Begin typing your search above and press return to search.

బిగ్ స్క్రీన్.. ఈసారి శర్వా హై వోల్టేజ్ సర్ ప్రైజ్!

కమర్షియల్ హంగులతో పాటు ఒక కొత్త తరహా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌ను ఈసారి టచ్ చేస్తున్నారు. ఇప్పటివరకు రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లలో చూసిన శర్వాను, ఈసారి ఒక ఛాలెంజింగ్ రోల్‌లో చూడబోతున్నాం.

By:  M Prashanth   |   7 March 2026 4:18 PM IST
బిగ్ స్క్రీన్.. ఈసారి శర్వా హై వోల్టేజ్ సర్ ప్రైజ్!
X

టాలీవుడ్‌లో వైవిధ్యమైన కథలను ఎంచుకోవడంలో శర్వానంద్ ఆలోచన విధాన డిఫరెంట్ గా ఉంటుంది. ఈ సంక్రాంతికి 'నారీ నారీ నడుమ మురారి' సినిమాతో మంచి ఎంటర్టైన్మెంట్ ను అందించిన శర్వా, ఇప్పుడు కంప్లీట్ గా రూట్ మార్చేశారు. కమర్షియల్ హంగులతో పాటు ఒక కొత్త తరహా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌ను ఈసారి టచ్ చేస్తున్నారు. ఇప్పటివరకు రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లలో చూసిన శర్వాను, ఈసారి ఒక ఛాలెంజింగ్ రోల్‌లో చూడబోతున్నాం.

దర్శకుడు అభిలాష్ రెడ్డి కంకర ఈ చిత్రాన్ని ఇండియాలోనే ఫస్ట్ మోటోక్రాస్ ఫిల్మ్‌గా ప్రెజెంట్ చేస్తున్నారు. సాధారణంగా మన దగ్గర బైక్ రేసింగ్ అంటే కేవలం యాక్షన్ సీన్లకే పరిమితం అవుతుంది, కానీ ఈ సినిమాలో రేసింగ్ అనేది కథలో ఒక ముఖ్యమైన భాగంగా ఉండబోతోంది. శర్వానంద్ ఒక ప్రొఫెషనల్ బైక్ రేసర్‌గా కనిపించబోతున్న ఈ మూవీలో రేసింగ్ సీక్వెన్స్ లు హైలైట్‌గా నిలుస్తాయని చిత్ర యూనిట్ చెబుతోంది.

ఈ సినిమా కేవలం రేసింగ్ ట్రాక్ చుట్టూనే కాకుండా, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా కూడా సాగనుంది. ముఖ్యంగా సీనియర్ నటుడు రాజశేఖర్ ఈ మూవీతో మళ్ళీ వెండితెరపై మెరవబోతున్నారు. ఆయన చేసే పాత్రకు సంబంధించిన గ్లింప్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ ని అందుకుంది. రేసింగ్‌లో ఉండే అడ్రినలిన్ రష్ తో పాటు ఇద్దరి మధ్య ఉండే ఎమోషన్స్ ఈ కథకు బలంగా నిలవనున్నాయట.

లేటెస్ట్ టెక్నాలజీని వాడుకుంటూ మేకర్స్ ఈ సినిమాను విజువల్ వండర్‌గా తీర్చిదిద్దారని తెలుస్తోంది. ఆడియన్స్‌కు ఒక అద్భుతమైన ఎక్స్ పీరియన్స్ ఇవ్వడానికి EPIQ, 4DX, PCX డాల్బీ సినిమా వంటి ప్రీమియం ఫార్మాట్లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. బైక్ రేసింగ్ సీన్లను బిగ్ స్క్రీన్‌పై చూస్తున్నప్పుడు ఆడియన్స్ ఆ ఫీల్‌ను ఎంజాయ్ చేసేలా మేకర్స్ జాగ్రత్తలు తీసుకున్నారు. టెక్నికల్ వాల్యూస్ పరంగా సినిమా చాలా రిచ్ గా ఉండబోతోంది.

యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ జోరుగా సాగుతోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీ థియేట్రికల్ హక్కులను భారీ మొత్తానికి దక్కించుకోవడంతో ట్రేడ్ వర్గాల్లో కూడా మంచి చర్చ జరుగుతోంది. మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ ప్రాజెక్ట్ శర్వా కెరీర్‌లో ఒక స్పెషల్ మూవీగా నిలిచే అవకాశం ఉంది. కొత్త జానర్ కావడంతో యూత్ ఈ సినిమాపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ఏప్రిల్ 3న విడుదల కాబోతున్న 'బైకర్' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో చూడాలి. సక్సెస్ ఫుల్ ప్రొడక్షన్ హౌస్ క్రేజీ కాస్టింగ్ ఉండటంతో అంచనాలు బాగానే ఉన్నాయి. ఇక శర్వానంద్ తన మేకోవర్ పర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తారో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.