Begin typing your search above and press return to search.

బైకర్ రైడ్ ఫిక్స్.. సమ్మర్ బరిలో శర్వానంద్

రీసెంట్ గా 'నారి నారి నడుమ మురారి' వంటి హిట్ అందుకున్న శర్వా, ఇప్పుడు మరో జాక్‌పాట్ కొట్టేలా కనిపిస్తున్నారు.

By:  M Prashanth   |   3 Feb 2026 9:45 PM IST
బైకర్ రైడ్ ఫిక్స్.. సమ్మర్ బరిలో శర్వానంద్
X

టాలీవుడ్‌లో వైవిధ్యమైన కథలను ఎంచుకోవడంలో శర్వానంద్ స్టైలే వేరు. లవ్ స్టోరీలైనా, ఎమోషనల్ డ్రామాలైనా తనదైన నటనతో మెప్పించే శర్వా, ఈసారి రూట్ మార్చి ఒక హై ఓల్టేజ్ అడ్వెంచర్‌తో వస్తున్నారు. బాడీ లాంగ్వేజ్ దగ్గరి నుండి లుక్ వరకు కంప్లీట్ మేకోవర్ అయిన శర్వానంద్, ఈ రేసింగ్ మూవీ కోసం పక్కాగా సిద్ధమయ్యారు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్‌కు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.





రీసెంట్ గా 'నారి నారి నడుమ మురారి' వంటి హిట్ అందుకున్న శర్వా, ఇప్పుడు మరో జాక్‌పాట్ కొట్టేలా కనిపిస్తున్నారు. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, ఈ సినిమాలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌కు తగ్గట్టుగా అడ్వెంచర్ సీక్వెన్స్‌లను ప్లాన్ చేశారట. సరికొత్త స్క్రిప్ట్‌తో వస్తున్న ఈ సినిమా రేసింగ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుందని టాక్. ఈ క్రమంలోనే మూవీ టీమ్ సినిమా విడుదల తేదీపై ఒక క్లారిటీ ఇచ్చింది.

అసలు విషయం ఏంటంటే ఏప్రిల్ 5న ఈ 'బైకర్' థియేటర్లలోకి రాబోతోంది. సమ్మర్ సెలవుల సీజన్‌ను పక్కాగా వాడుకోవాలని మేకర్స్ ఈ డేట్‌ను లాక్ చేశారు. స్కూల్స్, కాలేజీలకు హాలిడేస్ ఉండటంతో యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా భారీగా థియేటర్లకు వచ్చే అవకాశం ఉంది. శర్వానంద్ కి ఉన్న క్రేజ్ తో ఈ డేట్ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టడానికి పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు.

ఈ సినిమాతో సీనియర్ స్టార్ డాక్టర్ రాజశేఖర్ ఒక ఇంట్రెస్టింగ్ రోల్‌లో కమ్‌బ్యాక్ ఇస్తున్నారు. చాలా కాలం తర్వాత ఆయన స్క్రీన్ మీద కనిపిస్తుండటం కూడా సినిమాకు ఒక పెద్ద ప్లస్ పాయింట్. అలాగే మాలవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను యూవీ క్రియేషన్స్ సంస్థ ఎక్కడా రాజీ పడకుండా నిర్మిస్తోంది. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ విజువల్స్ పీక్స్‌లో ఉంటాయని మేకర్స్ నమ్ముతున్నారు.

సాధారణంగా రేసింగ్ సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. ఇప్పుడు శర్వానంద్ తన మేకోవర్ తో ఈ క్యారెక్టర్‌ను ఎంతవరకు జస్టిఫై చేస్తారనేది అందరినీ తొలుస్తున్న ప్రశ్న. ఈ అనౌన్స్‌మెంట్‌తో ఇక 'బైకర్' ప్రమోషన్స్ కూడా ఫుల్ స్పీడ్‌తో మొదలవ్వనున్నాయి. రిలీజ్ డేట్ పోస్టర్‌లో శర్వానంద్ లుక్ చూస్తుంటే ఈసారి థియేటర్లలో మోటార్ సైకిల్ సౌండ్స్ గట్టిగానే వినిపించేలా ఉన్నాయి. రేసింగ్ లవర్స్‌కు ఇది ఒక మంచి ట్రీట్ అని చెప్పాలి.

మొత్తానికి సమ్మర్ బాక్సాఫీస్ రేసులో శర్వానంద్ తన 'బైకర్' తో ముందు వరుసలో నిలిచారు. పక్కా ప్లానింగ్‌తో వస్తున్న ఈ సినిమా శర్వానంద్ కెరీర్‌లో ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలి. రాజశేఖర్ వంటి స్టార్ తోడవ్వడం ఈ సినిమా రేంజ్‌ను మరింత పెంచింది. మరి ఈ మోటార్ రేసింగ్ అడ్వెంచర్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో తెలియాలంటే ఏప్రిల్ 5 వరకు వెయిట్ చేయాల్సిందే.