కాదు, లైఫ్‌ను ఎడ్జ్‌లో చూసే డేర్‌డెవిల్స్ కథ అని అర్థమవుతోంది.

టీజర్ చివర్లో వచ్చే డైలాగ్ సినిమా ఫిలాసఫీని చెప్పేసింది. "గెలవడం గొప్ప కాదు, చివరి దాకా పోరాడటం గొప్ప". ఇది వింటుంటే, ఒక రేసర్‌గా శర్వానంద్ ఎమోషనల్ జర్నీని మనం చూడబోతున్నామనిపిస్తోంది. ఈ సినిమా కోసం శర్వా కేవలం లుక్ మార్చడమే కాదు, మూడు నెలల పాటు స్పెషల్‌గా డర్ట్ బైక్ రేసింగ్‌లో ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. డైరెక్టర్ అభిలాష్ రెడ్డి కంకర టేకింగ్ చాలా రియలిస్టిక్‌గా, హాలీవుడ్ స్టాండర్డ్స్‌లో ఉంది. ఆ రేసింగ్ రష్‌ను పర్ఫెక్ట్‌గా క్యాప్చర్ చేశాడు.

యూవీ క్రియేషన్స్ ప్రొడక్షన్ వాల్యూస్ ప్రతీ ఫ్రేమ్‌లో రిచ్‌గా కనిపిస్తున్నాయి. 'కాంతార' ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ టీజర్‌ను మరో లెవల్‌కు తీసుకెళ్లింది. మొత్తానికి, 'బైకర్' టీజర్ తెలుగు ఆడియెన్స్‌కు ఒక ఫ్రెష్, ఎగ్జైటింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ప్రామిస్ చేస్తోంది. ఫ్యామిలీ డ్రామాల నుంచి శర్వా తీసుకున్న ఈ కొత్త రూట్, ఆయనకు పెద్ద సక్సెస్ ఇచ్చేలాగే ఉంది. ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్ గా డిసెంబర్ 6న థియేటర్లలోకి రానుంది.