శర్వా రెండు సినిమాల్లో ఏది ముందు..?
సంక్రాంతికి అనుకున్న నారి నారి నడుమ మురారి కూడా పొంగల్ మిస్ అయితే మళ్లీ నెక్స్ట్ మంత్ రిలీజ్ కుదిరే ఛాన్స్ ఉండదు.
By: Ramesh Boddu | 5 Dec 2025 7:00 PM ISTయువ హీరో శర్వానంద్ రెండు సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. ఆల్రెడీ బైకర్ సినిమాను ఈ నెల 6న రిలీజ్ అనుకున్నారు. కానీ సినిమా అనుకోని కారణాల వల్ల వాయిదా వేస్తున్నామని ఈమధ్యనే మేకర్స్ ప్రకటించారు. బైకర్ కొంత వర్క్ పెండింగ్ ఉన్న కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. ఇక ఈ సినిమాతో పాటు శర్వానంద్ నారి నారి నడుమ మురారి సినిమా కూడా సంక్రాంతికి రిలీజ్ లాక్ చేశారు. ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను రాం అబ్బరాజు డైరెక్ట్ చేస్తున్నారు.
పొంగల్ కి సినిమా వస్తుందా లేదా..
2026 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ అనౌన్స్ చేయడంతో అమెజాన్ ప్రైమ్ డిజిటల్ రైట్స్ కూడా భారీ రేటుకి తీసుకున్నారు. ఐతే ఇప్పుడు సంక్రాంతి ఫైట్ గట్టిగా ఉన్న కారణంగా పొంగల్ కి ఈ సినిమా వస్తుందా లేదా అన్న డౌట్ మొదలైంది. ఆల్రెడీ బైకర్ సినిమా డిసెంబర్ 6 నుంచి పోస్ట్ పోన్ చేశారు. మేకర్స్ అనౌన్స్ చేయలేదు కానీ శర్వానంద్ బైకర్ ఫిబ్రవరిలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట.
సంక్రాంతికి అనుకున్న నారి నారి నడుమ మురారి కూడా పొంగల్ మిస్ అయితే మళ్లీ నెక్స్ట్ మంత్ రిలీజ్ కుదిరే ఛాన్స్ ఉండదు. సో 2026 సమ్మర్ లోనే ఆ సినిమా రిలీజ్ ఉంటుంది. సినిమాల రిలీజ్ విషయంలో ఇలా వాయిదాలు జరిగితే ఆడియన్స్ లో ఆ సినిమా మీద ఉన్న ఇంట్రెస్ట్ కాస్త తగ్గిపోతుంది. ఆ విషయంలో శర్వానంద్ కచ్చితంగా జాగ్రత్త పడాల్సిందే. శర్వానంద్ మనమే తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని ఈ రెండు సినిమాలు చేశాడు.
బైకర్ కోసం శర్వానంద్..
బైకర్ సినిమా కోసం అయితే శర్వానంద్ చాలా కష్టపడ్డాడని తెలుస్తుంది. సినిమాలో బైక్ రైడింగ్ సీన్స్ ని అదరగొట్టాడని టాక్. తెలుగు తెర మీద బైక్ రైడింగ్ నేపథ్యంలో ఇలాంటి సినిమా ఇప్పటివరకు రాలేదని మేకర్స్ అంటున్నారు. బైకర్ తో డిఫరెంట్ కాన్సెప్ట్ తో పాటు నారి నారి నడుమ మురారి సినిమాతో మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో వస్తున్నాడు శర్వానంద్. మరి ఈ రెండు సినిమాలు శర్వానంద్ కి మంచి కంబ్యాక్ ఇచ్చేలా చేస్తాయో లేదో చూడాలి.
టీజర్, ట్రైలర్ తో బజ్ తెచ్చుకున్నా సినిమాను అనుకున్న టైం కి రిలీజ్ చేయకపోతే ఆడియన్స్ లో ఒక నెగిటివిటీ ఏర్పడుతుంది. శర్వానంద్ రెండు సినిమాల రిలీజ్ విషయంలో ఈ కన్ ఫ్యూజన్ కొనసాగుతుంది. మరి ఈ రెండిటిలో ఏది ముందు వస్తుంది. ఏది నెక్స్ట్ రిలీజ్ అవుతుంది అన్నది తెలియాల్సి ఉంది. శర్వానంద్ మాత్రం ఈ రెండు సినిమాల అవుట్ పుట్ మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.
