శర్వానంద్ 'బైకర్': రేసింగ్ వెనుక ఉన్న అసలైన ఎమోషన్ ఇదే!
శర్వానంద్ హీరోగా అభిలాష్ కంకర దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా ‘బైకర్’ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.
By: M Prashanth | 28 March 2026 11:45 PM ISTశర్వానంద్ హీరోగా అభిలాష్ కంకర దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా ‘బైకర్’ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 3న థియేటర్లలోకి రానుంది. రేసింగ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథ కావడంతో, యూత్ లో ఈ ప్రాజెక్ట్ మీద మంచి అంచనాలు ఉన్నాయి. సినిమా ప్రమోషన్లలో భాగంగా దర్శకుడు రీసెంట్‌గా మీడియా ముందుకు వచ్చి కొన్ని ఆసక్తికరమైన విషయాలను రివిల్ చేశారు.
ఈ సినిమాను వంద శాతం థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేలా రూపొందించినట్లు దర్శకుడు తెలిపారు. దీనికోసం ప్రత్యేకంగా డాల్బీ విజన్ టెక్నాలజీని వాడారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ చూసిన వారంతా ఇందులోని సౌండ్ డిజైన్ గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు. థియేటర్లో ఆ ఇంపాక్ట్ మరింత ఎక్కువగా ఉంటుందని మేకర్స్ నమ్ముతున్నారు. కేవలం విజువల్స్ మాత్రమే కాకుండా, సౌండ్ పరంగా కూడా ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇవ్వనున్నట్లు ఇదివరకే క్లారిటీ ఇచ్చారు.
బైక్స్ అనేవి చాలా మందికి ఒక ఎమోషన్ అని, ఆ పాయింట్ చుట్టూనే ఈ కథను అల్లినట్లు అభిలాష్ వివరించారు. సినిమాలో కేవలం రేసింగ్ మాత్రమే ఉండదని, దాని వెనుక ఒక బలమైన ఫ్యామిలీ ఎమోషన్ కూడా ఉంటుందని చెప్పారు. ముఖ్యంగా తండ్రి, కొడుకుల మధ్య ఉండే బాండింగ్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుందని దర్శకుడు ధీమా వ్యక్తం చేశారు. యాక్షన్ సీక్వెన్స్‌లు చేస్తూనే, ఆ ఎమోషన్‌ను ఎక్కడా మిస్ కాకుండా జాగ్రత్త పడ్డట్లు తెలిపారు.
శర్వానంద్ ఈ సినిమా కోసం ఒక ప్రొఫెషనల్ బైకర్ లాగా కనిపించడానికి చాలా కష్టపడ్డారు. రేసింగ్ ట్రాక్ మీద అతను చేసే ఫీట్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని సమాచారం. గతంలో ఎప్పుడూ చూడని విధంగా శర్వానంద్ ఈ సినిమాలో చాలా స్టైలిష్‌గా ఉండబోతున్నారు. రేసింగ్ కు కావాల్సిన టెక్నికల్ డీటెయిల్స్ విషయంలో కూడా టీమ్ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని అర్ధమవుతుంది. షూటింగ్ సమయంలో రియల్ బైకర్ల సహాయంతో సీన్లను సహజంగా తీశారు.
ఏప్రిల్ 3న రాబోతున్న ఈ సినిమా సమ్మర్ రేసులో గట్టి పోటీ ఇచ్చేలా ఉంది. శర్వానంద్ కెరీర్‌లో ఇది ఒక విభిన్నమైన ప్రయత్నం కాబట్టి, ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. ఒక మంచి రేసింగ్ స్పోర్ట్ ని, ఫ్యామిలీ డ్రామాతో కలిపి చూపించడం వల్ల అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా చేరువయ్యే అవకాశం ఉంది. డాల్బీ విజన్ లో ఈ రేసింగ్ విజువల్స్ వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ చేస్తాయో మరికొద్ది రోజుల్లోనే తెలిసిపోతుంది.
