Begin typing your search above and press return to search.

రఫ్ అండ్ టఫ్ లుక్‌లో శర్వా.. 'బైకర్' క్రేజీ లుక్!

ఒక నటుడిగా ప్రతీసారి కొత్తగా కనిపించాలని, ప్రేక్షకులకు ఫ్రెష్ ఫీలింగ్‌ను ఇవ్వాలని తపించే హీరోలు కొందరే ఉంటారు.

By:  M Prashanth   |   20 Oct 2025 1:43 PM IST
రఫ్ అండ్ టఫ్ లుక్‌లో శర్వా.. బైకర్ క్రేజీ లుక్!
X

ఒక నటుడిగా ప్రతీసారి కొత్తగా కనిపించాలని, ప్రేక్షకులకు ఫ్రెష్ ఫీలింగ్‌ను ఇవ్వాలని తపించే హీరోలు కొందరే ఉంటారు. ఆ జాబితాలో యంగ్ అండ్ చార్మింగ్ స్టార్ శర్వానంద్ ఎప్పుడూ ముందుంటాడు. రొటీన్ కమర్షియల్ ఫార్మాట్లకు భిన్నంగా, సక్సెస్ ఫెయిల్యూర్స్ సంబంధం లేకుండా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇప్పుడు మరోసారి, తన కెరీర్‌లోనే ఒక సరికొత్త, డేరింగ్ అటెంప్ట్‌తో మన ముందుకు రాబోతున్నాడు.





తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్పోర్ట్స్ డ్రామాలు అప్పుడప్పుడు వస్తుంటాయి. కానీ, బైక్ రేసింగ్, అదీ డర్ట్ బైక్ రేసింగ్ లాంటి జానర్‌ను మనవాళ్లు పెద్దగా టచ్ చేయలేదు. ఈ జానర్‌కు కావాల్సిన టెక్నికల్ వాల్యూస్, హీరో డెడికేషన్ చాలా ఎక్కువగా ఉండాలి. అందుకే, ఈ జానర్‌ను ఎంచుకోవడానికి చాలామంది వెనకడుగు వేస్తారు. కానీ, ఇప్పుడు ఒక స్టార్ హీరో ఆ సవాల్‌ను స్వీకరించడానికి సిద్ధమయ్యాడు.

ఆ హీరోనే శర్వానంద్. ఆయన నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్‌ను దీపావళి కానుకగా మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి 'బైకర్' అనే పవర్‌ఫుల్, యాప్ట్ టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తూ, సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.

ఈ పోస్టర్‌లో శర్వానంద్ మేకోవర్ చూసి అందరూ షాక్ అవుతున్నారు. నిజమైన డర్ట్ బైక్ రేసర్‌లా, రఫ్ అండ్ టఫ్ లుక్‌లో అదరగొట్టాడు. రేసింగ్ సూట్, ఇంటెన్స్ ఎక్స్‌ప్రెషన్, బురదలో దూసుకుపోతున్న బైక్.. ఇవన్నీ సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతోందో హింట్ ఇస్తున్నాయి. ఈ పాత్ర కోసం శర్వా ఎంతలా కష్టపడ్డాడో, ఎంతలా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యాడో ఈ ఒక్క పోస్టర్‌తోనే అర్థమవుతోంది.

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను అభిలాష్ కంకర డైరెక్ట్ చేస్తున్నాడు. టాలీవుడ్‌లోని టాప్ ప్రొడక్షన్ హౌస్‌లలో ఒకటైన యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో, ఏమాత్రం రాజీ పడకుండా నిర్మిస్తోంది. చాలా కాలంగా నిర్మాణంలో ఉన్న ఈ చిత్రం, ప్రేక్షకులకు ఒక యూనిక్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇవ్వాలనే లక్ష్యంతో టీమ్ ఎంతో శ్రద్ధగా పనిచేస్తోందని తెలుస్తోంది. మొత్తం మీద, ఒక కొత్త జానర్, శర్వానంద్ డెడికేషన్, యూవీ క్రియేషన్స్ ప్రొడక్షన్ వాల్యూస్.. 'బైకర్'పై భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి. లవర్ బాయ్‌గా, ఫ్యామిలీ హీరోగా మెప్పించిన శర్వానంద్, ఈ యాక్షన్ లో ఎంతవరకు ఆకట్టుకుంటాడో చూడాలి.