Begin typing your search above and press return to search.

శర్వా బైకర్.. రేసులో ఊహించని బ్రేక్

కేవలం 2Dలోనే కాకుండా, 3D మరియు 4DX ఫార్మాట్లలో కూడా 'బైకర్' రిలీజ్ కానుందట. రేసింగ్ సన్నివేశాలు, హై యాక్షన్ సీక్వెన్సులు 4DX లో చూస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది.

By:  M Prashanth   |   26 Nov 2025 10:20 PM IST
శర్వా బైకర్.. రేసులో ఊహించని బ్రేక్
X

సినిమా ఇండస్ట్రీలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాక వెనక్కి తగ్గడం అంటే ఫ్యాన్స్ కు కొంచెం నిరాశ కలిగించే విషయమే. చార్మింగ్ స్టార్ శర్వానంద్ నటిస్తున్న 'బైకర్' సినిమా విషయంలో కూడా ఇప్పుడు అదే జరిగింది. డిసెంబర్ 6న థియేటర్లలో దుమ్ములేపడానికి సిద్ధమైన ఈ రేసర్, సడెన్ గా బ్రేక్ వేశాడు. అయితే ఈ వాయిదా వెనుక సాధారణ కారణాలు కాకుండా, ఒక మైండ్ బ్లోయింగ్ ప్లాన్ ఉందని మేకర్స్ ఇచ్చిన అప్డేట్ ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది.

సాధారణంగా పోస్ట్ ప్రొడక్షన్ లేట్ అయ్యిందో, షూటింగ్ అవ్వలేదో వాయిదా వేస్తుంటారు. కానీ 'బైకర్' టీమ్ ఆలోచన వేరే లెవెల్ లో ఉంది. కేవలం సినిమాను చూపించడమే కాదు, ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. అందుకే అనుకున్న తేదీకి రాలేకపోతున్నామని, కానీ తిరిగి వచ్చేటప్పుడు మాత్రం అంతకు మించి ఉంటుందని ఒక అఫిషియల్ నోట్ ద్వారా క్లారిటీ ఇచ్చారు.

అసలు విషయం ఏంటంటే.. 'బైకర్' సినిమా విడుదల వాయిదా పడింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాని రెడీ చేయడానికి తమ కాస్ట్ అండ్ క్రూ నిద్రలేని రాత్రులు గడిపారని, అయితే అవుట్ పుట్ చూసాక ఇది కేవలం స్క్రీన్ మీద చూసే సినిమా మాత్రమే కాదని, అంతకు మించిన ఎక్స్ పీరియన్స్ అని అర్థమైందని మేకర్స్ తెలిపారు.

ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు సరికొత్త టెక్నాలజీతో తీసుకురాబోతున్నారు. కేవలం 2Dలోనే కాకుండా, 3D మరియు 4DX ఫార్మాట్లలో కూడా 'బైకర్' రిలీజ్ కానుందట. రేసింగ్ సన్నివేశాలు, హై యాక్షన్ సీక్వెన్సులు 4DX లో చూస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. ఆ అడ్రినలిన్ రష్ ను ఆడియన్స్ కు ఫీల్ అయ్యేలా చేయడానికే ఈ సమయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

తెలుగు సినిమా ఇప్పటివరకు చూడని భారీ స్కేల్ లో ఈ సినిమా ఉండబోతోందని చిత్ర యూనిట్ నమ్మకంగా చెబుతోంది. "హెల్మెట్లు టైట్ గా పెట్టుకోండి.. లైఫ్ టైమ్ రైడ్ కు సిద్ధమవ్వండి" అంటూ మేకర్స్ ఇచ్చిన వార్నింగ్ ఫ్యాన్స్ లో అంచనాలను పెంచేసింది. శర్వానంద్ కెరీర్ లోనే ఇదొక బెంచ్ మార్క్ సినిమాగా నిలిచే అవకాశం ఉంది. మొత్తానికి డిసెంబర్ 6న రావలసిన సినిమా వాయిదా పడినా, 3D మరియు 4DX రూపంలో రాబోతున్న ఈ గుడ్ న్యూస్ ఫ్యాన్స్ ను కూల్ చేసింది. కొత్త రిలీజ్ డేట్ ను త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు. మరి ఈ లేటెస్ట్ టెక్నాలజీతో శర్వానంద్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రేస్ ని చూపిస్తాడో చూడాలి.