శర్వానంద్ 'భోగి'.. యాక్షన్ మోడ్ ఆన్.. ఆ స్టిల్ చూశారా?
యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ సంపత్ నంది దర్శకత్వంలో 'భోగి' అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది.
By: M Prashanth | 21 Feb 2026 4:28 PM ISTటాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. సంక్రాంతికి 'నారి నారి నడుమ మురారి'తో మంచి హిట్ అందుకున్న శర్వా, ఇప్పుడు తన రూటు మార్చి కంప్లీట్ మాస్ యాక్షన్ మూవీతో రాబోతున్నారు. యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ సంపత్ నంది దర్శకత్వంలో 'భోగి' అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథ శర్వా కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతుండటం విశేషం.
ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే, హైదరాబాద్‌లో ఒక భారీ యాక్షన్ షెడ్యూల్ ప్రారంభమైంది. ఇందుకోసం చిత్ర యూనిట్ ప్రత్యేకంగా ఒక భారీ సెట్‌ను కూడా నిర్మించింది. ప్రముఖ స్టంట్ మాస్టర్ దిలీప్ సుబ్బరాయన్ ఆధ్వర్యంలో రెండు భారీ ఫైట్ సీక్వెన్స్‌లను ప్లాన్ చేశారు. షూటింగ్ స్పాట్ నుండి బయటకు వచ్చిన ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో శర్వా భుజంపై సుత్తి పట్టుకుని మాస్ లుక్‌లో కనిపిస్తుండటం సినిమాపై అంచనాలను పెంచేస్తోంది.
'భోగి' సినిమా కథ 1960ల నాటి సామాజిక పరిస్థితుల నేపథ్యంలో సాగబోతోంది. ఆ కాలం నాటి రస్టిక్ అండ్ ఇంటెన్సిటీని తీసుకురావడానికి డైరెక్టర్ సంపత్ నంది చాలా గ్రౌండ్ వర్క్ చేసినట్లు తెలుస్తోంది. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, కథలో మంచి ఎమోషనల్ డెప్త్ కూడా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమా కోసం శర్వానంద్ తన మేకోవర్‌ను కంప్లీట్‌గా మార్చేసి, ఒక కొత్త అవతారంలో కనిపించబోతున్నాడు.
సినిమాలో హీరోయిన్లుగా అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి నటిస్తున్నారు. ఈ ఇద్దరి పాత్రలు కూడా కథలో చాలా బలంగా ఉంటాయని సమాచారం. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ ఈ సినిమాను నిర్మిస్తుండగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన 'ఫస్ట్ స్పార్క్' వీడియోకు ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
టెక్నికల్ పరంగా కూడా ఈ సినిమా చాలా రిచ్ గా ఉండబోతోంది. కిరణ్ కుమార్ మన్నే ఆర్ట్ డైరెక్టర్‌గా, కిషోర్ కుమార్ అరోకియా సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు. 1960ల నాటి వాతావరణాన్ని వెండితెరపై కళ్ళకు కట్టినట్లు చూపించడానికి టీమ్ మొత్తం కష్టపడుతోంది. పాన్ ఇండియా లెవల్‌లో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ప్రస్తుతం జరుగుతున్న ఈ లాంగ్ షెడ్యూల్‌ను ఎక్కడా బ్రేక్ తీసుకోకుండా కంటిన్యూ చేయాలని శర్వా ఫిక్స్ అయ్యారట. శర్వానంద్ గత సినిమాలతో పోలిస్తే ఈ 'భోగి' చాలా డిఫరెంట్ వైబ్‌ని ఇస్తోంది. మరి ఈ మాస్ అడ్వెంచర్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని క్రేజీ అప్‌డేట్స్ త్వరలోనే రానున్నాయి.
