అల్లు సినిమాస్ లో 'బైకర్'.. స్టన్నింగ్ విజువల్స్ కు అంతా ఫిదా!
ముఖ్యంగా భారీ తెరపై కనిపించిన విజువల్స్, రేసింగ్ సన్నివేశాలు ఎంతో స్టన్నింగ్ గా ఉన్నాయని వారంతా అభిప్రాయపడ్డారు.
By: M Prashanth | 13 March 2026 9:15 PM ISTటాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం కెరీర్ పరంగా మంచి ఫామ్ లో కొనసాగుతున్నారని చెెప్పాలి. సంక్రాంతి సందర్భంగా విడుదలైన నారీ నారీ నడుమ మురారి చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న ఆయన.. ఇప్పుడు మరో విభిన్నమైన ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ డ్రామా బైకర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ముఖ్యంగా ఇది తెలుగులోనే కాదు.. ఇండియాలోనే రూపొందుతున్న తొలి మోటోక్రాస్ రేసింగ్ నేపథ్యంలోని సినిమా కావడం విశేషం. ఆ మూవీకి సంబంధించిన టీజర్ ను తాజాగా ఐకాన్ అల్లు అర్జున్ కు చెందిన హైదరాబాద్ లోని అల్లు సినిమాస్ థియేటర్ లో డాల్బీ సౌండ్ సిస్టమ్ లో ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఆ ప్రివ్యూ షోకు హాజరైన మీడియా ప్రతినిధులు టీజర్ ను చూసి ఫిదా అయినట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా భారీ తెరపై కనిపించిన విజువల్స్, రేసింగ్ సన్నివేశాలు ఎంతో స్టన్నింగ్ గా ఉన్నాయని వారంతా అభిప్రాయపడ్డారు. డాల్బీ సౌండ్ ఎఫెక్ట్స్ కారణంగా యాక్షన్ సీన్స్.. మరింత థ్రిల్లింగ్ గా అనిపించాయని తెలిపారు. ఈ జానర్ లో తెలుగులో ఇంతకు ముందు సినిమా రాలేదని, అందుకే ఇది ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు ఆ విషయం ఇప్పుడు వైరల్ గా మారింది.
అయితే బైకర్ చిత్రాన్ని వేసవి సెలవులు లక్ష్యంగా చేసుకుని ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేసింది. భారీ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషనల్ డ్రామా సినిమాలో ప్రధాన ఆకర్షణగా ఉండనుందని సమాచారం. కాగా.. మూవీ కోసం శర్వానంద్ ఎంతో కష్టపడ్డారని ఇప్పటికే వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ద్వారా క్లియర్ గా తెలుస్తోంది.
ప్రొఫెషనల్ బైక్ రైడర్ పాత్రలో కనిపించేందుకు ఆయన తన బాడీని పూర్తిగా మార్చుకున్నారు. ఫిట్ నెస్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో పాటు, బైక్ రేసింగ్ కు సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ నేర్చుకోవడానికి కూడా స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నారు. ఆ పాత్రలో ఆయన పూర్తిగా ఒదిగిపోయారని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఇటీవల విడుదలైన పోస్టర్లు, టీజర్ గ్లింప్స్ లో శర్వానంద్ లుక్ అభిమానులను ఆకట్టుకుంది.
ఇక సినిమాలో హీరోయిన్ గా మాళవిక నాయర్ నటిస్తోంది. శర్వానంద్, మాళవిక నాయర్ మధ్య కెమిస్ట్రీ మూవీకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని తెలుస్తోంది. మరోవైపు సీనియర్ హీరో రాజశేఖర్ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన రోల్ కథలో ముఖ్యమైన మలుపు తిప్పే విధంగా ఉంటుందని సమాచారం. ఏదేమైనా కొత్త కాన్సెప్ట్ తో రూపొందుతున్న బైకర్ సినిమా టాలీవుడ్ లో ఆసక్తి రేకెత్తిస్తోంది. మరి ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి.
