భోగి వేదికకు కొత్త కళ తెచ్చిన శర్వానంద్ సిస్టర్స్
శర్వానంద్ ‘భోగి’ ట్రైలర్‌కు ఆన్‌లైన్‌లో మంచి స్పందన వస్తోంది. ట్రైలర్ లాంచ్ వేడుకలో ఆయనకు చెల్లెళ్లుగా నటించిన నలుగురు నటీమణులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అచ్చ తెలుగు అమ్మాయిలుగా, ఆత్మవిశ్వాసంతో మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నారు. వీరితో శర్వానంద్‌కు ఉండే ఎమోషనల్ సన్నివేశాలు సినిమాలో హైలైట్ కానున్నాయి. నవంబర్ 27న భోగి విడుదల కానుంది.
By: Sivaji Kontham | 23 Nov 2026 9:25 AM ISTశర్వానంద్ రా అండ్ ఇంటెన్స్ భోగి ట్రైలర్ విడుదలై అంతర్జాలంలో దూసుకెళుతోంది. ఈ ట్రైలర్ లాంచ్ వేడుకకు మఖ్యంగా శర్వానంద్ నలుగురు వెండితెర చెల్లెల్లు గొప్ప కళను తెచ్చారని చెప్పాలి. నిజానికి ట్రైలర్ లో కనిపించిన మాస్ రా అండ్ రస్టిక్ లుక్ కి వేదికపై ప్రమోషన్స్ కోసం ప్రిపేర్ అయి వచ్చిన లుక్ కి అస్సలు సంబంధం లేకుండా కనిపించిన చెల్లెమ్మలు అందరి దృష్టిని ఆకర్షించారు.
థియేట్రికల్ ట్రైలర్ విడుదలై అంతర్జాలంలో అద్భుత స్పందనలతో దూసుకెళ్తోంది. అయితే తాజాగా జరిగిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుకకు చిత్రంలో శర్వానంద్‌కు నలుగురు వెండితెర చెల్లెళ్లుగా నటించిన నటీమణులు ప్రత్యేక కళను తీసుకువచ్చారు. ట్రైలర్‌లో కనిపించిన మాస్, రస్టిక్ - గ్రామీణ లుక్‌కు.. ఈవెంట్ ప్రమోషన్స్ కోసం ఆకర్షణీయమైన గెటప్‌లలో వేదికపైకి వచ్చిన తీరుకు అస్సలు సంబంధం లేకపోవడంతో అందరి చూపు వారిపైనే నిలిచింది.
మన నేటివిటీతో కూడిన ఒక బలమైన కథలో అచ్చ తెలుగు అమ్మాయిలను ఎంపిక చేసి.. వారికి కీలక పాత్రల్లో అవకాశాలు కల్పించిన దర్శకుడు సంపత్ నంది, హీరో శర్వానంద్, నిర్మాత కెకె రాధామోహన్‌లను ప్రత్యేకంగా అభినందించాల్సిందే. వేదికపై ఈ నలుగురు నటీమణులు ఎంతో ఆత్మవిశ్వాసంతో.. చక్కటి తెలుగులో మాట్లాడిన తీరు అక్కడి వారిని ఆకట్టుకుంది. ఈ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న వీరంతా మునుముందు టాలీవుడ్ లో వర్ధమాన తారలుగా మరిన్ని మంచి అవకాశాలు అందుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని సినీ ప్రియులు ఆకాంక్షిస్తున్నారు.
మరోవైపు ఈ చిత్రంలో కథానాయికలుగా నటిస్తున్న అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి పాత్రలు కూడా ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతున్నాయి. ట్రైలర్ లాంచ్ వేడుక.. నిర్మాత, దర్శకులతో పాటు డింపుల్ హయాతి ఈ ఈవెంట్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. షూటింగ్ సమయంలో డింపుల్ హయాతి, అనుపమ పరమేశ్వరన్‌లతో తాము ఎంత సరదాగా, సొంత అక్కాచెల్లెళ్లలా కలిసిపోయామో శర్వానంద్ సిస్టర్స్ వేదికపై వివరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది.
వేదికపై తమ చలాకీతనంతో ఆకట్టుకునే ప్రసంగాలతో శర్వానంద్ వెండితెర చెల్లెళ్లు ట్రైలర్ లాంచ్ వేడుకను విజయవంతం చేశారు. ఈ సినిమాలో శర్వానంద్‌కు.. ఈ నలుగురు చెల్లెళ్లకు మధ్య ఉండే ఎమోషనల్ సన్నివేశాలు ప్రధాన హైలైట్‌గా నిలవనున్నాయని ట్రైలర్ ద్వారా స్పష్టమవుతోంది. నవంబర్ 27న ఈ చిత్రం థియేటర్లలోకి విడుదల కానుంది.
