ఈ నటుడికి టాలెంట్ ఉండి కూడా స్టార్ హీరో అవ్వకపోవడానికి కారణమేంటంటే..?
నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శర్వానంద్‌కు స్టార్ హీరో ఇమేజ్ మాత్రం దక్కలేదు. ‘ప్రస్థానం’, ‘రన్ రాజా రన్’ చిత్రాలతో తనలోని నటనా వైవిధ్యాన్ని చూపించినా ఆశించిన విజయాలు అందుకోలేకపోయారు. ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ‘భోగి’పై ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాతోనైనా స్టార్ హీరోల జాబితాలో చేరుతారా అనేది చూడాలి.
By: Gopi Velupala | 24 Nov 2026 9:18 AM ISTతెలుగు చలనచిత్ర పరిశ్రమలో నటులు తమ టాలెంట్ ని చూపిస్తూ సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతున్నారు... కొంతమంది హీరోలు తమ టాలెంట్ ని చూపించినప్పటికి సక్సెస్ లు లేకపోవడంతో వాళ్ళు స్టార్ హీరోలుగా మారే అవకాశం లేకుండా పోతుంది. నిజానికి శర్వానంద్ లాంటి నటుడు కెరియర్ స్టార్టింగ్ లోనే వైవిద్య భరితమైన పాత్రలను పోషించి ప్రేక్షకులను అలరించాడు. హీరోగా మారిన తర్వాత ఆయనకు సరైన సక్సెస్ దక్కలేదు. 'ప్రస్థానం' సినిమాలో ఆయన పోషించిన పాత్రకి విమర్శకుల నుంచి ప్రశంశలను అందుకున్నాడు. అలాగే రన్ రాజా రన్ మూవీలో కామెడీ చేస్తూ తనలోని కొత్త యాంగిల్ ను బయటికి తీశాడు. దాంతో నటుడిగా గొప్ప పేరు తెచ్చుకున్నప్పటికి స్టార్ హీరోగా మాత్రం మారలేకపోయాడు. తన వెనకాల వచ్చిన చాలామంది హీరోలు టాప్ పొజిషన్ కి వెళ్ళారు. కానీ శర్వానంద్ ఇప్పటికీ స్టార్ హీరో అనే ట్యాగ్ ను దక్కించుకోలేకపోతున్నాడు. ప్రస్తుతం ఆయన సంపత్ నంది దర్శకత్వంలో చేసిన 'భోగి' సినిమా మాస్ యాక్షన్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కింది. ఈ సినిమాతో ఆయన సక్సెస్ ని సాధించి స్టార్ హీరోల లిస్టులో చేరుతాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది...
ఇండస్ట్రీలో వాళ్ళకే గుర్తింపు ఉంటుందా?
సినిమా ఇండస్ట్రీలో విజయం సాధించిన హీరోలకు మాత్రమే గుర్తింపు దక్కుతుంది. టాలెంట్ ఎంత ఉన్న సక్సెస్ లేకపోతే వాళ్ళను పట్టించుకునే వారెవరు ఉండరు. అందుకే ఇండస్ట్రీ మొత్తం సక్సెస్ వెనకాల పరుగెడుతుంటుంది. కొన్ని సందర్భాల్లో నటన రాని వాళ్లు సైతం మంచి కథలను సెలెక్ట్ చేసుకొని విజయాలు సాధిస్తూ టాప్ హీరోలుగా రాణిస్తారు. కానీ నటనలో పట్టు ఉండి ఎలాంటి క్యారెక్టర్ అయినా పోషించే పోటెన్షియాలిటీ ఉన్న నటులను ఇండస్ట్రీ ఏదో ఒక రోజు టాప్ పొజిషన్ కి తీసుకెళ్తుందని ఇప్పటికి చాలా మంది విషయంలో ప్రూవ్ అయింది. ఇక రాబోయే రోజుల్లో మరి కొంతమంది టాప్ హీరోలుగా మారే అవకాశం ఉంది.
స్టార్ హీరో ట్యాగ్ ఎలా ఏర్పడుతుంది...
హీరోకి ఎప్పుడైతే సక్సెస్ వరిస్తుందో ఎక్కువ సంఖ్యలో అభిమానులు ఏర్పడుతారు. దానివల్ల అతని సినిమాను మొదటి రోజే చూడటానికి ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారు, భారీ ఓపెనింగ్స్ వస్తాయి. అలాంటి వాళ్లను స్టార్ హీరోలుగా పరిగణిస్తారు...మూవీ కోసం కేటాయించిన బడ్జెట్ లో దాదాపు 25% కలెక్షన్స్ ను మొదటి రోజు రాబట్టే హీరోలు మాత్రమే టాప్ హీరోలుగా గుర్తించబడతారు...
