Begin typing your search above and press return to search.

సంక్రాంతి హీరోతో దిల్ రాజు రిస్క్ చేస్తున్నారా?

ఆ చిత్రాన్ని రీసెంట్ గా చూసిన దిల్ రాజు ఇంప్రెస్ అయ్యి, తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను దాదాపు రూ.23 కోట్ల భారీ మొత్తానికి సొంతం చేసుకున్నారని సమాచారం.

By:  M Prashanth   |   20 Feb 2026 12:00 AM IST
సంక్రాంతి హీరోతో దిల్ రాజు రిస్క్ చేస్తున్నారా?
X

టాలీవుడ్‌ లో కొంత కాలంగా రా కంటెంట్, లోకల్ మాస్ కథలతో వచ్చిన సినిమాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. బాక్సాఫీస్‌ ను కూడా షేక్ చేస్తున్నాయి. విలేజ్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన మూవీలు, ఎమోషనల్ డ్రామాలు, యాక్షన్ మాస్ ఎంటర్టైనర్లు ప్రేక్షకులను ఎక్కువగా మెప్పిస్తున్న టైమ్ లో హాలీవుడ్ టచ్‌ తో రేసింగ్ బ్యాక్‌ డ్రాప్‌ లో వచ్చే సినిమాలు ఎంతవరకు క్లిక్ అవుతాయన్న చర్చ ఇప్పుడు ఇండస్ట్రీలో మొదలైంది.

అదే సమయంలో స్టార్ ప్రొడ్యూసర్ కమ్ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు తీసుకున్న తాజా నిర్ణయం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ నటించిన నారీ నారీ నడుమ మురారి మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు దిల్ రాజు తీసుకుని మంచి లాభాలు అందుకున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి.

అదే నమ్మకంతో ఇప్పుడు శర్వానంద్ నెక్స్ట్ మూవీ బైకర్ పై కూడా భారీగా పెట్టుబడి పెట్టడం హాట్ టాపిక్‌ గా మారింది. బైకర్ మూవీ ఏప్రిల్ 3వ తేదీన వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతుండగా.. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. ఆ చిత్రాన్ని రీసెంట్ గా చూసిన దిల్ రాజు ఇంప్రెస్ అయ్యి, తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను దాదాపు రూ.23 కోట్ల భారీ మొత్తానికి సొంతం చేసుకున్నారని సమాచారం.

ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో ఇది పెద్ద డీల్‌ అని నెటిజన్లు, సినీ ప్రియులు కామెంట్లు పెడుతున్నారు. అయితే స్పోర్ట్స్ రేసింగ్ బ్యాక్‌ డ్రాప్‌ లో సాగే యాక్షన్ డ్రామాగా బైకర్ రూపొందుతుండగా.. బైక్ రేసర్ పాత్రలో శర్వానంద్ కనిపించనున్నారు. రేసింగ్, ఎమోషన్, ఫ్యామిలీ సెంటిమెంట్ తో కూడిన స్టోరీతో దర్శకుడు అభిలాష్ రెడ్డి కంకర రూపొందిస్తున్నారు.

హీరోయిన్‌ గా మాళవిక నాయర్ నటిస్తుండగా, కీలక పాత్రలో సీనియర్ నటుడు రాజశేఖర్ శర్వానంద్ తండ్రిగా కనిపించనున్నారని తెలుస్తోంది. ఇప్పటివరకు టాలీవుడ్‌ లో రేసింగ్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన సినిమాలు చాలా తక్కువ. అందుకే బైకర్ పై ఓవైపు ఆసక్తి, మరోవైపు రిజల్ట్ పై డౌట్ ఉంది. అయితే యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఆ సినిమాకు కొత్త జానర్, స్టైలిష్ ట్రీట్మెంట్, టెక్నికల్ వాల్యూస్ ప్లస్ అవుతాయని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

ఏదేమైనా నారీ నారీ నడుమ మురారి హిట్‌ తో వచ్చిన జోష్‌ ను శర్వానంద్ కొనసాగించాలంటే బైకర్ తప్పనిసరిగా హిట్ అవ్వాలి. అదే సమయంలో రీసెంట్ గా యశ్ టాక్సిక్ రైట్స్ ను పెద్ద మొత్తంతో దక్కించుకుని, ఇప్పుడు బైకర్ ను భారీ రేటుకు హక్కులు కొనుగోలు చేసిన దిల్ రాజుకు ఇది రిస్క్ డీల్‌ గా మారుతుందా? లేక మరో సక్సెస్ స్టోరీ అవుతుందా? అన్నది రిలీజ్ తర్వాత తేలనుంది. మరి బైకర్ ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.