శర్వానంద్ బైకర్.. ప్రెట్టీ బేబీ శాంపిల్..!
బైకర్ సినిమా నుంచి ఇదొక క్రేజీ సాంగ్ గా రాబోతుంది. ప్రెట్టీ బేబీ అంటూ హీరోయిన్ ని పొగుడుతూ హీరో పాడే పాటలా దానికి తగినట్టుగానే అదిరిపోయే స్టెప్పులు ఉండేలా ఉన్నాయి.
By: Ramesh Boddu | 12 Nov 2025 12:35 PM ISTఛార్మింగ్ స్టార్ శర్వానంద్ లీడ్ రోల్ లో అభిలాష్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా బైకర్. ఇండియాలోనే మొదటి బైక్ రేసర్ నేపథ్యంతో వస్తున్న సినిమాగా ఈ బైకర్ స్పెషల్ క్రేజ్ తెచ్చుకుంది. ఈ సినిమాలో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తుంది. యువి క్రియేషన్స్ బ్యానర్ లో వంశీ, ప్రమోద్ ఈ మూవీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి రీసెంట్ గా ఒక టీజర్ రాగా సినిమాపై హ్యూజ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఇక జిబ్రాన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలోని ఫస్ట్ సాంగ్ ప్రెట్టీ బేబీ సాంగ్ ప్రోమో వచ్చింది.
యమహా బైక్ మీద స్టెప్పు ఇంప్రెస్..
బైకర్ సినిమా నుంచి ఇదొక క్రేజీ సాంగ్ గా రాబోతుంది. ప్రెట్టీ బేబీ అంటూ హీరోయిన్ ని పొగుడుతూ హీరో పాడే పాటలా దానికి తగినట్టుగానే అదిరిపోయే స్టెప్పులు ఉండేలా ఉన్నాయి. ముఖ్యంగా ప్రెట్టీ బేబీ ప్రోమోలో యమహా బైక్ మీద స్టెప్పు ఇంప్రెస్ చేసింది. శర్వానంద్, మాళవిక నాయర్ జోడీ ఆకట్టుకుంది. బైకర్ సినిమా మీద శర్వానంద్ చాలా కాన్ ఫిడెంట్ గా ఉన్నాడు. సినిమాకు జిబ్రాన్ మ్యూజిక్ యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది.
అభిలాష్ ఈ సినిమాతో తెలుగు ఆడియన్స్ కి F1 రేసర్ స్థాయిలో బైక్ రేస్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వాలని చూస్తున్నారు. ఐతే ఈ జోనర్ సినిమాలు పెద్దగా రాలేదు. అందుకే శర్వానంద్ ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు. అంతేకాదు సినిమా కోసం రియల్ స్టంట్స్ కూడా చేశాడని చెబుతున్నారు. డిసెంబర్ 6న రిలీజ్ లాక్ చేసిన బైకర్ నుంచి ఫస్ట్ సాంగ్ గా ప్రెట్టీ బేబీ ప్రోమో వచ్చింది. ఇక ఫుల్ సాంగ్ ని గురువారం రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్.
శర్వానంద్ కి అర్జెంట్ గా ఒక హిట్..
యువి క్రియేషన్స్ బ్యానర్ ఈ సినిమా మీద భారీ బడ్జెట్ పెడుతున్నట్టు తెలుస్తుంది. సినిమా రషెస్ చూసే ఆడియన్స్ కి తప్పకుండా ఒక మంచి సూపర్ థ్రిల్ అందిస్తుందని చిత్ర యూనిట్ భావిస్తున్నారు. శర్వానంద్ కి అర్జెంట్ గా ఒక హిట్ కావాలి అందుకే బైకర్ కోసం చాలా కష్టపడుతున్నాడు. ఈ సినిమాలో తన లుక్, స్టైల్ అన్నీ కూడా అదిరిపోతాయని అంటున్నారు. ఈ సినిమా కోసమే సిక్స్ ప్యాక్ కూడా చేశాడు శర్వానంద్. ఈమధ్య వరుస సినిమాలు ఫెయిల్యూర్ అవ్వడంతో శర్వానంద్ ఎలాగైనా సరే బైకర్ తో హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యాడు. శర్వానంద్ బైకర్ ప్రెట్టీ బేబీ సాంగ్ ప్రోమో అయితే ఇంప్రెస్ చేసింది. ఫుల్ సాంగ్ ఎలా ఉండబోతుందో చూడాలి. శర్వానంద్, మాళవిక ఈ సాంగ్ లో మాస్ స్టెప్పులతో అలరించేలా ఉన్నారు.
