శర్వానంద్ భోగి.. ఒక్క సినిమాపై ఇన్ని ట్విస్టులేంటో..?
సినిమాకు సంబందించిన మేజర్స్ సీన్స్ ఈ షెడ్యూల్ లో షూట్ చేస్తున్నారట. భోగి సినిమా విషయంలో ఏం జరుగుతుందో ఆడియన్స్ కి అర్ధం కావట్లేదు.
By: Ramesh Boddu | 7 Oct 2025 11:10 AM ISTయువ హీరో శర్వానంద్ మనమే తర్వాత అభిలాష్ తో ఒక రేసింగ్ సినిమా మొదలు పెట్టాడు. ఆ సినిమా ఎంతవరకు వచ్చిందో అప్డేట్ రాలేదు. ఇక నెక్స్ట్ రామ్ అబ్బరాజు డైరెక్షన్ లో నారి నారి నడుమ మురారి సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లాడు. ఆ సినిమాను 2026 సంక్రాంతికి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక ఈ సినిమా తర్వాత సంపత్ నందితో శర్వానంద్ భోగి అనే సినిమా ఒకట్ అనౌన్స్ చేశారు. సినిమా అనౌన్స్ మెంట్ రోజే ఒక గ్లింప్స్ కూడా వదిలారు.
పీరియాడికల్ యాక్షన్ మూవీగా..
శర్వానంద్ భోగి సినిమాను కె.కె రాధామోహన్ నిర్మిస్తున్నారు. పీరియాడికల్ యాక్షన్ మూవీగా రాబోతున్న ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయట. ఐతే ఈలోగా సినిమాకు అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ అయ్యేలా ఉందని మేకర్స్ వెనకడుగు వేశారు. అంతేకాదు ఈ సినిమా నుంచి హీరో కూడా ఎగ్జిట్ అయ్యాడన్న వార్తలు వచ్చాయి. ఫైనల్ గా శర్వానంద్ భోగి సినిమా అప్డేట్ వచ్చింది. నెక్స్ట్ వీక్ ఈ సినిమాకు సంబందించిన లాంగ్ షెడ్యూల్ ఒకటి ప్లాన్ చేస్తున్నారట.
సినిమాకు సంబందించిన మేజర్స్ సీన్స్ ఈ షెడ్యూల్ లో షూట్ చేస్తున్నారట. భోగి సినిమా విషయంలో ఏం జరుగుతుందో ఆడియన్స్ కి అర్ధం కావట్లేదు. శర్వానంద్ మాత్రం ఈ సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడని తెలుస్తుంది. భోగి సినిమాను జనవరి కల్లా పూర్తి చేసి నెక్స్ట్ సమ్మర్ రిలీజ్ కి రెడీ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. శర్వానంద్ ఈ సినిమాతో పాటు అభిలాష్ తో చేస్తున్న సినిమా పనుల్లో కూడా బిజీగా ఉన్నాడు.
సంక్రాంతికి నారి నారి నడుమ మురారి..
నారి నారి నడుమమురారి ఎలాగు సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమా తర్వాత భోగినే రిలీజ్ చేసే ప్లానింగ్ లో ఉన్నాడు శర్వానంద్. ఈమధ్య స్టార్ సినిమాలే కాదు యువ హీరోల సినిమాలు కూడా రెండేళ్లు టైమ్ తీసుకుంటున్నారు. మరి సెట్స్ మీద ఇన్ని రోజులు ఉంటే సినిమా రిజల్ట్ తేడా వస్తే నిర్మాత మీద కచ్చితంగా భారం పడే ఛాన్స్ ఉంటుంది. శర్వానంద్ కెరీర్ అసలే హిట్ల కన్నా ఫ్లాపులే ఎక్కువ ఉన్నాయన్న టాక్ నడుస్తుంది. ఇలాంటి టైమ్ లో ఒక సినిమా నెలల పాటు సెట్స్ మీద ఉంటే అతనికి ఇబ్బందే. అందుకే సినిమాల విషయంలో ఇంకాస్త క్లారిటీగా ఉంటే బెటర్ అని చెప్పొచ్చు.
